Nindu Manasulu Serial Today February 24th: నిండు మనసులు: ఖాకీ డ్రస్ వేసి కథ షురూ చేసిన గణ! ప్రేరణకు కోటి ఖరీదు కట్టిన మంజుల!
Nindu Manasulu Serial Today Episode February 24th ప్రేరణ తప్పుడు మనిషి తనతో తిరగొద్దు అని గణ సిద్ధూకి చెప్తే సిద్ధూ గణకి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ఇందిర ఏడుస్తూ నా పరిస్థితి మీకు రాకూడదు అని కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను.. మీ నాన్న నాకు కట్టుకున్న భర్తే అయినా నన్ను అలా చూడనప్పుడు ఫ్రెండ్స్ అయిన నిన్ను, సిద్ధూ బాబుని ఇంకెలా చూపిస్తాడు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు నిజం చెప్పాడు.. అంటే ఏదో చేయాలి అనే కదా అంటుంది. సిద్ధూ మన పక్కన ఉన్నంత వరకు గణ మనల్ని ఏం చేయలేదు అని ప్రేరణ అంటుంది. నింద భరిస్తున్న నాకే ఆ బాధ తెలుసు మీరు నా మాట వినడంలేదు అని ఇందిర అంటుంది. సరే నువ్వు చెప్పినట్లు వింటాను.. సిద్ధూకి దూరంగా ఉంటాను.. అప్పుడు వాడు ఊరుకుంటాడా,, నేను ఎంత మంచిగా ఉన్న వాడు నా మీద నింద వేస్తాడు. అదే సిద్ధూ నా పక్కన ఉంటే నాకు ఏం కాకుండా చూసుకుంటాడు.. కానీ నీకు తెలియని నిజం ఇంకొకటి ఉందమ్మా,, గణ వాళ్ల నాన్నే మా నాన్న అని సిద్ధూకి ఎప్పుడో తెలుసు అని ప్రేరణచెప్తుంది.
ఐశ్వర్య, ఇందిర షాక్ అయిపోతారు. సిద్ధూకి ముందే విషయం తెలిసినా.. ఎప్పుడూ నన్ను ప్రశ్నించలేదు.. నన్ను తక్కువ చేయలేదు.. ఎందుకంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నానో తెలిసి.. నన్ను అర్థం చేసుకొని ఒక్క మాట అడగలేదు.. నన్ను ఇంతలా అర్థం చేసుకున్న సిద్ధూని కాదని నువ్వు చెప్పినట్లు ఒంటరిగా ఉండాలా.. సిద్ధూ లాంటి మంచి స్నేహితుడ్ని నేను వదులుకోను.. మనం గణ వల్ల బాధ పడుతున్నాం కానీ ఏ తప్పు చేయలేదు,.. నువ్వు ధైర్యంగా ఉండు అని అంటుంది. ఇక సిద్ధూ ప్రేరణ బైక్‌లో వెళ్తుంటారు. ప్రేరణ భుజం మీద చేయి వేయడంతో సిద్ధూ మనసులో ప్రేరణ జీవితాంతం నీతో ఇలాగే ప్రయాణించాలని ఉందని అనుకుంటుంటాడు.
