Nindu Manasulu Serial Today February 17th: నిండు మనసులు: ప్రేరణకి ప్రపోజ్ చేసిన సిద్ధూ.. లవ్యూ 2 చెప్పేసిన ప్రేరణ.. ఇదంతా నటనా! నిజమా!
Nindu Manasulu Serial Today Episode February 17th సిద్ధూ ప్రేరణకు కేఫ్లో ప్రపోజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode కుమార్ శైలుతో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తారని ఏర్పాట్లు చేస్తాడు. తీరా శైలుకి కేఫ్‌కి రమ్మని చెప్తే కుమార్‌ని వాయించేస్తుంది. బయటకు తీసుకెళ్లమని బెదిరిస్తుంది. దాంతో కుమార్ వెళ్లిపోతాడు. ఇక సిద్ధూ, ప్రేరణ కేఫ్ క్లోజ్ చేసి వెళ్తుంటే డీసీపీ కాఫీ కోసం వస్తాడు. సిద్ధూ తీసుకొస్తానని చెప్తాడు. ఇక డీసీపీ కేఫ్ అలంకరించి ఉండటం చూసి భలే ఉందని డీసీపీ చూడటానికి వెళ్తాడు. ప్రేరణ కూడా అప్పుడే చూసి ఏంటి సిద్ధూ ఇదంతా అని అడుగుతుంది. కుమార్ గాడు శైలు కోసం ఇదంతా ఏర్పాటు చేశాడు.. తనేమో బయటకు తీసుకెళ్లమని పట్టుపట్టింది అందుకే వాడు వెళ్లిపోయాడు.. ఇప్పుడు ఈయన లోపలికి వెళ్లారు ఏం చేస్తారో ఏంటో అని అంటాడు.
సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ లోపలికి వెళ్తారు. క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాట్లు చూసి డీసీపీ అదిరిపోయింది అని అంటాడు. ఏంటయ్యా మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే నేను వచ్చి ఇబ్బంది పెట్టానా అని అంటాడు. అలాంటిది ఏంలేదు సార్ అని సిద్ధూ అంటాడు. డీసీపీ వాళ్లతో ఈ సెటప్ చూస్తుంటే నాకు మీ ప్రేమ గురించి తెలుసుకోవాలని ఉంది అంటాడు. ప్రేరణ సిద్దూని కోపంగా చూస్తుంది. సిద్ధూ మనసులో ఓరేయ్ సిద్ధూగా ప్రతీసారి ఇలా ఇరుక్కుంటున్నావ్ ఏంట్రా అని అనుకుంటాడు. ఇద్దరూ నేరస్తుల్లా నిల్చొన్నారు.. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ఆ ఫీల్ ఏది అని అడుగుతాడు. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు అంటే ప్రేరణ సిద్ధూని చూపిస్తుంది. దాంతో సిద్ధూ అవును సార్ ఆ పాపాత్ముడిని నేనే అంటాడు. పాపాత్ముడు ఏంటయ్యా అంటే కాదు సార్ ఆ ప్రేమికుడిని నేను అంటాడు. ఇక మీరు వెళ్లండి సార్ అని సిద్ధూ అంటే నేను వెళ్లను నాకు లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం అని అంటాడు. మీ ఇద్దరూ కలిసే ఉండొచ్చు కదా అని అంటాడు. సార్ అని సిద్ధూ అరుస్తాడు. అర్థమైంది అని అంటాడు. ఏదో ఒకటి చేసి పంపేయ్ సిద్ధూ అని ప్రేరణ బతిమాలుతుంది.
డీసీపీ మాత్రం మళ్లీ ప్రేరణకి ప్రపోజ్ చేయమని అంటాడు. వద్దు అని సిద్ధూ అంటే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్ అని అంటాడు. అలా కాదు సార్ సిగ్గు అని సిద్ధూ అంటాడు. డీసీపీ మాత్రం వదలడు..సిద్ధూ మనసులో ప్రపోజ్ చేస్తే ఇది చంపేస్తుంది.. చేయకపోతే వాడు చంపేస్తాడు.. దేవుడా అనుకుంటాడు. డీసీపీ దూరంగా ఉండి చూస్తాను అని అంటాడు. సిద్ధూ గులాబి పట్టుకొని "ప్రేరణ ఒంటరిగా వెళ్తున్న నా జీవితంలోకి అనుకోకుండా నువ్వు వచ్చావ్.. అన్నీ తెలుసు అనుకునే నాకు తెలియని అనుభూతులు ఎన్నో చూపించావ్.. ఎదురు చూపులే తెలీని నాకు ఎన్ని జన్మలు అయినా ఎదురు చూసేలా చేశావ్.. సృష్టిలో స్నేహం మాత్రమే గొప్పది అని నమ్మాను. కానీ స్నేహానికి ప్రేరణ ప్రేమ అని నీ వల్లే తెలిసింది. అందుకే నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. నువ్వు దూరంగా ఉంటే నిన్ను మర్చిపోతాను అనుకుంటున్నావేమో.. నువ్వు ఉన్నది నా ఊహల్లో కాదు నా ఊపిరిలో.. నిన్ను మర్చిపోవాలి అంటే నా ఊపిరి ఆగిపోవాల్సిందే.. అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా.. ఐలవ్‌యూ ప్రేరణ" అని సిద్ధూ చెప్తాడు. ప్రేరణ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది.
