Naga Panchami Telugu Serial Today Episode
పంచమి, ఫణేంద్ర మాట్లాడుకోవడం చిత్ర చూస్తుంది. ఇక ఆ విషయం జ్వాలకు చెప్పి తనని అక్కడికి తీసుకొస్తుంది. అయితే అప్పటికే పంచమి, ఫణేంద్రలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. చిత్ర, జ్వాలలు షాక్ అవుతారు. ఇక చిత్ర అయితే తాను నిజంగానే పంచమి మాట్లాడటం చూశాను అని ఆ తనని నమ్మమని జ్వాలని కోరుతుంది. జ్వాలా నమ్మాను అని చిత్రతో చెప్తుంది. పంచమి లోపలికి వచ్చుంటుంది అని ఆ వ్యక్తి అంత తొందరగా ఎలా మాయం అయిపోతాడు అని పైగా అక్కడి పాము ఎలా వచ్చింది అని ఆలోచిస్తారు. ఇక ఆ పాము పంచమి కోసమే వచ్చిందని.. పంచమి ప్లానే ఇదంతా అని అనుకుంటారు. ఇక మోక్ష అక్కడికి వస్తాడు.
జ్వాల: మోక్ష పంచమి గురించి నీ అభిప్రాయం ఎంటి మోక్ష. అంటే తను మంచిది అనా చెడ్డది అనా..
మోక్ష: మీ క్యారెక్టర్ గురించి మీరు ఏమని చెప్తారు. గుడ్ అనా బ్యాడ్ అనా.. అందుకేనా నన్ను పిలిచారు..
జ్వాల: మోక్ష మేము ఇంకా అసలు విషయం చెప్పలేదు. పంచమికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.
చిత్ర: అందుకు నేనే సాక్ష్యం. మన గార్డెన్‌లో వాళ్లిద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటే నేను చూశాను.
మోక్ష: (ఏం తెలీనట్లు నటిస్తూ) అతను ఎలా ఉన్నాడు.
చిత్ర: చాలా స్మార్ట్‌గా ఉంటాడు. మన లాగ కాకుండా సినిమాల్లోలా వేషాలు వేసినట్లు డ్రస్ వేసుకున్నాడు.
మోక్ష: పంచమి ఫణేంద్ర గురించి చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. ఇక తర్వలో ఓ పాము నిన్ను కాటేస్తుంది అని వాళ్లు చెప్తే షాక్ అయినట్లు గ్యారెంటీనా అని అడుగుతాడు. పంచమి నాకు అన్ని విషయాలు చెప్పింది. పంచమికి ఈ ఇంట్లో ఇద్దరు శత్రువులు ఉన్నారట. ఆ ఇద్దరిని పాము కాటేసి చంపేస్తుందట. పంచమి ఎంత చెప్పినా ఆ పాము వినడం లేదుట. బహుశా మీరు ఆ పామునే చూసుంటారు. మీకు ఇంకా డౌటా వదినలు.. మీరు చూసింది ఆ పాములన్నింటికీ రాజు అంట. పంచమికి పాముల భాష తెలుసుకదా.. ఫ్రెండ్ పాము తన మాట వినడం లేదని పంచమి పాముల హెడ్‌కి చెప్తే ఆయన వచ్చారు అంట. పంచమికి చాలా పాముల ఫ్రెండ్స్ ఉన్నారు. తనని మీరు ఏడిపిస్తే మిమల్ని అవి కాటేసి చంపేయడం ఖాయం. జాగ్రత్త..
మరోవైపు మేఘన, ఫణేంద్ర గుడి దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు. యువరాణి వస్తుందా అని మేఘన అడుగుతుంది.
ఫణేంద్ర: నేను చెప్పాల్సింది చెప్పాను. తనకు నా మాటల మీద నమ్మకం కలినట్లు నాకు అనిపించింది. కచ్చితంగా వస్తుంది.
మేఘన: నేను మళ్లీ అడుగుతున్నాను యువరాజా. నాగమణిని కచ్చితంగా భూలోకంలోకి తీసుకురాగలరు కదా.
