Meghasandesam Serial weekly Episode: అపూర్వ భూమికి పెళ్లి చేయాలని తెలిసిన సంబంధ చూద్దాం అంటుంది. ఎవరున్నారు తెలిసిన వాళ్లు అని శరత్‌చంద్ర అడిగితే మీ ప్రెండ్ వాళ్ల అబ్బాయి ఉదయ్ ఉన్నాడు కదా అని చెప్తుంది. దీంతో అపూర్వ వాళ్లకు ఫోన్ చేసి భూమి, గగన్‌ల గురించి అన్ని విషయాలు చెప్తుంది. అయినా సరే భూమిని పెళ్లి చేసుకోవాడనికి ఉదయ్ ఒప్పుకుంటాడు. దీంతో అందరినీ ఇంటికి పిలుస్తాడు శరత్‌చంద్ర. విషయం మొత్తం తెలుసుకున్న భూమి ఇంట్లో ఉండకుండా గగన్ వాళ్ల ఇంటికి వెళ్తుంది.
ఇంటికి వచ్చిన భూమిని చూసిన శారద టెన్షన్ పడుతుంది. అప్పుడే గగన్ వచ్చి శరత్ చంద్రకు ఫోన్ చేసి కూతురుకు పెళ్లి ఇష్టమో కాదో తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేస్తావా..? నీ కూతరు ఇప్పుడు నా ఇంట్లో ఉందని చెప్తాడు. గగన్ కాల్ కట్ చేశాక నాన్నకు ఎందుకు కాల్ చేశావు అని భూమి అడగ్గానే.. భూమిని తిట్టి ఇంట్లోంచి వెళ్లగొడతాడు గగన్. తర్వాత శివను కాలేజీలో జాయిన్ చేస్తాడు గగన్.
నక్షత్ర ఉదయమే లేచి పూజ చేసి చెర్రి మీద ప్రేమ ఉన్నట్టు అందరి ముందు నటిస్తూ లోపలికి వెళ్లి నిద్రపోతున్న చెర్రి ముఖం మీద కాఫీ పోస్తుంది. దీంతో చెర్రి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకు కేపీ వచ్చి ఏమైందని అడుగుతాడు. జరిగిన విషయం చెప్పగానే కేపీ బాధపడతాడు. తర్వాత ఉదయ్, శరత్ చంద్ర ఇంటికి వస్తుంటే.. కారు ట్రబుల్ ఇస్తుంది. ఇంతలో గగన్ కారులో వస్తుంటే లిఫ్ట్ అడిగి ఎక్కుతాడు. ఎక్కడికి అని గగన్ అడిగితే శరత్ చంద్ర ఇంటికి అని చెప్తాడు. దీంతో గగన్ వివరాలు అడగ్గానే ఆ ఇంటికి కాబోయే అల్లుడిని అని భూమిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్తాడు. దీంతో భూమికి పెళ్లి ఇష్టమేనా అని గగన్ అడగ్గానే.. వెంటనే ఉదయ్ శరత్ చంద్రకు ఫోన్ చేసి భూమితో పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు. శరత్ చంద్ర ఇష్టమే అని చెప్పు అనగానే భూమి ఇష్టమే అని చెప్తుంది. దీంతో గగన్ బాధపడతాడు. తర్వాత ఇంటికి వెళ్లి బెడ్‌రూంలో పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తాడు గగన్. అది చూసిన శివ బాధపడుతూ వెంటనే భూమికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు. శివ.. గగన్ పరిస్థితి చెప్పగానే భూమి ఏడుస్తుంది.
శివ తీసుకెళ్లిన బొమ్మ కోసం అపూర్వ, సుజాతను గగన్ ఇంటికి పంపిస్తుంది. ఇంటికి వచ్చిన సుజాతను చూసిన శారద షాక్ అవుతుంది. ఎందుకు వచ్చారని అడుగుతుంది. విబూది ఇద్దామని వచ్చాను. ఈ విబూది ఇల్లంతా చల్లితే ఇప్పుడున్న సమస్యలు తీరిపోతాయి అంటూ బొమ్మ కోసం విబూది చల్లుతూ ఇల్లంతా వెతుకుతుంది. శారద కిచెన్‌లో కాఫీ చేస్తుంది. సుజాతకు బొమ్మ కనిపించగానే తీసుకుని వెళ్లిపోతుంది. గేటు దగ్గరకు వెళ్లగానే.. గగన్ వస్తాడు. సుజాత చేతిలో బొమ్మ తీసుకుని మా ఇంటికి ఎందుకు వచ్చావు.. అంటూ తిట్టి పంపిస్తాడు.
ఇక కాలేజీకి వెళ్తున్న శివను బయటకు తీసుకెళ్లి ఫోన్ కొనిస్తుంది భూమి. త్వరలోనే అకౌంట్ ఓపెన్ చేసి ఖర్చులకు డబ్బులు వేస్తాను అని చెప్తుంది. ఇంతలో దూరం నుంచి రౌడీలతో రెడీగా ఉన్న కావ్య, భూమిని చంపాలని ప్లాన్ చేస్తుంది. రౌడీలకు భూమిని చూపించి వెంటనే కారుతో ఢీకొట్టమని చెప్తుంది. రౌడీలు వెనక నుంచి వెళ్లి భూమిని ఢీకొట్టి వెళ్లిపోతారు. శివ ఏడుస్తూ భూమిని హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. గగన్ వాళ్లకు ఫోన్ చేసి చెప్తాడు. హాస్పిటల్‌లో ఉన్న భూమి దగ్గరకు శారద, గగన్ వస్తారు. ఇంతలో అక్కడ ఒక పాప రిషిత.. భూమిని చూసి దేవుడు ఆమెను బతికించాలని అందుకోసం తాను డాన్స్ చేస్తానని డాన్స్ చేస్తుంది. ఆ పాప డాన్స్ చూసి అందరూ మెచ్చుకుంటారు. ఇంతలో నర్స్ వచ్చి భూమి కళ్లు తెరిచిందని ఇక ఔటాప్ డేంజర్ అని చెప్తుంది. తర్వాత గగన్ అక్కడి నుంచి శారద, శివను తీసుకుని వెల్లిపోతాడు.
శరత్ చంద్ర, ఉదయ్ తో కలిసి హాస్పిటల్ కు వస్తాడు. వాళ్లతో అకాడమీ ఓపెనింగ్ రేపే ఉంది ఎలా అని అడుగుతుంది. ఆ గగన్ తో కలిసి నువ్వు ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదంటాడు శరత్ చంద్ర. కానీ తనకు ఇష్టమేనని ఉదయ్ చెప్తాడు. దీంతో ఈ వారం మేఘసందేశం సీరియల్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!