డీసీపీ చూస్తూ ఉండటంతో ప్రేరణ గులాబి పువ్వు తీసుకొని కంగారు పడుతూ ఐలవ్‌యూ సిద్ధూ అని చెప్తుంది. సిద్ధూ అలా ప్రేరణని చూస్తూ ఉండిపోతాడు. ఇంత బాగా ప్రపోజ్ చేస్తే ప్రేమలో పడకుండా ఎలా ఉంటుంది సిద్ధూ అని డీసీపీ అంటాడు. డీసీపీ వెళ్లిపోయిన తర్వాత ప్రేరణ సిద్ధూ అని ప్రేరణ అరుస్తుంది. ఇదంతా నీ ప్లానే కదా.. కుమార్ ఒక షాక్ కదా.. ఇందాక నువ్వు చెప్పినవన్నీ నీ నోటి నుంచి వచ్చినట్లు కాదు మనసులో నుంచి వచ్చినట్లు ఉన్నాయి అంటుంది. సిద్ధూ కంగారు పడుతూ అంత బాగా నటించానా.. సూపర్ నేను అంటాడు. ఇంకోసారి ఇలాంటి సెటప్‌లు చేయొద్దు అని ప్రేరణ గులాబి పడేసి వెళ్లిపోతుంది. సిద్ధూ అది పట్టుకొని ప్రేరణ ఐలవ్‌యూ సిద్ధూ అని చెప్పడం గుర్తు చేసుకుంటుంది.
గణ తన మనిషికి కాల్ చేసి చెప్పింది గుర్తుంది కదా.. తోక జాడిస్తే ప్రాణం తీస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో సుధా వస్తే.. ఒక్కడివే వచ్చావా కొత్త పనిమనిషిని తీసుకురాలేదా అని గణ అడుగుతాడు. ఇక చచ్చినా పని మనిషిని తీసుకురాను అంటాడు. వాళ్ల వెనక ఎవరో ఉన్నారు సుధా.. లేకపోతే నేను ప్లాన్ చేస్తే నా ఉద్యోగం పోవడం ఏంటి అని అంటాడు. సార్ మీరు డీసీపీకి కలిసినా ఏం చెప్పలేదు అంటే ఆయనకు మీకు ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం లేదు అంటాడు. ఏం చేసి అయినా ఉద్యోగం సాధించుకుంటా.. నా శత్రువులన్ని సాధిస్తా అని అంటాడు.
కుమార్, సిద్ధూ కలిసి డ్రింక్ చేస్తుంటారు. సిద్ధూ కుమార్‌తో నువ్వు చెప్పింది నిజమేరా.. నేను ప్రేరణని ప్రేమిస్తున్నా అని అంటాడు. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసురా అని అంటాడు. ప్రేరణకు ప్రపోజ్ చేసిన విషయం చెప్తాడు. ప్రేరణ కూడా లవ్‌యూ టూ కూడా చెప్పేసింది కానీ అదంతా డీసీపీ ముందు నటించింది.. నేను ఇచ్చిన పువ్వు నా ముఖాన విసిరేసి వెళ్లిపోయింది అని అంటాడు. మళ్లీ ప్రేరణకు చెప్పేయమని అంటే లేదురా ముందు ప్రేరణ వాళ్ల ఇంట్లో చెప్పి వాళ్లు ఒప్పుకుంటే అప్పుడు ప్రేరణకు చెప్తా అంటాడు.
సిద్ధూ ప్రపోజ్ చేసిన విషయం గుర్తు చేసుకొని ప్రేరణ కోపంగా ఎంత ధైర్యం ఉంటే నాకే ప్రపోజ్ చేస్తాడా.. అని అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఐశ్వర్య వచ్చి ఏమైందని అంటే సిద్ధూ ప్రపోజ్ చేశాడు అందుకే ఈ ఫ్రస్టేషన్ అని ఫ్లోలో ప్రేరణ చెప్పేస్తుంది. లవ్ లెటరే రాయలేని వాడు ప్రపోజ్ చేశాడా.. ఇంతకీ ఎలా చెప్పాడు అని ఐశ్వర్య అడుగుతుంది. ఇప్పుడే కాల్ చేసి అడుగుతా ఈ విషయం అమ్మకి కూడా చెప్పాలి అని ఐశ్వర్య అంటే వద్దే అది ప్రపోజ్ కాదు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అని ప్రపోజల్ పెట్టాడని అంటుంది. ఐశ్వర్య ముఖం చూసుకొని నా చెవిలో పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా అని అడుగుతుంది. ఏదేదో ఊహించుకోకే ఏం లేదు వెళ్లి పడుకోవే అని ప్రేరణ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























