Nindu Manasulu Serial Today May 23rd: నిండు మనసులు: మంజుల ఫైనాన్స్ కంపెనీలో భారీ మోసం.. విజయానంద్ మోసాన్ని సిద్ధూ, ప్రేరణ బయట పెట్టగలరా!
Nindu Manasulu Serial Today may 23rd: మంజుల పేరు మీద ఉన్న ఫైనాన్స్ కంపెనీలో భారీ మోసం జరుగుతుందని సిద్ధూ, ప్రేరణ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. సిద్ధూ తండ్రికి తన తండ్రికి ఏదో సంబంధం ఉందని ప్రేరణకు అనుమానం రావడం.. తన తండ్రిని విజయానంద్ సీక్రెట్‌గా కలవడం చూసిన ప్రేరణకు ఇంకా అనుమానం పెరగడంతో సీరియల్ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది.. ఈ రోజు(మే 23న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అయ్యో ఓనర్‌గారు పోయారా..
ఐశ్వర్య బ్రష్ చేస్తూ ఉంటే రంజిత్ ఆసనాలు వేస్తూ ఉంటాడు. రంజిత్ ఉలుకు పలుకు లేకుండా అలా పడుకొని ఉండటం చూసిన ఐశ్వర్య ఈయనకు అసలే మతి మరుపు.. ప్రాణాయామం చేస్తూ ఊపిరి తీసుకోవడం మర్చిపోయినట్లు ఉన్నారు అనుకొని చూసి అయ్యో ఓనర్ గారు పోయారా.. మమల్ని ఈ ఇంటిని ఒంటరి చేసి పోయారా.. ఈ నెల నుంచి రెంట్ అవసరం లేదు అని ముందే చెప్పకుండా పోయారా అని రాగాలు మొదలు పెడుతుంది. రంజిత్ లేచి కూర్చొని ఐశ్యర్యని పిలిస్తే దెయ్యం దెయ్యం అని అరుస్తుంది. తర్వాత ఓనర్ గారు మీరు మీరు పోలేదా అని అంటుంది. నేను పోతే ఏడ్చినట్లు లేవు.. నేను పోతే నీకు ఏం ఏం లాభమో చెప్పినట్లు ఉందని అంటాడు.
ఆ హంతకుడి ముందే నా తండ్రికి అలా..
ఆబ్దికం చేసి వచ్చిన సిద్ధూ తండ్రిని గుర్తు చేసుకొని బాధ పడుతూ ఉంటే ప్రేరణ ఏమైందని అడుగుతుంది. ఎవరైతే హంతకుడు అని నేను నమ్మానో అతని ముందు అతని ఇంట్లోనే మా నాన్న ఆబ్దికం చేయడం తట్టుకోలేకపోతున్నాను.. నీ మాటలు వల్ల నేను మా అమ్మ ముందు తల దించుకుంటున్నాను అది తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. మీ తండ్రిని చంపింది అతనే అని నీ అనుమానాన్ని అందరి ముందు చెప్పి నీకు అత్తయ్యకి మధ్య దూరానికి కారణం అయ్యాను.. మా అమ్మ మీద మాటల తూటాలు వేస్తుంటే తట్టుకోలేక చెప్పేశాను నన్ను క్షమించు సిద్ధూ అని అంటుంది.
క్షమించలేను.. దూరంగా ఉండలేను..
నువ్వు చేసిన దానికి నిన్ను క్షమించలేను ప్రేరణ అలా అని నీకు దూరంగా ఉండలేకపోతున్నాను.. నువ్వు చేసిన తప్పు వల్ల నేను శిక్ష అనుభవిస్తున్నాను.. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు ప్రేరణ.. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చిన అమ్మని దూరం పెట్టలేను అని అంటాడు. మరి ఎలా క్షమిస్తావు సిద్ధూ అని ప్రేరణ అంటుంది. క్షమించలేను అని సిద్ధూ అంటే దీనికి పరిష్కారం ఉండాలి కదా సిద్ధూ.. శరత్ గారిని ఆ విజయానంద్ చంపాడు అని నిరూపించడమే ఈ సమస్యకి పరిష్కారం అని ప్రేరణ అంటుంది. సిద్ధూ షాక్ అయిపోతాడు. ఈ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు సిద్ధూ.. ఏది అయితే నువ్వు నిజం అని నమ్ముతున్నావో అదే నిజమని నిరూపిస్తే.. సాక్ష్యాలతో సహా నిరూపిస్తే అత్తయ్య నన్ను క్షమిస్తారు అని అంటుంది. లేని ఆశ నాలో రేపకు ప్రేరణ అని సిద్ధూ అంటే ఇది ఆశ కాదు సిద్ధూ మీ అమ్మగారు నిజం తెలుసుకోవాలి.. ఆ విజయానంద్‌ని గుడ్డిగా నమ్ముతున్నారు అని ప్రేరణ అంటుంది.
