అన్వేషించండి

Nindu Manasulu Serial Today February 12th:నిండు మనసులు: మంజులకు ప్రేరణ సర్‌ఫ్రైజ్! సిద్ధూ-ప్రేరణల బంధంపై డీసీపీ సంచలన వ్యాఖ్యలు!

Nindu Manasulu Serial Today Episode February 12th మంజులకు ప్రేరణ వీడియో సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేయడం దాన్ని పాడు చేయాలి అని గణ కుట్ర చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode మంజుల పుట్టిన రోజు వేడుకలు మొదలవుతాయి. మినిస్టర్ వెళ్లిపోవాలని అంటున్నారు.. కేక్ కట్ చేయమని విజయానంద్ చెప్తాడు. సిద్ధూ ప్రేరణ వస్తే కేక్ కట్ చేసేద్దాం అని మంజుల అంటుంది. ఇద్దరూ అప్పుడే వస్తారు. విజయానంద్ ఇద్దరినీ చూసి సిద్ధూ ఒక్కడి అడ్డు తొలగిస్తే చాలు అనుకున్నా కానీ ఇప్పుడు ప్రేరణ కూడా తోడైంది అని అనుకుంటాడు. మినిస్టర్ మన ప్రత్యేక అతిథి కేక్ కట్ చేయాలి కదా లేట్ అయితే ఆయన ఫీలవుతారు అని విజయ్ అంటాడు. దానికి మంజుల కావొచ్చు కానీ ప్రేరణ నాకు ప్రత్యేక అతిథి.. తను సిద్ధూ లేకుండా కేక్ ఎలా కట్ చేయాలి అంటుంది. 

గణ ఒక్కడే కూర్చొని అత్తయ్య గారు మీ పుట్టినరోజున నేను కూడా సంతోషంగా విష్ చేయాలి అనుకున్నా కానీ సాహితి నా భార్య కాలేదు కదా.. దీనింతటికి కారణం అయిన ఆ సిద్ధూ, ప్రేరణల్ని అడ్డు పెట్టుకొని మీ అందర్ని బాధ పెడతా.. ఇక ఎవరూ తప్పించుకోలేరు అని అనుకుంటాడు. సిద్ధూ, ప్రేరణలు కేక్ కటింగ్‌కి ఏర్పాట్లు చేస్తారు. మినిస్టర్‌ పొలమారి దగ్గు రావడంతో శైలు నీరు తీసుకొని వస్తుంది. మినిస్టర్ తీసుకోడు దాంతో విజయానంద్ తీసుకొని ఇస్తాడు. శైలు నాన్న అనడం చూసిన డీసీపీ నాన్న తనే మీ కూతురా చెప్పలేదు ఏంటి సార్ అని శైలుతో మీ భర్త ఎక్కడమ్మా అని అడుగుతాడు. శైలు కుమార్‌ని పిలిచి పరిచయం చేస్తుంది. కేఫ్‌లో పని చేసే ఒకబ్బాయిని మీ అల్లుడిగా చేసుకున్నారు.. మీరు సూపర్ సార్.. మీరే నిజమైన ప్రజా నాయకుడు అని డీసీపీ అంటాడు. 

ప్రేరణ బయటకు వెళ్లి ఓ వ్యక్తితో మాట్లాడుతుంది. సరిగ్గా కేక్ కటింగ్ అయిన వెంటనే వీడియో ప్లే చేయమని అంటుంది. సిద్ధూ ఏమైందని అడిగితే ప్రస్తుతానికి సర్‌ఫ్రైజ్ తర్వాత అందరూ హ్యాపీగా ఫీలవుతారని అంటుంది. అమ్మ పుట్టిన రోజుకి ప్రేరణ స్పెషల్‌గా ఏదో ఇవ్వబోతుందని అనుకుంటాడు. మరోవైపు ఇందిర రాత్రి వేళ ఫోన్ తెచ్చుకోవడానికి గణ ఇంటికి వెళ్లాలి అనుకుంటుంది. అలాగే భర్తకి అమ్మవారి కుంకుమ పెట్టాలి అంటుంది. నేను వస్తా అని ఐశ్వర్య అంటే నువ్వు నాతో వస్తే ఇంకేమైనా ఉందా.. ఇన్ని రోజులు నేను దాచిన నిజం తెలిసిపోతుందని అంటుంది. ఈ టైంలో నిన్ను ఒంటరిగా పంపాను అని అక్కకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఇంటి బయటే దూరంగా ఉంటాను.. అని చెప్తుంది. 

