అన్వేషించండి

Nindu Manasulu Serial Today May 14th: నిండు మనసులు: ప్రేరణని కలిసిన రాజశేఖరం.. గణ గొడవ.. లాగిపెట్టి కొట్టిన ఇందిర! సిద్ధూ ఫైర్!

Nindu Manasulu Serial Today may 14th :రాజశేఖరం ప్రేరణని కలవడానికి గుడికి వెళ్లడం గణ అక్కడికి వచ్చి గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Latest Episode: నిండుమనసులు సీరియల్‌ హాట్‌ హాట్‌ వాగ్వాదంతో ప్రారంభమవుతుంది. ప్రేరణ కాలికి దెబ్బ తగలడంతో విజయానంద్ ముడుపు కట్టలేవు అని నానా మాటలు అంటాడు. దాంతో సిద్ధూ ప్రేరణని ఎత్తుకెళ్లి ముడుపు కట్టిస్తాడు. సార్ మనం ఎన్ని చేసినా సిద్ధూ బాబు ఆ ప్రేరణని కాపాడటానికి ఉంటాడు.. ఇక ఏం ప్లాన్ చేయొద్దు సార్ వేస్ట్ అని విశ్వాసం విజయానంద్‌తో అంటాడు. నేను దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వనురా.. ముందు ముందు ఏం చేస్తానో చూడు అని అంటాడు.

ప్రేరణ ముడుపు కట్టేస్తుంది. తర్వాత సిద్ధూ ప్రేరణని తీసుకొని ఓ చోట కూర్చొపెడతాడు. ఇందిర, ఐశ్వర్య, రంజిత్ గుడి లోపలికి వెళ్తారు. సిద్ధూ ప్రేరణ కాలు పట్టుకుంటే ప్రేరణ వద్దు అంటుంది. గుడిలో నడిచేటప్పుడు చూసుకోవాలి కదా నువ్వు ఇక్కడే ఉండు.. నేను వాటర్ తెస్తా అని సిద్ధూ వెళ్తాడు. ప్రేరణ ఒంటరిగా ఉండటంతో రాజశేఖరం అక్కడికి వెళ్తాడు. అమ్మా ప్రేరణ కాలికి బాగా గాయం అయిందా అమ్మా అంటే తండ్రిని చూసి ప్రేరణ షాక్ అయి మా మనసులకు చేసిన గాయం కంటే ఇదేం పెద్దది కాదు అని అంటుంది. రాజశేఖరం ప్రేరణ కాలు ముట్టుకోవడానికి వెళ్తే ప్రేరణ దూరం జరిగిపోతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఈ రోజు నీ పుట్టిన రోజు కదమ్మా విష్ చేద్దామని వచ్చా అని రాజశేఖరం ప్రేరణ తల మీద చేయి వేసి విష్ చేయబోతే ప్రేరణ వద్దని చేయి అడ్డు పెడుతుంది. 

Also Read:ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ కడుపు సంగతి నర్మద, ప్రేమలు తేల్చేస్తారా! రెచ్చిపోయిన సాగర్.. ధీరజ్‌ని అపార్థం చేసుకున్నాడా!

రాజశేఖరం ఏడుస్తూ నాకు తెలుసమ్మా నాతో మాట్లాడటానికి కూడా నువ్వు ఇష్టపడవు అని.. నా తప్పు సరిదిద్దు కోవాలి అనుకుంటున్నానమ్మా అని అనడంతో మా గురించి ఆరాటపడటానికి మీకు ఏం హక్కు ఉంది.. నువ్వు మా గురించి బాధ పడాల్సిన అవసరం లేదు.. ఏరోజు మా పరువు పోతుంటే చూస్తూ ఉండిపోయావో అప్పుడే మా దృష్టిలో తండ్రి స్థానం కోల్పోయావు.. ఆ క్షణం మేం ఎంత నరకం అనుభవించామో నీకు తెలీదు.. ఆ బాధ మాకు మాత్రమే తెలుసు.. అని ప్రేరణ ఏడుస్తుంది. ప్రేరణ రాజశేఖరం మాట్లాడుకోవడం విజయానంద్ చూస్తాడు. వెంటనే గణకి వీడియో తీసి పంపిస్తాడు. గణ షాక్ అయి విజయానంద్‌కి కాల్ చేస్తే విజయానంద్ అడ్రస్ చెప్తాడు. మా నాన్న జోలికి వస్తే ఊరుకోను అంటున్నావ్ మరి ఇప్పుడేం చేస్తావ్ అని విజయానంద్ అంటాడు. ఇప్పుడే వచ్చి చెప్తా అని గణ అంటాడు.

