Nindu Manasulu Serial Today February 23rd: నిండు మనసులు: సిద్ధూ-ప్రేరణ బంధానికి పరీక్ష! మంజు షాకింగ్ నిర్ణయం.. మేం అక్రమ సంతానామా అని తల్లిని ప్రశ్నించిన ప్రేరణ?
Nindu Manasulu Serial Today Episode February 23rd ప్రేరణకి దూరంగా ఉండమని కేఫ్ వదిలేయమని సిద్ధూకి మంజు, విజయ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ప్రేరణతో మా నాన్న గురించి మా అమ్మకి చెప్పని విషయం కూడా నీకు చెప్పాను.. కానీ నువ్వు మాత్రం అసలు నిజం బయట పడే వరకు నాకు చెప్పలేదు.. అలా అని నిన్ను తప్పు పట్టడం లేదు.. కానీ నీ బాధ చెప్పుకోవడానికి నేను సరైన మనిషి అనిపించలేదా.. ఆ విషయంలో నువ్వు నన్ను పరాయివాడిలా చూశావా.. అంతేలే నేను నిన్ను నమ్మినంతగా నువ్వు నన్ను నమ్మలేదు అని అంటాడు.
ప్రేరణ చాలా బాధ పడుతుంది. అలా కాదు సిద్ధూ.. మా నాన్న ఎవరో తెలీకుండానే నువ్వు నాన్నకి కాపాడావు.. నిన్ను కాకుండా ఇంకెవరిని నమ్ముతాను అని అంటుంది. మరి నాతో నిజం ఎందుకు చెప్పలేదు అని సిద్ధూ అడిగితే అందరిలా నువ్వు ఎక్కడ నన్ను అవమానిస్తావో అనుకున్నా అంటే నువ్వు అలా చేస్తావని కాదు.. కానీ ఎవరు ఏమన్నా నేను భరిస్తా కానీ నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను అనిపించింది.. అందుకే చెప్పలేదు అని ఏడుస్తుంది. నీకు ఎందుకు అలా అనిపించింది నేను అంటే నీకు అంత స్పెషలా అని సిద్ధూ అడుగుతాడు. అవును అని చెప్పి ప్రేరణ వెళ్లిపోతుంది. సిద్ధూ చూస్తూ ఉండిపోతాడు.
మంజుల, విజయానంద్ సిద్ధూ ఇంటికి రాగానే పిలుస్తారు. సిద్ధూతో విజయానంద్ మీ అమ్మ నువ్వు ప్రేరణ నడుపుతున్న కాఫీ షాప్ పార్టనర్ షిప్‌ని పూర్తిగా వదిలేయమని చెప్తుంది అని అంటాడు. సిద్ధూ షాక్ అయిపోతాడు. నిజమా అమ్మ అంటే అవును అని మంజు అంటుంది గతిలేని వాడిలా అలా ఎందుకు మరీ అంత కావాలి అంటే నీకు నువ్వే మరో బ్రాంచ్ పెట్టుకో అంటుంది. ఇక నుంచి నువ్వు ప్రేరణకి దూరంగా ఉండు అని విజయానంద్ అంటాడు. ఇది మీ అమ్మ మాట అని చెప్తాడు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావ్ అమ్మా అని సిద్ధూ అడిగితే తన పుట్టుపూర్తోత్తరాలు ఇప్పుడే తెలిశాయి కదా అంటాడు. కేఫ్‌కి వెళ్లకూడదు అని మంజుల అంటుంది. ప్రేరణ ఎంత చేసిందో తెలిసి కూడా గణ మాటలు ఎలా నమ్ముతున్నావ్ అమ్మా అని అడుగుతాడు. వర్ష చెప్పింది కదా ప్రేరణని ఎలా నమ్ముతాం అని విజయ్ అడిగితే ప్రేరణని టార్గెట్ చేసి గణ ఇలా చేస్తున్నాడు అని సిద్ధూ అంటాడు.