ప్రేరణ పిలిచిన వీడియో గ్రాఫర్‌కి గణ ఫోన్ చేసి నేను చెప్పింది చేశావా.. అని అంటాడు. కాసేపట్లో వీడియో ప్లే చేస్తా అంటాడు. ఆ ప్రేరణ, సిద్ధూ అవమానంతో అక్కడే చచ్చిపోవాలి.. కేక్ కట్ చేసే ముందు నాకు వీడియో కాల్ చేయ్ నేను లైఫ్‌లో చూస్తా అని అంటాడు గణ. వీడియో గ్రాఫర్ వీడియో గణకి పంపిస్తాడు. అందులో సిద్ధూ, ప్రేరణలు కేసులో ఇరుక్కున్న వీడియో ఉంటుంది. ప్రేరణ ప్లాన్ చేసిన సర్‌ఫ్రైజ్ కాకుండా కేసు వీడియో అందరూ చూసేలా గణ ప్లాన్ చేస్తాడు. ఇక పుట్టిన రోజు వేడుకలు  మొదలవుతాయి. సిద్ధూ ప్రేరణని దగ్గరకు పిలుస్తాడు. పర్లేదు అని ప్రేరణ దూరంగా ఉంటుంది. మంజుల కూడా పిలుస్తుంది. పర్లేదు అని అంటుంది. మీ ఇద్దరూ పార్టనర్స్ కదా.. ఎందుకు అలా వేరుగా నిల్చొన్నారు అని డీసీపీ అంటాడు. అందరూ షాక్ అయి చూస్తే బిజినెస్ పార్టనర్స్ కదా అని అంటాడు. 

కేక్ కటింగ్ జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. గణ మొత్తం వీడియో కాల్‌లో చూస్తాడు. హ్యాపీ భర్త్డే అత్తయ్యా అని అనుకుంటాడు. మంజుల అందరికీ కేక్ కట్ చేసి తినిపిస్తుంది. బాగా నవ్వుతున్నారు అందరూ ఇంకాసేపట్లో ఈ నవ్వు ఉండదులే అని గణ అనుకుంటాడు. ఇక ప్రేరణ మంజులతో మీకు ఓ సర్‌ఫ్రైజ్ ఉంది అని చెప్తుంది. ఏంటమ్మా అని అంటే లైట్స్ ఆపి తెర మీద మంజుల చిన్ని నాటి ఫొటోలు నుంచి మంచి మంచి మెమూరీస్ అన్న వేస్తుంది. చివరకు హ్యాపీ భర్త్‌డే అమ్మా అని వేయిస్తుంది. మంజుల చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇలా అయింది ఏంటి అని గణ బిత్తరపోతాడు. మంజుల ప్రేరణకు చాలా థ్యాంక్స్ చెప్తుంది. ఇది నేను చేయలేదు ఆంటీ మీ అబ్బాయే చేయించాడు అని ప్రేరణ క్రెడిట్ మొత్తం సిద్ధూకి ఇస్తుంది. సిద్ధూ కూడా షాక్ అయిపోతారు. మీ కంటే సిద్ధూకి ఏం ఎక్కువ కాదు కదా అని అంటుంది ప్రరేణ. మంజుల సిద్ధూని హగ్ చేసుకుంటుంది. సిద్ధూ ప్రేరణకు థ్యాంక్స్ చెప్తాడు. డీసీపీ అందరి ముందు నాకు ఎందుకో సిద్ధూ, ప్రేరణలు బిజినెస్ పార్టనర్స్‌ కంటే లైఫ్ పార్టనర్స్‌గా బాగా అనిపిస్తున్నారు.. అని అంటాడు. అందరూ షాకింగ్‌గా చూడంటో నాకు అనిపించింది మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి వెళ్లిపోతాడు. విజయానంద్ మంజులని చూసి డీసీపీ వెళ్తూ వెళ్తూ బాంబ్ పేల్చాడు. మంజు అదే ఆలోచిస్తుందా ఏంటి అని అనుకొని అతను సరదాగా అన్నాడు.. నువ్వు అవేమీ పట్టించుకోకు అని అంటాడు. 

గణ మళ్లీ వీడియో గ్రాఫర్‌కి కాల్ చేస్తే సిద్ధూ ప్రేరణలు కాల్ లిఫ్ట్ చేసి నాటకాలు ఆడకురా నీ మనిషికి నాలుగు పీకితే నిజం చెప్పేశాడు అని అంటారు. గణ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Nindu Manasulu Serial Today March 7th: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
నిండుమనసులు: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
చిన్ని సీరియల్: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Cooking Gas Saving Tips : గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Embed widget