Nindu Manasulu Serial Today May 21st: నిండు మనసులు: తండ్రిని గుర్తు చేసుకొని ఏడ్చేసిన సిద్ధూ! బెడ్ మీద సిద్ధూ ప్రేరణని కొట్టడానికి కారణమేంటి?
Nindu Manasulu Serial Today may 21st: సిద్ధూ తండ్రి ఫొటో చూసుకుంటూ ఏడ్వడం మంజు కొడుకుని ఓదార్చడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణని రౌడీలు ఏడిపించడంతో సిద్ధూ వాళ్లని చితక్కొడతాడు. నాలుగు తగిలించి ఇప్పుడు కామెంట్ చేయండిరా అని అనడంతో సారీ సిస్టర్ అని చెప్పి వాళ్లు వెళ్లిపోతారు. సిద్ధూ నువ్వు నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోవు అని నాకు తెలుసు అని ప్రేరణ అంటే నీ స్థానంలో ఎవరు ఉన్నా ఇలాగే చేస్తా అని సిద్ధూ అంటాడు. నేను వేరే వాళ్లు ఒక్కటేనా అని ప్రేరణ అడిగితే ముందు ఇంటికి వెళ్దాం పద అని అంటాడు.
ప్రేరణ మనసులో నా మీద నీకు చాలా ప్రేమ ఉంది.. కానీ చెప్పడానికి కొన్ని కారణాలు అడ్డు వస్తున్నాయి అని అనుకుంటుంది. సిద్ధూ ప్రేరణలు ఇంటికి వస్తారు. సిద్ధూ షర్ట్ చిరిగిపోవడం.. ప్రేరణ జుట్టు చెదిరిపోవడం చూసి మంజుల ఏమైందని కంగారుగా అడుగుతుంది. బైక్ మీద వస్తుంటే ఇద్దరం కింద పడిపోయాం అని సిద్ధూ అంటాడు. అసలు విషయం ఎందుకు చెప్పడం లేదు అండీ అని ప్రేరణ గొడవ గురించి చెప్తుంది. నా మీద నా భర్త ఒక్క చేయి పడనివ్వలేదు అని అంటుంది. పరీక్షలకు వెళ్లారు కదా ఈ ఊహించనిది ఏంటి అని విజయానంద్ అడిగితే జీవితంలో కొన్ని ఊహించనివి జరుగుతాయి కదా మామయ్య అని అంటుంది. పరీక్షలు ఎలా రాశారు అని విజయానంద్ అడిగితే బాగా రాశాం అని చెప్తుంది. అన్నయ్య అంత పెద్ద ఫైట్ చేశావా.. నా కోసం ఎప్పుడైనా చేశావా అని సాహితి అడుగుతుంది. సిద్ధూ ఏమైనా ఫైట్ మాస్టర్ అనుకున్నావా అని విజయానంద్ అడుగుతాడు. ఏది ఏమైనా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మంజు అంటుంది.