సిద్ధూ బైక్‌కి గణ కారు ఎదురుగా తీసుకొచ్చి ఆపుతాడు. కళ్లు కనిపించడం లేదా అని సిద్ధూ అడిగితే గణ పోలీస్ డ్రస్‌లో ఎంట్రీ ఇస్తాడు. రాంగ్ పర్సన్‌ని ఎక్కించుకొని వస్తే ఇలాగే యాక్సిడెంట్స్ అవుతాయి బావ అని అంటాడు. దుష్టలతో ఎందుకు సిద్ధూ అని ప్రేరణ అంటే.. ఇలాగే మాట్లాడి మా బావని బుట్టలో వేసుకున్నావ్ అని అంటాడు. నా ఒంటి మీద ఖాకీ చూశావ్ కదా.. నేను తలచుకుంటే మళ్లీ మిమల్ని ఏ కేసులో అయినా ఇరికిస్తా.. అందుకే బావ నీ మంచి కోసం చెప్తున్నా.. ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్లతో తిరిగి మీ క్యారెక్టర్ పోగొట్టుకోవద్దు అంటాడు. సిద్దూ గణని కొట్టడానికి వెళ్లి డ్రస్ చూసి ఆగిపోతాడు. అనవసరంగా రెచ్చగొట్టకు అని సిద్ధూఅంటాడు. ప్రేరణ కోపంగా నీకేం పనిలేదారా అస్తమానం నాతో పెట్టుకుంటావ్ అని అడుగుతుంది. నువ్వు పెద్ద సెలబ్రిటీ మరి అని గణ అంటాడు. నీ హద్దుల్లో నువ్వు ఉండకపోతే ఈ సారి మళ్లీ ఎవరి కాళ్లు పట్టుకున్నా సరే నీ ఉద్యోగం నీకు రాదు అంటాడు. బావ నేను తప్పుడు మనుషులకు దూరంగా ఉండమని అంటున్నా అంటాడు. మీ నాన్నని కలిసిన రెండు నిమిషాల్లో ఆయన ఎలాంటివాడో తెలుసుకున్నా.. అంత మంచి వాడికి నువ్వు ఎలా పెట్టావ్‌రా.. మీ నాన్న పరువు కోసం ప్రేరణ అన్నీ భరిస్తూ ఉంటే నువ్వు ఇలా ఉన్నావ్,, కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అని అడుగుతాడు.
ప్రేరణ మా నాన్న కూతురు అన్నావ్ కదా.. అది కరెక్టేనా.. ప్రేరణ మా నాన్న కూతురు కాదు. అని అంటాడు. అది చెప్పాల్సింది నువ్వు కాదు మీ నాన్న అప్పటి వరకు ఏమైనా పిచ్చిగా మాట్లాడితే బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. సిద్ధూ ప్రేరణలు కేఫ్‌కి వెళ్లే సరికి అక్కడ జయకృష్ణ ఉంటాడు. ఇద్దరూ కంగారునే డీసీపీ దగ్గరకు వెళ్తాడు. మీ మీద అనుమానంతోనే ఇలావచ్చా అని డీసీపీ అంటాడు. వర్ష రాసిన లెటర్ సిద్ధూవాళ్లకి చూపించి అడుగుతాడు. వర్ష చెప్పింది అబద్ధం సార్ వర్షతో గణనే ఇలా చేయించుంటాడని అంటారు. మీరు ఇలా చెప్తారనే గణ చెప్పాడని అంటాడు. గణ మంచోడు అని రాసి సంతకం కూడా పెట్టింది. అసలు గణకి మీకు ఏంటి గొడవ నాకు అసలు నిజం తెలియాలి అంటాడు. వర్ష చెప్పిందే నిజం అనిపిస్తుంది. కానీ మిమల్ని నమ్మాలి అనిపిస్తుంది. ఎంక్వైరీ చేసి తెలుసుకుంటా అంటాడు. ఇక భార్యభర్తలుగా సంతకాలు చేసిన పేపరు తీసి ఇది నిజమా అబద్ధమా అని అడుగుతాడు. ప్రేరణకే నిజం చెప్పమని అడుగుతాడు.
మరోవైపు మంజుల ఇందిర ఇంటికి సూట్ కేస్ తీసుకెళ్తుంది. ఇందులో కోటి ఉంది.. కావాలి అంటే ఇంకా ఇస్తా.. అని అంటుంది. మాకు ఎందుకమ్మా అని ఇందిర అడిగితే నువ్వు నీ కూతుర్ని తీసుకొని ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలి అని అంటుంది. మేం వెళ్లిపోవడం ఏంటి అని ఇందిర అడిగితే నా కొడుకు గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడటం ఇష్టం లేదు.. అందుకే వీలైనంత త్వరగా మీరంతా వెళ్లిపోండి అంటుంది. అంటే ఏంటమ్మా నేను తప్పుడు మనిషిని నా పిల్లలు అక్రమ సంతానం అంటున్నారా అంటే అవన్నీ నాకు తెలీదు కానీ సిద్ధూని వదిలేసి.. మీరు ఎటైనా వెళ్లిపోండి అని అంటుంది. ఉన్న సమస్యలు సరిపోవు అంటే మీరు ఇప్పుడు కొత్త సమస్యలు తీసుకొచ్చారని బాధ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