Also Read:జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

ప్రేరణ తండ్రితో నలుగురిలో భార్యాపిల్లల గురించి మాట్లాడలేని మనిషి ఇలా మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటుంది. అమ్మా ప్రేరణ అలా మాట్లాడకు నేను చేసింది తప్పే కానీ.. కన్నతండ్రి స్థానం దూరం చేయకు అమ్మా.. దయచేసి నన్ను క్షమించు అని అంటాడు. నువ్వేం చెప్పినా ఎన్ని చేసినా గాయం పోదు.. లోకం దృష్టిలో మాత్రమే నువ్వు మాకు తండ్రి.. మా దృష్టిలో కాదు అని అంటుంది. నీ క్షమాభిక్ష పొందాలి అంటే నేను ఏం చేయాలో చెప్పమ్మా అని రాజశేఖరం అడుగుతాడు. నేను చెప్పనా అని గణ ఎంట్రీ ఇస్తాడు. క్షమాపణ ఎలా చెప్పాలో నేను చెప్తా నువ్వు చెప్పు నాన్న.. అమ్మా ప్రేరణ నన్ను క్షమించు అమ్మా అవసరం అయితే నీ కాళ్లు పట్టుకుంటా ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా నాన్న అని అరుస్తాడు. యోగాలు, మెడిటేషన్‌లు అని బయటకు వచ్చి నువ్వు చేసే పనులు ఇవేనా.. నీకు ఎంత చెప్పినా సిగ్గు లేకుండా వీళ్లని కలుస్తున్నావ్.. నువ్వు మనిషివా పశువువా అని అంటాడు. వీళ్లని కలవాల్సిన అవసరం నీకు ఏం ఉంది.. వీళ్ల బతుకులు ఆరోజే రోడ్డున పడ్డాయి కదా అంటాడు. రేయ్ గణ మా జోలికి రావొద్దు.. నువ్వు ఒక నీచుడివి నీ లాంటి వాడి వల్లే మీకు ఇన్ని కష్టాలు.. ఇక్కడ ఎవరితో మాకు ఏం సంబంధం లేదు.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటుంది. 

Also Read:సూర్యనారాయణ ఇంటి ముందుకొచ్చి గొడవపెట్టుకున్న సరోజ...కోడలు సింధూ చేసిన పని పెద్దయ్యకు చెప్పిన సరోజ

ప్రేరణ, గణ గొడవ పడతారు. ఇంతలో గణ నీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా మా నాన్న కాపురం చేసి వదిలేసిన దానికి పుట్టినదానివి నువ్వు అని అంటాడు. ఆ మాట విన్ని ఇందిర గణని లాగిపెట్టి కొడుతుంది. ఎవడ్రా నువ్వు నా కూతుర్ని అనడానికి.. నా కూతురి గురించి ఒక్క మాట తప్పుగా అన్న నాలుక చీరేస్తా.. ఏం మనిషివిరా.. నువ్వు.. మగ పుట్టుక ఎలా పట్టావ్ అని అడుగుతుంది. ఏయ్ ఇందిర నన్ను కొట్టి తప్పు చేశావ్,.., ఈ రోజుతో మీ పని అయిపోంది మిమల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అంటాడు. తన్నులు తినకుండా ఇక్కడ నుంచి వెళ్లిపో అని ఇందిర అంటుంది. ఇంతలో సిద్ధూ వచ్చి నీకు ఇక్కడేం పనిరా.. నువ్వు నీ బాబు ఎక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. మీ వాళ్లని కలవడానికి ఎవడు వచ్చారురా.. నాకు చెప్పకుండా వచ్చిన మా బాబుని తీసుకెళ్లడానికి వచ్చా అని గణ అంటాడు. అయితే తీసుకెళ్లు.. నా మూడ్‌ మారేలోపు మీరు ఇక్కడ ఉండకూడదు.. ఇంకొక్క క్షణం మీరు నా కళ్ల ముందు కనిపిస్తే నిన్నూ నీ బాబుని తన్ని తరిమేస్తా అని అంటాడు. దాంతో రాజశేఖరం వెళ్లిపోతాడు. మీ అందరూ నా చేతిలో అయిపోయారురా అని గణఅంటే పోరా అని సిద్ధూ అంటాడు. 

