Nindu Manasulu Serial Today Episode గణ ప్రేరణ దగ్గరకు వెళ్లి బాగా డబ్బున్నోడిని పట్టేశావ్ అని అంటాడు. ప్రేరణ కోపంగా చూస్తే ఏంటి నేను మాట్లాడింది తప్పా.. కోపం వస్తుందా అని అంటాడు. కోపం కాదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చేతికి పని చెప్పాల్సి వస్తుందని ప్రేరణ అంటుంది.
గణ ప్రేరణని వెటకారం చేస్తూ ఇలాంటి వాటికి పౌరుషం వచ్చేస్తుంది కానీ డబ్బున్న వాళ్లని బుట్టలో వేసుకోవడానికి ఇలాంటి పౌరుషాలు, సిగ్గు, పరువు ఏం ఉండవు సంస్కారాన్ని గంగలో కలిపేసి బతుకుతారు అనుకుంటా అని అంటాడు. నోరు జారుతున్నావ్ జాగ్రత్త అని ప్రేరణ అంటే మీరు మానం మర్యాద జారుతారు నేను నోరు జారితే తప్పా.. అయినా ఇలాంటివాటిలో నీకు మీ అమ్మ ట్రైనింగ్ ఇస్తుంది కదా.. తల్లి బాట చూపిస్తుంది కూతురు పయనిస్తుంది.. అయినా డబ్బున్న వాడిని చూడటం వల వేయడం మీ దారిలోకి తెచ్చుకోవడం ఎలా సాథ్యం అవుతుంది మీకు అని అంటాడు. వెళ్లి మీ అమ్మని అడుగు అని ప్రేరణ అంటుంది. మా అమ్మ పేరు ఎత్తితే నిన్ను.. అయినా మీ అమ్మలా మా అమ్మ కాదు.. క్యారెక్టర్ ఉన్న స్త్రీ మా అమ్మ. రాజశేఖరం ఏకైక భార్య అని అంటాడు. నా తల్లి దేవతరా ఆ దేవత కూడా రాజశేఖరం భార్య అని అంటుంది ప్రేరణ. వల వేస్తే భార్య అయిపోరు తాళి కడితేనే భార్య అవుతారు. అక్రమంగా పుడితే పిల్లలు అయిపోరు.. సక్రమంగా పుడితేనే పిల్లలు అవుతారు అని అంటాడు. మీ అమ్మకి మా నాన్న దొరికాడు ఇప్పుడు నీకు సిద్ధూ దొరికాడు అంటాడు.
సిద్ధూ వచ్చి నువ్వు ఇంకొక్క మాట మాట్లాడిన చంపేస్తా.. అనవసరంగా ఇంటికి వచ్చిన వెధవవి.. నా ఇంటికి వచ్చిన గెస్ట్‌ని మర్యాద లేకుండా మాట్లాడితే ఇక్కడే పాతేస్తా అంటాడు. నువ్వు ఒక సీఐతో మాట్లాడుతున్నావ్ అని గణ అంటే నువ్వు ఆ పదం పలికితే ఆ పదం అసహ్యించుకుంటుంది. 365 రోజులు మనుషుల్ని టార్చర్ చేయాలి అనుకుంటున్నావా.. ఒక్క రోజు అయినా మనిషిలా మాట్లాడవా అంటాడు. ఏంట్రా దీనిని వెనకేసుకొస్తున్నావ్ మీ ఇంటికి వచ్చా అని అంటున్నావా అంటే ఆడపిల్ల జోలికి వస్తే నీ ఇంటికి వచ్చి అయినా తంతా అని సిద్ధూ అంటాడు. నా గురించి నీకు తెలీదురా భవిష్యత్‌లో చుక్కలు చూపిస్తా అంటాడు. ఇంకోసారి ఈ ఇంటి వైపునకు వచ్చినా ప్రేరణ జోలికి వచ్చినా వైల్డ్‌గా రియాక్ట్ అవుతా అంటే గణ నవ్వుకొని వెళ్లిపోతాడు.
