Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూల కాఫీ షాప్‌లోకి గణ మనిషి శ్రీను వచ్చి డ్రగ్స్ పెట్టేస్తాడు. కుమార్ చూసి అడగటంతో కాఫీ కోసం వచ్చానని అంటాడు. ఈ రోజు భర్త్‌డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కాఫీ లేదని కుమార్ చెప్పి పంపిస్తాడు. సిద్ధూ, ప్రేరణలు వస్తూ అతన్ని చూసి అడుగుతారు. వాటర్ క్యాన్లు తీసుకొచ్చానని చెప్తాడు. సిద్ధూకి అనుమానం వస్తుంది కానీ అతన్ని పంపేస్తారు.
గణ రోడ్డు మీద ఓ చోట కారు దగ్గర కూర్చొని టీ టిఫెన్ కానిస్తాడు. గణ ప్లానేంటో తెలుసుకొని ప్రేరణకు చెప్పాలని సుధాకర్ అనుకుంటాడు. ఇంతలో గణకి శ్రీను కాల్ చేసి డ్రగ్స్ పెట్టేశా అని చెప్తాడు. విషయం ఏంటా అని సుధాకర్ అనుకుంటూ గణతో కేఫ్ దగ్గరకు వెళ్తానని అంటాడు. నేను వస్తా వెళ్దాం.. కాసేపట్లో కేఫ్ మూసేస్తారు అని అంటాడు. ప్రేరణకి విషయం ఎలా చెప్పాలా అని సుధాకర్ అనుకుంటాడు.
సాహితి భర్త్‌డే వేడుక అని సిద్ధూకి తెలీదు.. ప్రేరణ విషయం సిద్ధూకి చెప్పదు. కుమార్, ప్రేరణ, సిద్ధూ కేఫ్‌లో డెకరేషన్ చేస్తారు. ప్రేరణ సిద్ధూని కేఫ్ బుక్ చేసుకున్న వాళ్లని రిసీవ్ చేసుకోమని చెప్పి బయటకు పంపిస్తుంది. సిద్ధూ వెళ్లి విజయానంద్ వాళ్లని చూసి షాక్ అయిపోతాడు. ప్రేరణ వచ్చి విజయానంద్, మంజులని రిసీవ్ చేసుకుంటుంది. సాహితి అన్నతో నువ్వేనా నాకు సర్‌ఫ్రైజ్ ఇచ్చేది నేను నీకు ఇచ్చా ఎలా ఉంది అని అంటుంది. ఇక్కడే భర్త్‌డే చేసుకోవాలని నీ పార్టనర్‌కి చెప్పా.. నీకు కూడా చెప్పొద్దని అర్డర్ వేశా అంటుంది. నిజంగా సర్‌ఫ్రైజ అయ్యా అమ్మా అని సిద్ధూ అంటాడు. అందరూ లోపలికి వెళ్తారు.
విజయానంద్ గణకి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. వచ్చేస్తున్నా కేఫ్ క్లోజ్ చేయిస్తా అని అంటాడు. సాహితి డెకరేషన్, కేక్ బాగుంది అని ప్రేరణ, సిద్ధూలకు థ్యాంక్స్ చెప్తుంది. విజయానంద్ సిద్ధూతో ఇది మీ ఇద్దరి కేఫ్ కదా ఇద్దరి పేరు పెట్టుకుండా ప్రేరణ పేరు మాత్రమే పెట్టావ్ ఏంటి అని అడుగుతాడు. అంత అవసరం లేదు అని అని అంటాడు. తను ఎక్కువ డబ్బు ఇచ్చిందా అని అంటే దానికి సిద్ధూ ప్రతీ విషయాన్ని నేను నీలా డబ్బుతో చూడలేను.. అని అంటాడు. విజయానంద్ మళ్లీ మాట్లాడుతుంటే సాహితి ఆపి నా భర్తడే అయిన వరకు మీరేం మాట్లాడొద్దు డాడీ అని చెప్తుంది.
సాహితి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తుంటే ఇంతలో గణ వాళ్లు ఎంట్రీ ఇస్తారు. సాహితి కేక్ తీసుకొని మొదటి తండ్రిని తల్లిని ఊరించి సిద్ధూకి పెడుతుంది. అందరూ నువ్వుకుంటారు. అప్పుడే గణ వచ్చి సాహితిని చూసి షాక్ అయిపోతాడు. అన్నయ్యా ఈ సాహితి సిద్ధూ గాడి చెల్లిలా అని అనుకుంటాడు. అందరూ గణని చూసి షాక్ అయిపోతారు. ఏంటి సీఐ గారు ఇలా వచ్చారు.. కాఫీ తాగడానికా అని విజయానంద్ అంటాడు. కాఫీ ఎక్కడైనా దొరుకుతుంది అని గణ అంటాడు. మీరేంటి ఇక్కడ అంటే మా అమ్మాయి భర్తడే సెలబ్రేషన్స్ అవుతున్నాయని అంటాడు. మాకు ఈ కేఫ్‌లో డ్రగ్స్ సప్లే అవుతున్నాయని సమాచారం వచ్చిందని అంటాడు గణ. మా కేఫ్ పరువు తీయాలనే ఇలా చేస్తున్నావ్ అని గణ అంటే తప్పుడు సమాచారం వెళ్లిపోండి అని సిద్ధూ అంటాడు. ఇదేదో కుట్రలా ఉంది ఇక్కడ అలాంటివి జరగవు అని మంజుల అంటే నిజమే కానీ మా డ్యూటీ మేం చేయాలి కదా అని గణ అంటాడు.
సిద్ధూ కోపంగా మీరు డ్యూటీ కాదు మాపై దాడి చేస్తున్నారు అని అంటాడు. చెక్ చేసుకోండి అని ప్రేరణ అంటుంది. పోలీసులు వెళ్తారు. డ్రగ్స్ తీసుకొచ్చి దొరికాయని చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.