ప్రేరణ ఇంటికి రాగానే ఇందిర, ఐశ్వర్యలు సిద్ధూ వాళ్ల అమ్మ ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. గణ వాళ్ల నాన్నే మా నాన్న అని తెలిసిపోయింది అని.. గణనే తెలిసేలా చేశాడని ప్రేరణ జరిగింది చెప్తుంది. గణకి ఉద్యోగం వచ్చిందని చెప్తుంది. ఐశ్వర్య, ఇందిర షాక్ అయిపోతారు. వర్షకి తన ప్రాణం కాపాడావు అని తెలిసి కూడా ఇలా చెప్తుందా అని ఐశ్వర్య తిడుతుంది. వాడికి ఉద్యోగం వచ్చింది అంటే వాడు ఏమైనా చేస్తాడు..ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. అందుకు ఇక నుంచి నువ్వు సిద్ధూకి దూరంగా ఉండాలి అని ఇందిర అంటుంది. ఏంటమ్మా అని ప్రేరణ షాక్ అయిపోతుంది. సిద్ధూతో ఇంతకు ముందు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు అలాగే ఉంటాను అని ప్రేరణ అంటే ఇందిర వద్దు అంటుంది. దాంతో ప్రేరణ నిజం చెప్పు అమ్మా మేం తప్పుడు పుట్టుకపుట్టామా అని అడుగుతుంది. దాంతో ఇందిర ప్రేరణని కొట్టడానికి చేయి ఎత్తుతుంది.
మరోవైపు సిద్ధూ తల్లితో నేను ప్రేరణని కేఫ్‌ని వదలను అంటాడు. గణ చెప్పిందే నిజం సిద్ధూ ప్రేరణ మాయలో పడిపోయాడు అని విజయ్ రాగాలు తీస్తాడు. తల్లిగా నీకు ఏం చేస్తే మంచో ఏం చేస్తే చెడో నాకు తెలీదు అంటావా.. నాతో నువ్వు ఉంటున్నావా.. ఎప్పుడూ ప్రేరణ ఒంటరిగా ఉందని వెళ్తున్నావ్.. నీకు ఈ అమ్మ కంటే తనే ఎక్కువా.. మరి నాకు భయం వేయదా అని అడుగుతుంది. నువ్వు ఎంత అడిగినా ఉపయోగం లేదని విజయ్ అంటే నువ్వు మా అమ్మ మనసు మార్చొద్దు అని సిద్ధూ అంటాడు. ప్రేరణ మనకు పరిచయం అయినప్పటి నుంచి మనల్ని ఫ్యామిలీగా చూసింది. మన కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి చెల్లిని కాపాడింది. గణనే వర్ష చేత అలా చెప్పించాడు.. అని అంటాడు. ప్రేరణ వర్షతో చెప్పించింది అని అంటే నువ్వు నమ్మవు అంతే కదా ఇద్దరి తండ్రి ఒక్కడే గణ చెడ్డవాడు అయితే ప్రేరణ చెడ్డది అవ్వాలి.. ప్రేరణ మంచిది అయితే గణ మంచోడు అవ్వాలి,, నీకు ప్రేరణ మాత్రమే మంచిదా అంటాడు. అదే ప్రశ్న నేను అడిగితే ఏం చెప్తావ్ అని మంజు అడిగితే ప్రేరణే మంచిది అని అంటాడు.
గణ ఈ విషయంలో ప్రేరణని ఎంత టార్చర్ చేస్తున్నాడో నాకు తెలుసు.. కానీ ఏ రోజు మనకి సలహా ఇవ్వలేదు.. మనకు ఎంత సాయం చేసిన మనిషికి కష్టం వస్తే మనం దూరంగా ఉండటం కరెక్టేనా అని అడుగుతాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుందని విజయ్ అంటే నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నువ్వు కరెక్టే అని సిద్ధూ అంటాడు. అవన్నీ కాదు నువ్వు ప్రేరణ కోసం వాళ్ల మధ్యలోకి వెళ్తే నాకు నచ్చదు.. వాళ్లకి దూరంగా ఉండు అని అంటుంది. నా ప్రతీ కష్టంలో ప్రేరణ తోడుగా ఉంది.. అలాంటి ప్రేరణని నేను వదులుకోను.. తన ప్రతీ కష్టంలో నేను తోడుగా ఉంటాను..ఇందులో ఎలాంటి మార్పు లేదు అని అంటాడు. ఇందిర ప్రేరణతో ఇప్పటికే నేను నింద మోస్తున్నా నువ్వు నాలా నింద మోయకూడదు అని జాగ్రత్త పడుతున్నా అని అంటుంది. నీకు సిద్ధూ బాబుకి ఉన్న స్నేహం గురించి వాడు ఎందుకు తప్పుగా ప్రచారం చేయడు అని ఇందిర అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























