అన్వేషించండి
Nindu Manasulu Serial Today February 11th: నిండు మనసులు: సాహితికి అండగా ప్రేరణ! కాబోయే కోడల్ని ముద్దు పెట్టుకున్న మంజుల!
Nindu Manasulu Serial Today Episode February 11th పెళ్లి టాపిక్ ఎత్తి సాహితి ఫ్రెండ్స్ తనని ఏడిపించడం చూసిన ప్రేరణ ఫ్రెండ్స్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

నిండు మనసులు సీరియల్ టుడే ఎపిసోడ్
Source : https://www.hotstar.com/
Nindu Manasulu Serial Today Episode మంజుల భర్త్‌డే పార్టీకి డీసీపీ జయకృష్ణ వచ్చి ప్రేరణ, సిద్ధూలకు షాక్ ఇస్తాడు. ప్రేరణ, సిద్ధూల గురించి మీకు తెలియని ఒక విషయం తెలుసు అని అందరికీ చెప్తాడు. ఏంటా అని అందరూ అడుగుతారు. భార్యాభర్తలు అనే విషయం గురించి చెప్పేస్తాడేమో అని ప్రేరణ, సిద్ధూ భయపడతారు. కానీ డీసీపీ ఆ విషయం చెప్పకుండా వీళ్ల కేఫ్‌లో కాఫీ బాగుంటుందని కవర్ చేస్తాడు. అందరూ లోపలికి వెళ్లిపోతారు. ప్రేరణ సిద్ధూని కోపంగా చూస్తుంది.
కుమార్ దగ్గరకు సిద్ధూ వెళ్లి ఈ డీసీపీ సడెన్‌గా రావడం ఏంటి.. అని అంటాడు. విధిరా విధి.. అని అంటాడు. ఇంతలో ప్రేరణ కోపం అక్కడికి రావడం చూసి కుమార్ పారిపోతాడు. సిద్ధూ ప్రేరణని చూడకుండా.. కుమార్ అక్కడే ఉన్నాడని ఇదంతా ఆ ప్రేరణ వల్లేరా.. ఆ ప్రేరణ నన్ను అర్థం చేసుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు అని అంటాడు. తీరా చూస్తే అక్కడ కుమార్ ఉండడు.. ఏడి వీడు అని వెనక్కి చూస్తే ప్రేరణ ఉంటుంది. సిద్ధూ షాక్ అయి నన్ను ఇరికించేశాడు అని అనుకుంటాడు. నా వల్లా అని ప్రేరణ కస్సుబుస్సులాడుతుంది. డీసీపీని నువ్వే కదా రమ్మని చెప్పావ్.. అందరి ముందు వాడు నన్ను కోడలు అంటే కాదు అని నువ్వే చెప్పాలి కదా.. అంటే నువ్వు చెప్పే అబద్ధం నువ్వు నిజం చేయాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. అమ్మా తల్లీ నాకు అంత ఆలోచన లేదమ్మా,, అని అంటాడు. మన ఈ సమస్యకి నువ్వే ఏదో ఒక సొల్యూషన్ చూడు.. లేదంటే నువ్వు ఆగినా నేను ఆగను నిజం చెప్పేస్తా అని అంటుంది. ఇంతలో మంజుల పిలుస్తుందని శైలు పిలవడంతో ప్రేరణ వెళ్లిపోతుంది.
విజయానంద్ మినిస్టర్, డీసీపీలతో కలిసి టెండర్ గురించి మాట్లాడుతాడు. ఏ ప్రాబ్లమ్ రాకూడదు అని మీ సపోర్ట్ కావాలని అడుగుతాడు. డీసీపీ విజయానంద్‌తో మీ వల్ల పబ్లిక్‌కి కానీ సొసైటీకీ కానీ ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటే నా సపోర్ట్ మీకు ఉంటుందని అంటాడు. ఇక సిద్ధూని చూసి పిలుస్తాడు. మీ నాన్న ఇంత బిజినెస్ మెన్ అయితే నువ్వేంటి కేఫ్ పెట్టావ్ అని అడుగుతాడు. విజయానంద్‌తో మీ కొడుకు ఇలా చేస్తే మీరు వద్దు అనలేదా అని అడుగుతాడు. దానికి సిద్ధూ నా కాళ్ల మీద నాకు నిలబడాలి అంటేనే ఇష్టం సార్ అని చెప్తాడు. వెరీ గుడ్ అని డీసీపీ అంటాడు. నా మాట కూడా ఇదే సార్ అందుకే నేను కాదు అనలేదు అని విజయానంద్ అంటాడు. మరోవైపు ప్రేరణ మంజుల దగ్గరకు వెళ్లి మంజుల జ్యూస్ తీసుకెళ్తుంటే తీసుకొని నేను వెళ్తా మీకు ఇలాంటి పనులు ఎందుకు అంటుంది. ఎవరికి ఇవ్వాలి అని అడిగితే బయట డీసీపీ వాళ్లకి అని మంజుల అనడంతో మళ్లీ ఇరుక్కున్నా అని ప్రేరణ అనుకుంటుంది.
