అన్వేషించండి

Nindu Manasulu Serial Today February 18th: నిండు మనసులు: గణని మళ్లీ మంజుల నమ్మేస్తుందా! ప్రేరణని నిందించడానికి వర్ష సాక్ష్యం చెప్తుందా!

Nindu Manasulu Serial Today Episode February 18th గణకు మళ్లీ ఉద్యోగం రావడం సాహితిని పెళ్లి చేసుకోవడానికి ప్రేరణ మీద నింద వేసి మళ్లీ ఆ ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ విజయానంద్ ఇంటికి వస్తాడు. నాకు జరిగిన అవమానానికి అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటా అని అనుకుంటూ వెళ్తాడు. అత్తయ్యగారు, మామయ్యగారు అని మంజుల, విజయానంద్‌ని పిలుస్తాడు. అక్కడే ఉన్న సాహితి చూసి నువ్వా మళ్లీ ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. నువ్వు నన్ను ఎంతగా అసహ్యించుకున్నా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని గణ అంటాడు.

మంజుల, విజయానంద్ వచ్చి ఎవర్నా నీకు అత్తామామయ్య వెళ్లరా ఇక్కడి నుంచి అని అంటాడు. నేను ఏ తప్పు చేయలేదు.. అవన్నీ అబద్ధాలు అని చెప్పడానికి వచ్చా.. నేను నిజాయితీ పరుడిని ఏ తప్పు చేయలేదు అని మా పై అధికారులు ఇచ్చిన అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చానని అంటాడు. విజయానంద్ అపాయింట్ మెంట్ ఆర్డర్ చూసి.. నమ్మలేకపోతున్నా అని అంటాడు. ప్రేరణ వల్లే ఇదంతా అని తనే నా మీద కుట్ర చేసి ఇదంతా చేసిందని అంటాడు. నోర్ముయ్ ప్రేరణ గారు నాకు మంచే చేశారు అని సాహితి అంటుంది. ప్రేరణ మీద నిందలు వేయొద్దు అని మంజుల అంటుంది. నిజం ఏంటో మీరే ప్రేరణని అడిగి తెలుసుకోండి అని అంటాడు.

సిద్ధూ ప్రేరణ ఇంటికి వెళ్లి ప్రేరణను ప్రేమిస్తున్నా అని ఆంటీకి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఏది అయితే అది అయింది.. ఆంటీకి వెళ్లి విషయం చెప్పేస్తా అని అనుకుంటాడు. ఐశ్వర్యని మీ అమ్మ ఎక్కడ అని అడుగుతాడు. ఐశ్వర్య ప్రపోజ్ గురించి ఆలోచించి మా అమ్మ కోసం వచ్చావా మా అక్క కోసం వచ్చావా అని అడుగుతుంది. మీ అమ్మ కోసమే అని అంటాడు. ఇందిర ఎక్కడుందో ఐశ్వర్య చూపిస్తే సిద్దూ వెళ్లి ఆంటీ మీకు ప్రేరణ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. అయితే అక్కడ ఇందిర బదులు ప్రేరణ ఉంటుంది. ఏంటి నిన్నటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రేరణ అంటుంది. ఏం లేదు అని సిద్ధూ అనేస్తాడు. ఇంతలో ఇందిర వచ్చి సిద్ధూతో మాట్లాడితే సిద్ధూ వెనకాలే వెళ్లిపోతాడు. ఇందిర దగ్గరకు వెళ్లి ప్రేరణను ప్రేమిస్తున్నా అని చెప్పాలి అనుకుంటే ఇంతలో అక్కడికి ప్రేరణ రావడం చూసి షాక్ అయిపోతాడు. కాఫీ కావాలి అని ఇందిరకు చెప్తుంది. 