ప్రేరణ బెడ్ మీద పడుకుంటే సిద్ధూ వద్దని సోఫాలో పడుకోమని అంటాడు. అక్కడ నాకు నిద్ర పట్టదు నేను పడుకోను అని ప్రేరణ అంటే సిద్ధూ సోఫాలోకి వెళ్తాడు. ఏంటి అలా వెళ్లిపోయావ్.. నీ దగ్గర నిగ్రహం లేదా.. అని అడుగుతుంది. నేను అందరి లాంటి మగాడిని కాదు మల్లెపూలు కనిపిస్తే పడిపోవడానికి అని అంటాడు. నీ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఇక్కడే పడుకో అని పిలుస్తుంది. నా మీద నాకు బాగా నమ్మకం ఉందని సిద్ధూ కూడా బెడ్ మీదకు వెళ్లిపడుకుంటాడు. రాత్రి సిద్ధూ అంతరాత్మ వచ్చి నువ్వేం ప్రేరణని చేయడం లేదు,, నేను ముద్దు పెడతా చూడు అని వెళ్లబోతే సిద్ధూ లాగి పెట్టి కొడతాడు. ప్రేరణకు గట్టిగా తగులుతుంది. ప్రేరణ లేచి నీకు నా మీద చాలా కోపం ఉందని నాకు తెలుసు కానీ నేను కొట్టే అంత తప్పు ఏం చేశాను అని ఏడుపు నటిస్తుంది. ఎన్నాళ్లు ఇలాంటి దాడులు తరతరాలుగా భర్తలు ఇలా భార్యల్ని కొడతారా.. ఏంటీ పురషఅహంకారం అని అంటుంది. వాడిని కొట్టబోయి నిన్ను కొట్టాను అని సిద్ధూ అంటే వాడు ఎవడు సిద్ధూ అని ప్రేరణ అంటుంది. ఈ బెడ్ మీద ఏం నేను పడుకోను అని ప్రేరణ సోఫా మీదకు వెళ్లిపోతుంది. ఏరా బాగా అయిందా అని అంతరాత్మ మళ్లీ వస్తుంది. దాంతో సిద్దూ రేయ్ మళ్లీ వచ్చావా నిన్ను చంపేస్తా చెప్తున్నా అని ప్రేరణ వైపు వెళ్తే ప్రేరణ షాక్ అయి లేచేస్తుంది. ఏంటి సిద్ధూ ఇది అని అంటుంది. ఇద్దరూ పడుకుంటారు.
ఉదయం సిద్ధూ తండ్రి ఫొటో పట్టుకొని చూస్తూ ఉంటే మంజుల పక్కనే కూర్చొని కన్నీరు పెట్టుకుంటుంది. విజయానంద్ కూడాఅక్కడే ఉంటాడు. ప్రేరణ మేడ మీద నుంచి చూస్తూ ముగ్గురు అక్కడ ఏం చేస్తున్నారు అని అనుకుంటుంది. నాన్న నువ్వు లేని లోటు నాకు ఎవరూ తీర్చలేదు.. ఎందుకు నన్ను అమ్మని వదిలేసి వెళ్లిపోయావ్.. ఇంత డబ్బు సంపాదించావ్.. ఇన్ని ఉండి కూడా నేను ఒంటరిగా ఉన్నాను.. జీవితంలో నేను ఎన్ని సంపాదించినా తండ్రి ప్రేమ లేని నేను దురదృష్టవంతుడిని అని అనుకుంటాడు. మంజుల ఏడుస్తూ సిద్ధూ మీనాన్న లేని లోటుని నువ్వు ఎలా ఫీలవుతున్నావో నేను అలాగే ఫీలవుతున్నాను.. నీ పుట్టిన రోజుని చాలా గ్రాండ్‌గా చేసేవాళ్లు అలాంటిది నీ పుట్టిన రోజు రోజే మనకి దూరం అయిపోయారు అని ఏడుస్తుంది. శరత్ గారి ఆబ్దికానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను అని చెప్తూ విజయానంద్ ఇద్దరినీ ఓదార్చుతాడు. నువ్వేం నాకు ఓదార్చాల్సిన అవసరం లేదు అని సిద్ధూ అంటాడు. అమ్మ నాన్నకి నేను అంటే ఎందుకు అంత కోపం అమ్మా,, ఎందుకు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. నాన్న నా పుట్టిన రోజున తన జ్ఞాపకాలను కన్నీటిని ఇచ్చాడు అని అంటాడు. సిద్ధూ నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేరా.. ఆయన తర్వాతా నువ్వు కాకపోతే నాకు ఎవరు ఉన్నారురా.. మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంరా నువ్వు .. నాన్న నీలో ఆయన్ను చూసుకుంటున్నాను.. ఆయన లేని లోటు నువ్వే నాకు తీర్చాలి అని అంటుంది. మంజు నేను ఇంకా ఎక్కువ మాట్లాడను.. శరత్ గారి ఆబ్దికానికి అన్నీ ఏర్పాట్లు చేశాను మీరు వస్తే వెళ్దాం అని అంటాడు. సిద్ధూ తండ్రి ఫొటోని తీసుకెళ్లి గదిలో పెడతాడు. ప్రేరణ ఆ ఫొటో చూస్తుంది.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















