Meghasandesam Serial Today Episode: తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో దేవుడి గుడిలో ముడుపు కట్టిన గగన్ అక్కడి నుంచి హాస్పిటల్‌కు వచ్చి తాను తీసుకొచ్చిన విబూది శారద నుదుటిన పెట్టి ఎమోషనల్ అవుతుంటాడు.
గగన్: ఇక నీకేం కాదు అమ్మ నిన్ను చూసుకోవడానికి ఆ శివుడు ఉన్నాడు. ( ఇంతలో డాక్టర్ వస్తుంది) డాక్టర్ మా అమ్మకు ఏమీ కాదుగా.. చెప్పండి డాక్టర్..
డాక్టర్: మీరు కాసేపు బయట ఉండండి చూసి చెప్తాను.
అనగానే భూమి, గగన్ బయటకు వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి బయటకు వెళ్తుంది.
డాక్టర్: గగన్ గారు ఇక మీ అమ్మ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. మీరేం కంగారు పడకండి తనకు ఏ క్షణంలోనైనా స్పృహ రావొచ్చు
అని డాక్టర్ చెప్పగానే.. గగన్ ఎమోషనల్ అవుతూ డాక్టర్‌కు థాంక్స్ చెప్తాడు. తర్వాత ఐసీయూలో ఉన్న శారదకు స్పృహ వస్తుంది. పక్కనే పడుకుని ఉన్న భూమి లేచి చూసి హ్యాపీగా ఫీలవుతుంది. అత్తయ్యా మీరు చూస్తున్నారా..? అంటూ సతోషంగా గగన్‌కు చెప్పాలనుకుంటుంది.
భూమి: అత్తయ్యా ఇప్పుడే నేను వెళ్లి బావను తీసుకొస్తాను..
అంటూ భూమి బయటకు వెళ్లబోతుంటే.. శారద భూమి చేయి పట్టుకుని ఆపేస్తుంది. దగ్గరకు రా అంటూ సైగ చేస్తుంది. దీంతో దగ్గరకు వెళ్తుంది భూమి.
భూమి: ఏంటి అత్తయ్యా చెప్పండి.. అయినా బావను తీసుకొస్తాను.. ఆగండి.. ఇద్దరికి చెబుదురు ఆ విషయం..
శారద: ముందు నీకు చెప్పాలి భూమి… తర్వాత గగన్‌కు చెబుదాం..
భూమి: అయితే ఏంటో చెప్పండి అత్తయ్యా.. మెల్లగా జాగ్రత్త
శారద: ఏమీ కాదులో భూమి.. మీ అమ్మ ఫైర్ యాక్సిడెంట్ లో మరణించలేదు భూమి.. అసలు తనది మామూలు చావు కాదు.. ఘోరంగా చంపేశారు.. కుర్చీకి కట్టేసి తప్పించుకునే వీలు లేకుండా.. మంటల్లో మాడి మసై పోయేలా ప్లాన్ చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం మీ అమ్మను చంపేసి.. ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయేలా క్రియేట్ చేశారు.
భూమి: ఏంటి అత్తయ్యా మీరు చెప్పేది..?
శారద: అవును భూమి మీ అమ్మను చంపింది ఎవరో కాదు భూమి.. మీ పిన్ని.. ఆమె చంపుతుండగా తీసిన వీడియో ఆ రికార్డర్‌లో ఉంది భూమి. ( భూమి షాక్ అవుతుంది. ఏడుస్తుంది.) ఆ వీడియో నేను చూశాను. ఆ వీడియో కోసమే ఆ రత్న మన ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆ వీడియో కోసమే నన్ను చంపాలని చూశారు భూమి. ఈ విషయం వెంటనే గగన్‌కు చెప్పాలి..
భూమి: వద్దు అత్తయ్యా ఈ విషయం బావకు చెప్పొద్దు..
శారద: ఎందుకు చెప్పొద్దు భూమి.. వెంటనే నిజం గగన్‌కు తెలియాలి.
భూమి: అత్తయ్యా ఈ విషయం బావకు చెబితే.. బావ కోపంతో అపూర్వ చంపడానికైనా తెగిస్తాడు. ఆ అపూర్వ గురించి మీకు తెలుసు కదా అత్తయ్యా.. అది ఎంత నరరూప రాక్షసురాలో మర్చిపోయారు. తన అవసరాల కోసం ఎవరినైనా చంపేందుకు సిద్దంగా ఉంటుంది ఆ రాక్షసురాలు. తనను చంపడానికి బావ వస్తున్నాడని అపూర్వకు ఊరుకుంటుందా అత్తయ్యా ఏదో ఒకటి చేస్తుంది. అప్పుడు బావ ప్రమాదంలో పడతాడు అత్తయ్యా.. బావకు ఈ విషయాలు మనం ఎప్పటికీ చెప్పొద్దు అత్తయ్య. ఈ విషయం బావకు తెలియకుండా మనం చాలా జాగ్రత్త పడాలి అత్తయ్యా
అంటూ భూమి చెప్తుండగానే.. గగన్ ఐసీయూ డోర్ తెరుచుకుని వస్తాడు. గగన్ ను చూసిన భూమి, శారద షాక్ అవుతారు. గగన్ తాము మాట్లాడుకుంది విన్నాడేమోనని భయపడతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!