రాత్రి సాహితి, సిద్ధూ, శైలు, కుమార్, ప్రేరణ క్రాకర్స్ కాల్చడానికి బయటకు వస్తారు. అందరూ క్రాకర్స్ కాల్చుతారు. సాహితి పెద్ద పెద్ద బాంబ్లు కాల్చుతుంది. ప్రేరణని కూడా సిద్ధూ కాల్చమంటే ప్రేరణ భయపడుతుంది. దాంతో సిద్ధూ ప్రేరణని దగ్గరుండి కాల్చుతాడు. ప్రేరణ భయపడి సిద్ధూని హగ్ చేసుకుంటుంది. విజయానంద్, మంజు హగ్‌ని చూసి షాక్ అయిపోతారు.
సిద్ధూ దగ్గరుండి ప్రేరణతో కల్పిస్తాడు. మినిస్టర్ విజయానంద్‌తో ఆ అమ్మాయిలో ఏదో స్పెషల్ ఉందయ్యా.. అని అంటాడు. దాన్నే మానిప్యులేట్ చేయడం అని విజయానంద్ మంజు వినేలా చెప్తాడు. మా సిద్ధూ కూడా ఎవరితో కలవడు ఇప్పుడు కలిసి కాకర్స్ కాల్చుతున్నాడు నా ఇంటి ముందు అని అంటాడు. మంజు చాలా కోపంగా ఉంటుంది.
ఐశ్వర్య, ఇందిర ఇంటి బయట క్రాకర్ట్ కాల్చుతారు. రంజిత్ కూడా వస్తాడు. రంజిత్‌ని చూసిన ఐశ్వర్య కావాలనే చెప్తా నీ సంగతి అనుకొని పెద్ద పెద్ద బాంబ్‌లు పెడుతుంది. రంజిత్‌లో ఏం మార్పు ఉండదు. ఏంటి సార్ ఇంత సౌండ్ వచ్చినా ఇరిటేషన్ రావడం లేదా అని ఐశ్వర్య అడిగితే రంజిత్ చెవిలో ఉన్న రియర్ ఫోన్స్ తీస్తాడు. ఐశ్వర్య షాక్ అయిపోతుంది. ఇక ఐశ్వర్య రంజిత్‌ని తీసుకెళ్లి కుంపీలు వెలిగిస్తుంది.
ప్రేరణ వాళ్లు క్రాకర్స్ కాల్చుతారు. ప్రేరణ చీర దీపానికి తగిలితే శైలు చెప్తుంది. దాంతో సిద్ధూ ప్రేరణని లాగుతాడు. ప్రేరణ, సిద్ధూ హగ్ చూసి మంజు సిద్ధూ అని అరుస్తుంది. నలుగురిలో ఉన్నాం అని మర్చిపోయారా అని విజయానంద్ అంటాడు. మంజుతో వాళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతుందని రెచ్చగొడతాడు. మంజు కోపంగా వెళ్లిపోతుంది. అందరూ భోజనాలకు కూర్చొంటారు. ప్రేరణ వడ్డిస్తానని మంజుని కూర్చొమని అంటుంది. ఇంటి పనులు అన్నీ నీకు బాగా వచ్చు కదా అని విజయానంద్ అంటాడు. ఇక ప్రేరణ అందరికీ వడ్డిస్తుంది. సిద్ధూ ఓ కూర ఇష్టం లేదని అంటే ఒకసారి తింటే కదా నచ్చుతుందో లేదో కదా.. మీ అమ్మగారు అంత కష్టపడి చేసింది నీకోసమే కదా రుచి అయినా చూడు..ఈ లోకంలో ఏదైనా మారదు అంటే అమ్మ ప్రేమ మాత్రమే.. కేవలం అమ్మ ప్రేమ మాత్రమే ఇష్టాన్ని అయిష్టంగా మార్చగలదు. అయిష్టాన్ని ఇష్టంగా మార్చుతుంది అని అంటుంది. వాడికి అవన్నీ పట్టవు అని విజయానంద్ అంటే సిద్ధూ కాకరకాయ ఫ్రై వడ్డించమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.