Nindu Manasulu Serial Today February 10th: నిండు మనసులు: చీరకట్టుతో సిద్ధూని మైమరిపించేసిన ప్రేరణ! సిద్ధూ, ప్రేరణల బంధం ఇంట్లో చెప్పేసిన జేకే!
Nindu Manasulu Today Episode February 10th ప్రేరణని పుట్టిన రోజు పార్టీకి పిలిచిన మంజుల సిద్ధూని ఎందుకు కొట్టావ్.. మీ మధ్య ఏం జరిగింది అని ప్రేరణని అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ పార్టీకి రానని చెప్పిందని సిద్ధూ బాధగా ఉంటాడు. ఇంతలో కుమార్, శైలు వెళ్లి ఏమైందని అడుగుతారు. ప్రేరణని పుట్టినరోజు పార్టీకి రమ్మని పిలిస్తే రాను అని చెప్పిందని మనసు మారిందేమో అని మళ్లీ కాల్ చేస్తే రాను అని ఐశ్వర్యతో చెప్పించిందని బాధగా ఉందని సిద్ధూ అంటాడు. జరిగిన దానికి సారీ చెప్పినా కూడా తను నన్ను అవాయిడ్ చేస్తుందని సిద్ధూ అంటాడు. ఇంతలో కుమార్, శైలులు పింక్ చీర కట్టుకొని దేవతలా వస్తున్న ప్రేరణని చూస్తారు. కుమార్ సిద్ధూతో నిన్ను అవాయిడ్ చేస్తే ఇక్కడి వరకు ఎలా వస్తుందిరా అని అడుగుతాడు. రానని చెప్పిందని చెప్పా కదరా మరెలా వస్తుంది అని సిద్ధూ అంటాడు.
శైలు సిద్ధూతో చీర కట్టుకొని వస్తుంది అన్నయ్యా అంటుంది. నేను తను అలా రావాలి అనే అనుకున్నా కానీ తను రాదు అని సిద్ధూ అంటాడు. వచ్చిందిరా అని అప్పుడే వస్తున్న ప్రేరణని చూపిస్తాడు. చీరకట్టులో ప్రేరణని చూసి సిద్థూ అలాగే ఉండిపోతాడు. ప్రేరణ దగ్గరకు వచ్చి హాలో ఏంటి అలా చూస్తున్నావ్ అంటే ఇది కలా నిజమా అని సిద్ధూ అంటాడు. దాంతో ప్రేరణ గిల్లుతుంది. హా నిజమే అని సిద్ధూ అంటాడు. చాలా బాగుంది అంటాడు. ఏంటి అని ప్రేరణ అంటే ఈ చీర నీకు చాలా బాగుంది అంటాడు. అందుకే కదా కట్టుకున్నా అంటుంది. వాడు అదే కోరుకున్నాడు అని కుమార్ అంటాడు. సిద్ధూ తడబడుతూ వాడు అలాగే అంటాడు అని అంటాడు. రాను అన్నావ్ ఇప్పుడు వచ్చావ్ అంటే ఇప్పుడు వచ్చాను కదా అంటుంది. నేను నువ్వు పిలిచినందుకు రాలేదు అని ప్రేరణ అంటే మంజుల వచ్చి ప్రేరణకి విష్ చేస్తుంది. ఆంటీ పిలిచారుఅని వచ్చా అంటుంది. పాపం మావాడు ఇంకా నువ్వు తన కోసమే వచ్చావని అనుకున్నాడని కుమార్ అంటాడు.
సిద్ధూ తల్లితో తనని పిలిచినట్లు నాకు చెప్పలేదు అమ్మా అంటే నువ్వు అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా.. అయినా నీ పర్మిషన్ ఎవరికి కావాలిరా అని ప్రేరణని లోపలికి తీసుకెళ్తుంది. కుమార్ సిద్ధూతో మీ ఇద్దరినీ కలపాలి అని విధి చూస్తుందిరా.. మీరు ఎంత కాదు అన్నా మీరు చెప్పిన అబద్ధం నిజం కాకుండా పోదు అని అంటాడు. ఇక ప్రేరణని మంజుల గదిలోకి తీసుకెళ్తుంది. ప్రేరణ మంజులకు నగలు వేసి మీ వల్ల నగలకే అందం వచ్చిందని అంటుంది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇక మంజుల ప్రేరణతో నువ్వేం ఫీలవ్వను అంటే ఒక మాట అడుగుతా అంటుంది. అడగండి ఆంటీ అని ప్రేరణ అంటే సిద్ధూని ఎందుకు కొట్టావ్ అని అడుగుతుంది. దూరం నుంచి ఆ మాట విన్న సిద్ధూ కూడా షాక్ అవుతాడు. సిద్ధూ తెలిసి ఏ తప్పు చేయడు.. తెలిసి నువ్వు ఏ పొరపాటు చేయవు.. పైగా మీ ఇద్దరి ఆలోచనలు లక్షణాలు ఒక్కటే.. అలాంటి మీ మధ్య ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది. ఈ విషయం గురించి సిద్ధూ మీకు ఏం చెప్పలేదా అని ప్రేరణ అంటుంది. సిద్ధూ ఏం చెప్పలేదు కానీ నువ్వు వేసిన ఈ ప్రశ్నతో తనని నువ్వు కొట్టావని అర్థమవుతుందని ఎందుకు తన మీద చేయి చేసుకున్నావ్ అని అడుగుతుంది.
సిద్ధూ వచ్చి ఏంటమ్మా ఇంటికి వచ్చిన ప్రేరణని ఇలా ప్రశ్నిస్తే తను ఫీలవ్వదా అని అంటాడు. ఇంతలో విజయానంద్ వచ్చి తర్వాత మాట్లాడుకుందురు పార్టీకి టైం అయింది రండి అని తీసుకెళ్తాడు. పార్టీకి మినిస్టర్ వస్తాడు. తండ్రిని చూసిన శైలు నాన్న అని పరుగున వెళ్లి కింద పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. మినిస్టర్ కూడా చూసి అలా ఉండిపోతాడు. మంజుల వెళ్లబోతే విజయానంద్ ఆపుతాడు. ప్రేరణ వెళ్లబోతే సిద్ధూ ఆపుతాడు. ఇంతలో కుమార్ వచ్చి చాలా కంగారు పడతాడు. శైలుకి సపర్యలు చేస్తాడు. శైలుని చూసి కన్నీరు పెట్టుకుంటాడు. మినిస్టర్ విజయానంద్‌తో వీళ్లని నువ్వే పిలిచావా అంటే వాళ్లని సిద్ధూ పిలిచాడు అని చెప్తారు. మినిస్టర్‌ని విజయానంద్ మీదకి తీసుకెళ్తాడు. మిగతా అందరూ శైలు దగ్గరకు వెళ్లారు. నొప్పిగా ఉందా అని ప్రేరణ అడిగితే లేదు కానీ మా నాన్న నన్ను చూసి కూడా పరాయివాళ్లని చూసినట్లు అలా ఉండిపోయాడు.. అదే చాలా బాధగా ఉందని ఏడుస్తుంది. మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉంది.. అది కచ్చితంగా బయట పడుతుంది ఏం బాధ పడకు అని సిద్ధూ చెప్తాడు.
ప్రేరణ సిద్ధూతో నేను వెళ్తుంటే ఎందుకు ఆపావ్ అంటుంది. నువ్వు వెళ్తే నీ మీద కోపం కూడా శైలు మీద చూపిస్తాడు. అదే కుమార్ వెళ్తే తనలా చూసుకొనే భర్త తన కూతురికి దొరికాడని ఏదో ఒకరోజు సంతోషపడతాడు అని అంటాడు సిద్ధూ. ఇక విజయానంద్ మంజులతో నీ భర్త్‌డే పార్టీకి స్పెషల్ గెస్ట్ డీసీపీ జయకృష్ణని పిలిచాను అని అంటాడు. ప్రేరణ, సిద్ధూ బిత్తరపోతారు. కొంప మునిగిపోయిందని అనుకుంటారు. జేకే రావడంతో సిద్ధూ, ప్రేరణల్ని కూడా తీసుకెళ్తారు. జేకే రావడంతో విజయానంద్ ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేస్తాడు.
సిద్ధూ మీ కొడుకా అని షాక్ అయిపోతాడు. ప్రేరణని చూసి తను మీ కోడలు కదా అంటాడు. విజయానంద్ నవ్వి ఇంటికి వచ్చిన ప్రతీ వాళ్లు ఆవిడను చూసి అలాగే అనుకుంటారు. మీరు పొరపాటు పడ్డారు తను మా కోడలు కాదు అంటాడు. మంజుల ప్రేరణని పరిచయం చేస్తుంది. వాళ్ల గురించి నాకు అంతా తెలుసు.. మీకు కూడా తెలీని విషయం ఉందని జేకే అనడంతో అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