మళ్లీ మొదలెట్టిన బిస్కెట్ రాజా..
ఐశ్వర్య మ్యూజిక్ క్లాస్‌కి తీసుకెళ్లమని అంటే రంజిత్ తీసుకెళ్తాడు. ఇద్దరూ బయటకు వెళ్లే సరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎదురు పడి.. నేను కారులో డ్రాప్ చేస్తా అంటాడు. అవసరం లేదు నేను ఉన్నాను నేను తీసుకెళ్తా అని రంజిత్ అంటాడు. ఓనర్ గారితో రావడం నాకు అలవాటే నేను వెళ్తా అని ఐశ్వర్య చెప్తుంది. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. ఈయన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు అని రంజిత్ అంటాడు.
మంజుల ఫైనాన్స్ కంపెనీలో మోసం..
సిద్ధూ, ప్రేరణ బయటకు వచ్చి కొబ్బరి బోండాం తాగుతూ ఉంటారు. రోడ్డు మధ్యలో ఓ పెద్దాయన ఏదో ఆలోచిస్తూ ఉంటే కారు ఢీ కొట్టే టైంకి సిద్ధూ కాపాడుతాడు. నేను బతకుండి ఏం లాభం అని ఆయన ఏడుస్తాడు. చనిపోయే అంత కష్టం ఏం వచ్చింది అని ప్రేరణ అడిగితే జీవనం సాగాలి అంటే డబ్బు ఉండాలి కదా.. నా బాధ్యత తీసుకోవడానికి కొడుకులు లేరు.. ఒక్క కూతురే ఉంది.. దాని కోసం చాలా కష్టపడ్డాను.. ఫైనాన్స్ కంపెనీలో డబ్బు పెట్టా ఇప్పుడు వాళ్లు నన్ను మోసం చేశారు అని చెప్తాడు. సిద్ధూ ఆయనతో నేను మీకు న్యాయం చేస్తా ఇంతకీ ఆ కంపెనీ పేరు ఏంటి అని అడుగుతాడు. మంజుల ఫైనాన్స్ కంపెనీ అని ఆయన చెప్పడంతో సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ షాక్ అయిపోతారు. వారం రోజుల్లో మొత్తం క్లియర్ చేస్తాం అని సిద్ధూ, ప్రేరణ చెప్తారు.
ఆయన సంగతి చెప్తా..
ప్రేరణ సిద్ధూతో ఆయన చెప్పింది అత్తయ్య కంపెనీ గురించేనా అని అడుగుతుంది. అవును అని సిద్ధూ అంటాడు. ఇదంతా అమ్మకి తెలీదు.. ఇదంతా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్న వాళ్లే చేస్తున్నారు అని అంటాడు. అంతే ఇదంతా మామయ్య చేశారన్న మాట అని అంటుంది. సిద్ధూ ఇప్పుడే ఆయన సంగతి చెప్తా అని అంటే ఆగు సిద్ధూ మనం చెప్తే వినే పరిస్థితిలో అత్తయ్యగారు లేరు.. సాక్ష్యాలతో సహా నిరూపించాలి అని ప్రేరణ అంటుంది.
టీవీలో న్యూస్.. మంజు షాక్..
మంజుల కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందని న్యూస్ వస్తుంది. మంజుల షాక్ అయిపోతుంది. సిద్ధూ, ప్రేరణ కూడా చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుస్తాడు. ఇదంతా ఫేక్ అని విజయానంద్ అంటాడు. కళ్ల ముందు న్యూస్ అంత క్లియర్‌గా వస్తే ఫేక్ అంటారేంటి.. విషయం చెప్పండి అని అడుగుతుంది. కంపెనీ చూసుకునేది నువ్వే కదా మోసం చేసే కంపెనీకి మా అమ్మ పేరు పెట్టి ఎందుకు మా పరువు తీస్తున్నావ్ అని సిద్ధూ అడుగుతాడు. ఆయన అలాంటి పని చేయరు సిద్ధూ ఎక్కడో ఏదో జరిగింది అని అంటుంది. విజయానంద్ మనసులో ఇది ఇప్పుడు నా మీదకు రాకుండా చేయాలి అని అంతా నేనే చూసుకోలేక ఓ పార్టనర్‌ని పెట్టా ఆయనే ఇదంతా చేసుకుంటారు అని అంటాడు. మీకు తెలీకుండా ఏం జరుగుతుందా మామయ్య గారు అని ప్రేరణ అడిగితే నువ్వు మధ్యలో దూరకు ఇది మా ఇంటి విషయం అని విజయానంద్ అంటే నేను ఈ ఇంటి కోడలిని అని ప్రేరణ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ మంజుల పేరు మీదే విజయానంద్ చేస్తున్న మోసాన్ని నిరూపిస్తారా.. లేదంటే విజయానంద్ మళ్లీ ఎప్పటిలా తప్పించుకుంటాడా.. ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