రంజిత్ ఇందిరతో తన మీద చేయి వేయకుండా ఉండాల్సింది.. ఎంతైనా డ్యూటీలో ఉన్నాడు కదా అని అంటాడు. వాడికి అంత సీన్‌ లేదులే అని సిద్ధూ అంటాడు. ప్రేరణ వాళ్లు ఇంటికి వెళ్తే బెడ్ మీద గతంలో ఇద్దరికీ తీసిన డ్రాయింగ్‌లు ఉంటాయి. ప్రేరణ చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రేరణ అడిగితే సాహితి వచ్చి ఇప్పుడే ఇచ్చారు.. నేను మీ గదిలో ఉంచాను అంటుంది. నేను అంటే నీకు ఎంత ఇష్టం సిద్ధూ అని ప్రేరణ అడుగుతుంది. నేను ఇది ఆలోచించే మూడ్‌లో లేను అసలు ఆ మోసగాడు ఎందుకు గుడికి వచ్చాడు.. నీతో ఎందుకు మాట్లాడాడు అని అడుగుతాడు. కన్న బిడ్డల్ని భార్యని వదిలేసిన ఆ మూర్ఖుడు నీతో  మాట్లాడుతుంటే ఎందుకు నువ్వు మాట్లాడావు.. ప్రేరణ నేను ఏ విషయంలోనూ నీతో గొడవ పడను కానీ ఆ మోసగాడు మాత్రం నీతో మాట్లాడాలని చూస్తే నేను ఊరుకోను అని అంటాడు. నా అనుకునేవాళ్ల జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు.. లేని మా నాన్న కోసం ఎంత బాధ పడ్డానో నాకు తెలుసు.. తండ్రి ఉండి లేనట్లు ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో నేను చూశాను.. అలాంటి వాళ్ల కోసం మాట్లాడుకోవడం వేస్ట్ ప్రేరణ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

మరిన్ని తెలుగు సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today June 16th: పోలీసుస్టేషన్‌లో చక్రిపై చేయిచేసుకున్న ఎస్‌ఐ...డబ్బులు కట్టి విడిపించుకుని వచ్చిన మాధవ్‌,కేశవ్‌
పొదరిల్లు: పోలీసుస్టేషన్‌లో చక్రిపై చేయిచేసుకున్న ఎస్‌ఐ...డబ్బులు కట్టి విడిపించుకుని వచ్చిన మాధవ్‌,కేశవ్‌
Gundenininda Gudigantalu Serial Today June 16: బాలుతో గొడవ సుమతితో ప్రేమలో అరుణ్, మీనాపైకి ప్రభావతిని ప్రయోగించిన చింతామణి - గుండెనిండా గుడిగంటలు జూన్ 16 ఎపిసోడ్
బాలుతో గొడవ సుమతితో ప్రేమలో అరుణ్, మీనాపైకి ప్రభావతిని ప్రయోగించిన చింతామణి - గుండెనిండా గుడిగంటలు జూన్ 16 ఎపిసోడ్
Nindu Manasulu Serial Today June 16th: నిండు మనసులు: ఆ రాత్రి.. పార్టీలో ఇంత జరిగిందా..! ఓర్నీ ఇందుకా సాహితి గణని పెళ్లి చేసుకుంది.. పెద్ద ప్లానింగే!
నిండు మనసులు: ఆ రాత్రి.. పార్టీలో ఇంత జరిగిందా..! ఓర్నీ ఇందుకా సాహితి గణని పెళ్లి చేసుకుంది.. పెద్ద ప్లానింగే!
Illu Illalu Pillalu Serial Today June 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఏహే వదలండీ.. నాకు కడుపే లేదు.. నిజం చెప్పేసిన వల్లీ! ఆ మెషిన్‌తో వల్లీ గుట్టు రట్టు అవుతుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఏహే వదలండీ.. నాకు కడుపే లేదు.. నిజం చెప్పేసిన వల్లీ! ఆ మెషిన్‌తో వల్లీ గుట్టు రట్టు అవుతుందా!
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro Phase 2 Loan Controversy: రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
US Iran Peace Deal: ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
Vaibhav Suryavanshi: లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
లంక ఆటగాళ్లతో వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ! ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తప్పవా ?
Elnino Effect: ఏపీ, తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఓవైపు వర్షాలు, మరోవైపు ఉక్కపోత, వడగాలులతో అలర్ట్
ఏపీ, తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఓవైపు వర్షాలు, మరోవైపు ఉక్కపోత, వడగాలులతో అలర్ట్
Kesineni Brothers War: అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
Nagative Campaign on Varanasi: OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
Football World Cup: మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
Vaibhav Sooryavanshi Fight Video: శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
Embed widget