Nindu Manasulu Serial Today Episode: సిద్ధూకు ఏమైనా జరుగుతుందేమోనని  వాళ్ల తల్లి చాలా భయపడుతుంది. నువ్వు ఆ ప్రేరణని మరిచిపోయి జాగ్రత్తగా ఉండాలని సిద్ధూకు వాళ్ల అమ్మ చెబుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ  ప్రేరణని మర్చిపోయేది లేదని...తన కష్టాలు నా కష్టాలేనని సిద్ధూ అంటాడు. నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని ఇలా భయపడటం బాగాలేదని అంటాడు. నాకు నువ్వు ఎంతో, ప్రేరణ కూడా అంతేనని అంటాడు. మీ ఇద్దరూ బాగుండటమే నాకు ముఖ్యమని చెబుతాడు. ఆ గణగాడి బారీ నుంచి ప్రేరణ కుటుంబాన్ని పూర్తిస్థాయిలో రక్షించే వరకు నేను తనకు అండగానే ఉంటానని చెబుతాడు. మరోసారి ఈ విషయం తన దగ్గర ప్రస్తావించవద్దని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతాడు. కొడుకు ఏమైపోతాడోనని తల్లి మంజుల చాలా భయపడుతుంది. 

Continues below advertisement

కోపంతో ఇంటికి వచ్చిన గణను వాళ్ల అమ్మ ఈశ్వరి నాన్న ఎక్కడని అడుగుతుంది. దీంతో గణ వాళ్ల అమ్మపై మండిపడతాడు. నీవల్లే నాన్న మనకు కాకుండాపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నాన్నను జాగ్రత్తగా చూసుకోమని చెబితే..ఆ ఐశ్వర్య వాళ్లకు అప్పగించావని మండిపడతాడు. కనీసం నాన్నను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా  కూడా  చూసుకోలేకపోయావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. వాళ్లు ఇంతపని చేస్తారని అనుకోలేదని..అందుకే పంపించానని అంటుంది. వాళ్లు నాన్నను దాచిపెట్టి మన దగ్గరే నాటకాలు ఆడుతున్నారని అంటాడు. దీంతో కానిస్టేబుల్ సుధాకర్‌ కల్పించుకుని వాళ్లకు కూడా వాళ్ల నాన్నఎక్కడ ఉన్నాడో తెలియదనుకుంటా సార్‌ అని అంటాడు. అందుకే మీరే మీనాన్నను  దాచిపెట్టి చూపించడం లేదని మీమీద కేసు పెట్టారు కదా అని అనగానే....ఈశ్వరీ ఆందోళన చెందుతుంది. ఏంటి నీమీదే కేసు పెట్టారా అని అడుగుతుంది. సిద్దూ కలిసి వచ్చి ఆ ప్రేరణ నామీద నా స్టేషన్‌లోనే కేసు పెట్టిందని చెబుతాడు. 

అక్కడ ప్రేరణ, ఐశ్‌తో కలిసి వాళ్ల అమ్మ భర్త కోసం ఎంతో ఏడుస్తుంటుంది. మీనాన్న అక్కడ లేక,ఇక్కడ లేక ఎక్కడికి వెళ్లిపోయారో తెలియడం లేదని బాధపడుతుంది. వాళ్లను సిద్ధూ ఓదార్చుతాడు. అన్నిచోట్ల వెతుకుతూనే ఉన్నాం...తప్పకుండా ఆయన కనిపిస్తారని భరోసా ఇస్తాడు. ఆ గణనే వాళ్ల నాన్నను దాచిపెట్టి ఇదంతా చేస్తున్నాడని సిద్ధూ అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సుధాకర్‌...నిజంగా వాళ్లకు కూడా ఏం తెలియదని చెబుతాడు. గణ వాళ్ల అమ్మ కూడా భర్త కోసం చాలా బాధపడుతోందని....గణను అడిగినప్పుడు కూడా అతని ఏమాత్రం నోరు జారలేదని చెబుతాడు. నిజంగా తన తండ్రి ఎక్కడ ఉన్నాడో గణకు కూడా తెలియనట్లు ఉందని చెబుతాడు.

Continues below advertisement

ఉదయం పోలీసులతో కలిసి గణ తన తల్లిని తీసుకుని ప్రేరణ వాళ్ల ఇంటికి వస్తాడు. మర్యాదగా మానాన్నను ఎక్కడ దాచి ఉంచారో చెప్పకపోతే...మీ అందరినీ లోపల వేస్తానని బెదిరిస్తాడు. దీంతో ప్రేరణ కూడా అంతే దీటుగా బదులిస్తుంది. ముందు మేం ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవాలని అడుగుతుంది. నువ్వే మానాన్నను  దాచిపెట్టావని కంప్లైంట్‌ ఇచ్చాం కదా...దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీస్తుంది. నీది కేవలం అనుమానం మాత్రమేనని....కానీ మీరు మానాన్నను తీసుకెళ్లారు అనడానికి  నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని గణ అంటాడు. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపించమని నిలదీస్తాడు.

వెంటనే వీళ్లను అరెస్ట్ చేయమని కానిస్టేబుల్‌ను ఆదేశించడంతో  సుధాకర్‌ వాళ్లను జీప్‌ ఎక్కమని చెబుతాడు. అప్పుడే అక్కడికి సిద్ధూ వస్తాడు. ఎందుకు వాళ్లను అరెస్ట్ చేస్తున్నావని నిలదీస్తాడు. తప్పు చేసినవాళ్లను అరెస్ట్ చేయకుండా  ఏం చేయాలని అంటాడు.అయితే ముందు తప్పు చేసిన మీ అమ్మను అరెస్ట్‌ చేసి  ఆ తర్వాత వాళ్ల సంగతి చూద్దామని అంటాడు. దీంతో కంగారుపడిపోయిన ఈశ్వరీ...నేను తప్పు చేయడం ఏంటని నిలదీస్తుంది. వీళ్లలా తప్పు చేయాల్సిన అవసరం తనకు లేదని అంటుంది.అవునా  అయితే మీకు ఓ వ్యక్తిని పరిచయం చేస్తాను ఉండండంటూ  పరాంకుశాన్ని పిలుస్తాడు. అతను ప్రేరణ వాళ్ల నాన్ను తీసుకుని అక్కడికి రావడంతో అందరూ షాక్‌ తింటారు.