ప్రేరణ జ్యూస్ తీసుకొని వెళ్లి ఇస్తుంది. ప్రేరణని చూసి డీసీపీ విజయానంద్‌తో మీ అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. గొప్ప గొప్ప సంబంధాలు రెడీగా ఉన్నాయి సార్ కానీ మా వాడికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి.. అవి అయిపోగానే చేసేస్తాం అని అంటాడు. మీ అబ్బాయి ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని తనే మీ కోడలు అంటే అప్పుడేం చేస్తారు అని జేకే అడుగుతాడు. మా వాడు అలా ఎప్పటికీ చేయడు సార్.వాళ్ల అమ్మకి చెప్పకుండా సిద్ధూ ఏ పని చేయడు.. ఇక పెళ్లి ఎలా చేసుకుంటాడు,, అయినా తన కోసం కోటీశ్వరుల కూతుళ్లు ఎదురు చూస్తున్నారు.. వీలైతే వాళ్లలో ఒకర్ని చూస్తాం అని అంటాడు. ఆ మాటతో ప్రేరణ వెళ్లిపోతుంది. వెనకాలే సిద్ధూ వెళ్లిపోతాడు. ఇక డీసీపీ మినిస్టర్‌తో మీ అమ్మాయి పెళ్లి అయిందని తెలిసింది అని అంటే టాపిక్ మార్చడానికి విజయానంద్ పార్టీకి టైం అయిందని అందర్ని లోపలికి తీసుకెళ్తాడు.
సాహితి తన ఫ్రెండ్స్‌తో కలిసి కూర్చొని ఉంటుంది. అందరూ సాహితితో రాజకుమారుడు వస్తాడు.. అదీ ఇదీ అని పెళ్లి గురించి గొప్పలు చెప్పావ్ మరి మోసగాడికి ఎలా ఓకే చెప్పావేంటే అని అంటారు. పోలీస్ అనా మోసగాడికి ఓకే చెప్పేవని అంటారు. మంజుల, సిద్ధూ, ప్రేరణలు ఆ మాటల వింటారు. సాహితి కన్నీరు పెట్టుకోవడం చూస్తారు. ప్రేరణ కోపంగా ఆపుతారా ఇంకా.. తను అంత బాధపడుతుంటే ఇలా మాట్లాడుతారా మీరేం ఫ్రెండ్స్.. సాహితికి నిజంగానే రాజకుమారు వస్తాడు. అప్పుడు తను మిమల్ని పిలిచినా పిలవకపోయినా నేనే మీకు పిలుస్తాను అని అంటుంది. దాంతో అందరూ సాహితికి సారీ చెప్తారు. డీసీపీ కూడా మొత్తం చూస్తూ ఉంటాడు. సాహితి ఏడుస్తూ ప్రేరణని హగ్ చేసుకుంటుంది. సాహితితో ప్రేరణ నువ్వు సంతోషంగా ఉండాలి అనే ఆ నీచుడి నుంచి నిన్ను కాపాడుకున్నాం. అందుకే ఇంకెప్పుడూ ఏడ్వొద్దని చెప్తుంది. ఇక మంజుల ప్రేరణతో చిన్న పిల్లవి అయినా బాగా చెప్పావమ్మా.. నువ్వు ఏం ఇంటికి కోడలు అవుతావో కానీ ఆ ఇళ్లు చాలా అదృష్టం చేసుకుందమ్మా అని నుదిటి మీద ముద్దుపెట్టుకుంటుంది. సిద్ధూ, డీసీపీ చాలా హ్యాపీగా ఫీలవుతారు.
డీసీపీ ప్రేరణ, సిద్ధూలను పిలిచి మీరు నిజంగానే భార్యాభర్తలా అని అడుగుతాడు. నిజం చెప్పమని అంటాడు. ప్రేరణ నిజం చెప్పే టైంకి సిద్ధూ ఆపి మేం నిజంగానే భార్యాభర్తలం అంటాడు. మరి మీ ఇంట్లో అందరూ ప్రేరణతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.. తన ఏ ఇంటికి కోడలు అయితే ఆ ఇంటికి మంచిది అంటున్నారు.. చెప్పేయొచ్చు కదా తనే ఈ ఇంటి కోడలు అని అంటాడు. సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ తరబడుతూ ఉంటే అర్థమైందిలే మీ నాన్న గొప్పింటి పిల్లని నీకు చేయాలి అనుకుంటున్నారు.. ప్రేరణ పేదమ్మాయి కాబట్టి ఒప్పుకోరని చెప్పలేదు కదా అంటాడు. కరెక్ట్ సార్ కరెక్ట్ అని సిద్ధూ హగ్ చేసుకుంటాడు. తర్వాత ప్రేరణ సిద్ధూని నిజం చెప్పకుండా అడ్డుకున్నందుకు తిడుతుంది. డీసీపీ కూడా నిజం చెప్పలేదు కదా,,మనం నిజం చెప్తే చేయని తప్పునకు అందరి ముందు తలదించుకోవాలి.. పైగా మా అమ్మ ఆ విషయం అస్సలు తట్టుకోలేదు.. పార్టీ మూడ్ అంతా పోతుంది అని అంటాడు. మనం ముందు పరీక్షలు రాసి మనం అనుకున్నది సాధించిన తర్వాత ఈ సమస్య పరిష్కరించడం మనకి పెద్ద సమస్య కాదు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ఇంకా చదవండి
Advertisement





















