Nindu Manasulu Serial Today Episode గణతో తన కూతురి నిశ్చితార్థం ఎలా ఆపాలా అని విజయానంద్ ఆలోచిస్తూ ఉంటాడు. మంజుల వచ్చి ఇక్కడేం చేస్తున్నారు అని అంటే మన పిల్లల గురించి ఆలోచిస్తున్నా.. నిశ్చితార్థం తర్వాత పెళ్లి ఎంత ఘనంగా చేయాలా అని ఆలోచిస్తున్నా అంటాడు. ఇద్దరూ మాట్లాడుతూ ఉంటే గణ లవర్ వర్ష అక్కడికి వస్తుంది. తంతు మొత్తం చూసి విజయానంద్ వాళ్లతో మాట్లాడాలని వెళ్తుంటే గణ వర్షని చూసి వాళ్లని కలవకుండా హడావుడిగా తీసుకెళ్తాడు.

Continues below advertisement

గణ వర్షని తీసుకెళ్లడం ప్రేరణ, సిద్ధూ చూస్తారు. వాడు ఎందుకు తనని అలా తీసుకెళ్తున్నాడు అని అనుకుంటారు. ఏంటి ఇలా వచ్చావ్ అని అంటే మరి కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయవు.. ఇక్కడ మరో అమ్మాయితో నిశ్చితార్థానికి రెడీ అయిపోవావు.. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అన్నావ్.. నిజం అని నమ్మాను.. కానీ నువ్వు నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్,, నిన్ను వదిలిపెట్టను అని వర్ష అంటుంది. దానికి గణ నన్ను అర్థం చేసుకో నేను ఎప్పటికీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. ప్రేమిస్తూనే ఉంటాను.. కానీ ఈ నిశ్చితార్థం మా అమ్మ కోసం.. నేను ఈ పెళ్లి చేసుకోకపోతే మా అమ్మ చనిపోతా అని బెదిరిస్తుంది. నా మనసులో నువ్వు ఉంటే మరో అమ్మాయితో నిశ్చితార్థం అంటే నాకు చావే గతి అయినా అమ్మ బెదిరించడంతో ఒప్పుకున్నా అని దొంగ కన్నీరు పెడతాడు. గణ మాటలకు వర్ష నమ్మేస్తుంది. 

సాహితిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. ఈ నిశ్చితార్థం చేసుకొని తర్వాత అమ్మని ఒప్పిస్తా.. నిన్నే పెళ్లి చేసుకుంటా అని అంటాడు. వర్ష గణ మాటలు నమ్మేయడంతో నా నటన బాగానే పని చేసింది అని గణ అనుకుంటాడు. మన ప్రేమ గురించి ఎవరికీ ఏం చెప్పొద్దు అని గణ వర్షతో చెప్తాడు. వర్ష సరే అంటుంది. గణ వర్షని తీసుకొని వెళ్తుంటే ఎదురుగా సిద్ధూ, ప్రేరణ ఉంటారు. ఇద్దరినీ చూసి షాక్ అయి వర్ష చేయి వదిలేస్తాడు. ఎవరు ఈ అమ్మాయి.. నీకు తనకి ఏంటి సంబంధం.. తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావ్ అని అడుగుతాడు సిద్ధూ. దానికి గణ నీకు తనకి(ప్రేరణ) మధ్య ఉన్న సంబంధమే.. మాది చాలా క్లీన్ సంబంధం.. చాలా రోజుల తర్వాత కలవడంతో బాగా మాట్లాడుకున్నాం.. అని అంటాడు. ఎవరికీ అనుమానం రాకూడదు అని వర్షని లోపలికి తీసుకెళ్తాడు.  

Continues below advertisement

గణ వర్షని తీసుకెళ్లి అందరికీ పరిచయం చేస్తాడు. ఇక ముహూర్తం టైం అవుతుంది అని ఈశ్వరి అనడంతో నా పరిస్థితి అర్థమైంది కదా వర్ష అని అంటాడు. ఇక పంతులు ఉంగరాలు మార్చుకోమని అంటారు. సిద్ధూ కుమార్‌తో నిశ్చితార్థం ఆపమని చెప్పాను కదరా అంటే మా ప్రయత్నం మేం చేశాం అని కుమార్ అంటాడు. గణ కుమార్, ఐశ్వర్యలని చూస్తాడు. ఇద్దరూ డల్‌గా ఉంటే ఎన్నో ప్రయత్నాలు చేశారు.. ఏవీ వర్కౌట్ అవ్వలేదు.. ఇక సాహితితో నా నిశ్చితార్థం ఆపడం ఎవరి తరం కాదు అని అనుకుంటాడు. 

ఉంగరాలు ఎక్కడా అని మంజుల అడిగితే బయట ఉంటే సేఫ్ కాదు అని నా జేబులో దాచుకున్నా అని గణ అంటాడు. తీరా జేబులో చూస్తే ఉంగరాలు ఉండవు.. ఈ నిశ్చితార్థం అన్నప్పుడు నుంచి గణ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని విజయానంద్ అంటాడు. గణ నిశ్చితార్థం ఉంగరాలు కనిపించడం లేదు అని అంటే అందరూ షాక్ అయిపోతారు. ప్రేరణ, సిద్ధూ, సుధా, ఐశ్వర్య, కుమార్ హ్యాపీగా ఫీలవుతారు. నేను జాగ్రత్తగా దాచాను కానీ ఎవరో నాకు తెలీకుండా నా జేబు కత్తిరించారు అని గణ అంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. సిద్ధూ, ప్రేరణ ఐశ్వర్యని చూస్తే నేనే అని ఐశ్వర్య సైగ చేస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో ఐశ్వర్య జేబు కట్ చేసేసి రింగులు తీసేస్తుంది. 

గణ అనుమానంతో చూస్తే నలుగురు సెల్ఫీ తీసుకున్నట్లు ఫోజులిస్తారు. సీఐ గారి జేబే కట్ చేశారా మరి మన పరిస్థితి ఏంటి అని ఐశ్వర్య అంటుంది. నిశ్చితార్థానికి ముఖ్యమైన రింగులు పోయావి ఇక నిశ్చితార్థం ఆగిపోయినట్లే అని విశ్వాసం అంటాడు. గణ మనసులో ఇది కచ్చితంగా వీళ్ల పనే అని అనుకుంటాడు. గణ కుమార్ కాలర్ పట్టుకొని మీరే రింగులు కొట్టేశారు కదా అంటాడు. ఏ ఆధారంతో ఇలా అంటున్నారు అని సిద్ధూ అంటే ప్రేరణ చెల్లి, కుమార్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు  అది నేను విన్నాను అని అంటాడు. దానికి ఐశ్వర్య రామరామ మేం ఎందుకు తీస్తాం సాయం చేయండి అంటే వచ్చాం..పైగా మీరు సీఐ మీ దగ్గర ఎవరు దొంగతనం చేస్తారు అని అంటుంది. మంజుల కూడా కుమార్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అలాంటి వాడు కాదు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.