ప్రేరణ వచ్చి ఏంటి సిద్ధూ వింత వింతగా ప్రవర్తిస్తున్నావ్ అని అంటుంది. అలా ఏం లేదు.. ఆంటీ టీ అడిగితే కాఫీ చెప్పా అంటాడు. ప్రేరణ వెళ్లగానే ఐశ్వర్య వస్తుంది.. ఐశ్వర్యతో ఏంటి ఐషూ నాతో అబద్ధం చెప్పావ్.. మీ అమ్మ గురించి అడిగితే మీ అక్క కోసం చెప్పావ్.. అని అంటాడు. మళ్లీ ఇందిర దగ్గరకు వెళ్లి విషయం చెప్పాలి అనుకుంటాడు. ఐశ్వర్య ప్రేరణ దగ్గరకు వెళ్లి సిద్ధూ తేడాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటుంది. నాకు అదే అనిపిస్తుంది అని ప్రేరణ అంటుంది. సిద్ధూ విషయం చెప్పేలోపు మళ్లీ ప్రేరణ, ఐశ్వర్య అక్కడికి వస్తారు. ప్రేరణ మేం పెద్దవాళ్లం మాట్లాడుకుంటా మీరు వెళ్లండి అని అంటాడు. ఇందిర ఇద్దరినీ పంపేస్తుంది. సిద్ధూ ఇందిరతో ఆంటీ ఇది నా జీవితంలో ముఖ్యమైన విషయం.. కుమార్ ఎప్పటి నుంచో చెప్తున్నా వినలేదు. మధ్యలో ఇందిర మాట్లాడుతూ ఉంటే నా ఫ్లో పోగొట్టొద్దు అని అంటాడు. ఇంతలో మంజుల సిద్ధూకి కాల్ చేసి ప్రేరణని తీసుకొని అర్జెంటుగా ఇంటికిరా అని చెప్తుంది. 

సిద్ధూ విషయం చెప్పి ప్రేరణని తీసుకెళ్తాడు. ఇంటి దగ్గర ఇద్దరూ గణని చూసి కోపంగా లోపలికి వెళ్తారు. సిద్ధూ గణ కాలర్ పట్టుకొని రేయ్ ఎవరురా నిన్ను ఇంట్లోకి రానిచ్చిందిపోరా అని మెడపట్టుకొని గెంటేస్తే ఈ ప్రేరణ వల్లే బావ ఇదంతా అని అంటాడు. నేనేం చేశా అని ప్రేరణ గణని తిడుతుంది. నీ మాయలో వీళ్లు ఉన్నారు.. ఇప్పుడు నిజం చెప్పకపోతే ఎలా అని తనకు మళ్లీ ఉద్యోగం వచ్చిన విషయం చెప్తాడు. నన్ను మీ దృష్టిలో చెడ్డోడిని చేసి కుట్ర చేసింది ఈ ప్రేరణ అంటాడు. పదే పదే ఆ మాట అంటే చంపేస్తా.. ఉద్యోగం కోసం ఎవరి కాళ్లో పట్టుకొని ఉంటావ్.. నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుడివి అని అంటుంది. నీ పీడ వదిలేసిందని హ్యాపీగా ఉన్నాం.. మళ్లీ మమల్ని ఇబ్బంది పెట్టకు అని మంజుల అంటుంది. ఇంకోసారి నా మీద నిందలు వేస్తే అని ప్రేరణ అంటే వీడి అంతు నేను చూస్తా పోరా బయటకు అని గణని మళ్లీ సిద్ధూ నెట్టేస్తాడు. గణ ప్రేరణతో అసలు నేను ఏం పాపం చేశానే ఇంత కుట్ర చేస్తున్నావ్ అంటాడు. వర్షతో కూడా అబద్ధం చెప్పించావ్ అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. వర్ష చెప్పింది నువ్వు వినలేదా.. తను చెప్పిన ప్రతీది నిజం అని ప్రేరణ అంటుంది. దానికి గణ వర్ష చెప్పిందే నిజం అంటారు అంతేనా.. ఒకవేళ తను చెప్పింది అబద్ధం అయితే.. అసలు నిజం వేరే ఉంటే.. అప్పుడు ఇలాగే అంటారా అని గణ అంటాడు. ఇప్పుడు పిలిచి నిజం చెప్పమని అంటే చెప్తుంది అని ప్రేరణ అంటుంది. అయితే తన నోటితోనే నిజం వినండి అని గణ వర్షని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
పొదరిల్లు: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
నిండుమనసులు: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
Meghasandesam Serial Today march 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
Illu Illalu Pillalu Serial Today March 9th: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget