Nindu Manasulu Serial Today Episode గణ, సాహితిలకు పెళ్లి బట్టలు ఇచ్చి మార్చుకొని రమ్మని చెప్తారు. గణ గదిలోకి వెళ్తే సిద్ధూ కూడా వెళ్తాడు. గణ కాలర్ పట్టుకొని ప్రేరణ, వర్ష ఎక్కడున్నారో చెప్పు అని అడుగుతాడు. నాకేం తెలీదు అని గణ అంటాడు. నీకు అన్నీ తెలుసు.. వాళ్లు ఇక్కడికి వస్తే నీ బండారం బయట పడుతుందని వాళ్లని నువ్వే కిడ్నాప్ చేశావని అంటాడు.
కిడ్నాప్లు చేయడానికి నేను రౌడీని కాదు పోలీస్ని కావాలంటే కేసు పెట్టండి నేను వెతికిస్తా అని అంటాడు. నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చంపి అయినా సరే నిజం చెప్పిస్తా అంటాడు. ప్రేరణకి ఏమైనా అయితే మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అంటాడు సిద్ధూ. మీరు వెళ్లండి నేను బట్టలు మార్చుకోవాలి అని గణ సిద్ధూని పంపేస్తాడు. పెళ్లి అయిన వరకు వాళ్లు నీకు దొరకరు అని అనుకుంటాడు.
రంజిత్ రౌడీల కారుని ఫాలో అవుతాడు. ఓ చోట వాళ్లని మిస్ అయిపోతాడు. ఎటు వెళ్లారా అని అనుకుంటాడు. ప్రేరణ, వర్షలను రౌడీలు కట్టి పడేస్తారు. ప్రేరణకు మెలకువ వచ్చి వర్షని లేపుతుంది. మనం ఎలా అయినా తప్పించుకోవాలి అని ప్రేరణ అంటే ఆ ఆశ లేదు అసలు బతుకుతామన్న ఆశే లేదు అని వర్ష అంటుంది. ప్రేరణ కట్లు విప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది.. కానీ కదురదు.. ఇంతలో రౌడీలు వచ్చి ప్రేరణని బెదిరిస్తారు. ఇంతలో రంజిత్ వచ్చి రౌడీలను చితక్కొడతాడు. ఆ టైంలోనే రౌడీలు రంజిత్ని కత్తితో పొడిచేస్తారు.
గణ, సాహితిలు పెళ్లి మండపం మీద కూర్చొంటారు. ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్లి ఎలా ఆపాలిరా అని సిద్ధూ చాలా టెన్షన్ పడతాడు. ఇక తాళి కట్టమని పంతులు గణకి తాళి ఇస్తాడు. పాపం సిద్ధూ చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏం చేయలేకపోతున్నా అని అనుకుంటాడు. ఏదో ఒకటి చేయరా అని కుమార్ సిద్ధూని అంటే ఏం చేయాలిరా ఒక్క సాక్ష్యం కూడా లేదు.. పోనీ అని గొడవ చేసినా ఆపర్రా అని అంటాడు. విజయానంద్ సిద్ధూని చూసి సిద్ధూ పెళ్లి ఆపుతాడు అనుకుంటే తనేం చేయడం లేదు నేను చెప్తామంటే నా గురించి తెలిసిపోతుందని అనుకుంటాడు. గణ సాహితి మెడలో తాళి కట్టేస్తాడు. సిద్ధూ ఏడుస్తూ నన్ను క్షమించమ్మా నిన్ను కాపాడుకోలేకపోయాను అని వెళ్లిపోతాడు.
గణ సాహితిని దగ్గరకు తీసుకొని సిద్ధూని వెటకారంగా చూస్తాడు. ఇక సాహితిని ముద్దు పెట్టుకోవాలని చూస్తాడు. తీరా చూస్తే గణ పక్కన సుధాకర్ అంటాడు. గణ షాక్ అయిపోతాడు. అందరూ నవ్వుతారు. ఇంకా పెళ్లి కూతురు రాలేదు కంగారు వద్దు అంటారు. ఇదంతా నా కలా అని గణ నోరెళ్ల బెడతాడు. విజయానంద్ విశ్వాసంతో ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపుతానురా అని ఎవరికీ అనుమానం రాకుండా తాళి దాచేస్తా అని అంటాడు. తాళి తీయడానికి వెళ్తే గణ విజయానంద్ని పట్టుకొని నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఈ పెళ్లి ఆగదు.. కామ్గా వెళ్లి పెళ్లి చూసుకోండి అని అంటాడు.
గణ మొత్తం చూస్తూ సిద్ధూ కనిపించడం లేదు ఏంటి అని అనుకొని కుమార్ని పిలుస్తాడు. సిద్ధూ కనిపించడం లేదు అని అంటే భోజనాల పనులు చూసుకోవడానికి వెళ్లాడని కుమార్ చెప్తాడు. దానికి ఇప్పుడు నిజం చెప్పు.. అయినా సరే నాతో పెట్టుకొని గెలవలేడు అని మీ ఫ్రెండ్కి చెప్పు అని అంటాడు. ఇక నిజంగానే సాహితి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చొంటుంది. గణ తాళి కట్టడానికి రెడీ అవుతాడు. తాళి పట్టుకొని మొత్తానికి నేను అనుకున్నది సాధించా ఇక ఎవరూ ఈ పెళ్లి ఆపలేరు అని అనుకుంటాడు. ఇంతలో ఎదురుగా వర్ష వస్తుంది. వర్షని చూసి షాక్ అయిపోతాడు. ఇది ఎలా వచ్చింది అనుకుంటాడు. ఇంతలో వర్ష పక్కన సిద్ధూ, ప్రేరణ నిల్చొవడం చూసి సిద్ధూ వెళ్లింది వీళ్లని తీసుకురావడానికా అని తాళి కింద పడేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.