ఫణేంద్ర: అందుకు యువరాణికి నా శాయశక్తులా సాయం చేస్తాను.
మేఘన: మనల్ని నమ్మి యువరాణి మోక్షని కాటేసి చంపాలి. నాగమణిని తీసుకురాకపోతే ఆ పాపం మనకే తగులుతుంది.
ఇంతలో పంచమి అక్కడికి వస్తుంది. మేఘన పంచమికి దండం పెడుతుంది. ఫణేంద్ర తాను నాగకన్య మేఘన అని పరిచయం చేస్తాడు.
మేఘన: మీ గురించి నాకు అంతా తెలుసు యువరాణి. మోక్షని బతికించడానికి మీకు సాయం చేయాలి అని నేను యువరాజు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం.
ఫణేంద్ర: ఇక ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు యువరాణి. ఈ నాగ కన్య నీ భర్త శరీరాన్ని రక్షించగలదు. మనం నాగలోకం వెళ్లి నాగమణిని తీసుకొచ్చేద్దాం.
పంచమి: నాగమణి గురించి చెప్తే నా భర్త నమ్మడం లేదు.
మేఘన: నాగమణి శక్తి తెలిని వారు నమ్మటం కష్టమే యువరాణి. ఇదంతా నమ్మడానికి కొంత టైం పడుతుంది.
ఫణేంద్ర: మనం ఏం చేసినా ముక్కోటి ఏకాదశి రోజు వరకే ఆ తర్వాత నేను మోక్షని కాటేసి చంపి నాగలోకం వెళ్లాలి.
పంచమి: నాగమణి కచ్చితంగా బతికించగలదా యువరాజా.
ఫణేంద్ర: అందులో ఎలాంటి సందేహం లేదు యువరాణి. మోక్ష అందుకు ఒప్పుకొని నువ్వు మోక్షని కాటేస్తానని కచ్చితంగా చెప్తేనే నేను వెళ్లి నాగలోక ప్రవేశం కోసం నాగదేవతకు అభ్యర్థించాలి.
మేఘన: ఇంకేం ఆలోచించకండి యువరాణి ఈ అవకాశం పోతే మోక్ష ప్రాణాలతో ఉండడం జరగదు. నన్ను మీతో తీసుకెళ్లి మీ ఇంట్లో ఉంచే ఏర్పాట్లు చేయండి మోక్షకి నేను నమ్మకం కలిగిస్తాను.
ఫణేంద్ర: మేఘన నాగకన్య అని మోక్షకి చెప్పు యువరాణి. తను చనిపోయినా తన శరీరాన్ని మేఘన భద్ర పరుస్తుంది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు.
మేఘన: అవును యువరాణి నాకు కొన్ని మంత్ర శక్తులున్నాయి మోక్షకి ధైర్యం కలిగించే బాధ్యత నాది.
పంచమి: మనం నాగమణిని తీసుకురాలేకపోతే..
ఫణేంద్ర: అది నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది యువరాణి. నువ్వు శాశ్వతంగా నాగలోకంలో ఉండిపోతాను అని ఒప్పుకుంటే నీకు ఇష్టరూప నాగుల శక్తులు ప్రసాదించేలా నేను నాగదేవతను ఒప్పిస్తాను. అప్పుడు నువ్వు చాలా సులభంగా నాగమణి తెచ్చి మోక్షని రక్షించగలవు. అయితే నువ్వు కచ్చితంగా నాగమణితో నాగలోకం తిరిగి రావాలి. మోక్షని శాశ్వతంగా మర్చిపోవాలి.
మేఘన: సరే అనండి యువరాణి. మీ మీద జాలితో యువరాజు మీకు సాయం చేయడానికి అంగీకరించాడు. ఈ విషయం నాగ దేవతకు తెలిస్తే యువరాజు ప్రాణాలకు కూడా ప్రమాదం.
పంచమి: సరే మీ ఇద్దర్ని నమ్మి నేను ఇందుకు అంగీకరిస్తున్నాను. నన్ను మీరు మోసం చేయకూడదు.
మేఘన: మీరు మాకు యువరాణి మిమల్ని మేము ఎందుకు మోసం చేస్తాం.
ఫణేంద్ర: ఇంకేం ఆలోచించకుండా మేఘనను మీతో తీసుకెళ్లండి యువరాణి.
పంచమి: అలాగే యువరాజా.. నాక్కూడా అంతకు మించి అవకాశం లేదు. ఏదో ఒకటి కచ్చితంగా చేయాల్సిందే. మేఘనను నా స్నేహితురాలిగా చెప్పి నాతో పెట్టుకుంటాను.
ఫణేంద్ర: మీ ఇద్దరూ కలిసి వీలైనంత తొందరగా మోక్షని ఒప్పించండి. నేను వెళ్లి నీ ప్రవేశం కోసం నాగదేవత అనుమతి తీసుకుంటాను.
మేఘన: ఎవరికీ అనుమానం రాకుండా నేను నిన్ను పంచమి అని పిలుస్తాను యువరాణి. మీకు సమ్మతమేనా యువరాణి.
పంచమి: నా చిన్ననాటి స్నేహితురాలు.. అనాథ.. గుడి దగ్గర కనిపించింది తీసుకొచ్చాను అని చెప్తాను. మరో విషయం మేఘన నువ్వు నాగ కన్యవి అని నేను వెంటనే నా భర్తకు చెప్పను. నువ్వు చెప్పకు. సమయం చూసి నేనే చెప్తాను.
ఫణేంద్ర: మీరేం చేసినా ఏకాదశిలోపే చేయాలి యువరాణి.. తర్వాత నేను మోక్షని కాటేసి తీరాలి. నేను వెళ్లి నిన్ను నాగలోకానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తాను. నువ్వు నాగలోకం రావడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇక పంచమి, మేఘన వెళ్లి పోయిన తర్వాత ఫణేంద్ర నాగలోకంలో పంచమితో తనకు పెళ్లి జరిగినట్లు కల కంటాడు.
ఫణేంద్ర: నాగలోకం రావడానికి యువరాణి ఒప్పుకుంది. ఎలా అయినా నాగదేవతను వేడుకొని యువరాణిని తీసుకెళ్లిపోవాలి. నాతో రావడానికి యువరాణి ఒప్పుకుంది. ఎలా అయినా యువరాణిని తీసుకెళ్లి యువరాణి పీఠం మీద కూర్చొపెట్టి నా బాధ్యత నెరవేర్చుకోవాలి. తర్వాత యువరాణిని ఒప్పించి నాగదేవత అనుమతితో యువరాణిని పెళ్లి చేసుకోవాలి. నాగలోకంలో నేను యువరాణి సంతోషంగా ఉండాలి. యువరాణి నా సొంతం అవుతుంది అని ఊహించుకుంటేనే ఇంత ఆనందంగా ఉంది. అదే నిజం అయితే ఇక నా అంత అదృష్ట వంతుడు ఉండడు. నా కలను నిజం చేసుకోవాలి.
మరోవైపు మోక్ష ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి తన తల్లి వస్తుంది. నీలో మళ్లీ పాత మోక్షని చూడాలి అని వైదేహి అంటుంది. మోక్ష బాగానే ఉన్నా అంటాడు. ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు. ఇక చిత్ర కలగజేసుకొని మన ఇంట్లో మనకు తెలీకుండా చాలా జరిగిపోతున్నాయి అని అంటుంది. పంచమి ఓ వ్యక్తితో రహస్యంగా మాట్లాడుతుందని చెప్తుంది. ఈ విషయం మోక్షకి కూడా తెలుసని జ్వాలా చెప్తుంది. ఇక వాళ్లని శబరి తిడుతుంది. ఇక మోక్ష తన వదినలు చెప్పింది అబద్ధం కాదని అంటాడు. పంచమితో మాట్లాడిని వ్యక్తి తనకి బాగా తెలుసని మోక్ష అంటాడు. మరోవైపు పంచమి, మేఘన ఇంటికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.