Meghasandesam Serial Today Episode: నక్షత్ర రూంలో కూర్చుని మందు తాగుతూ ఉంటుంది. ఇంతలో చెర్రి వస్తాడు. మందు తాగడం చూసి షాక్‌ అవుతాడు. ఇంట్లో అందరూ ఉన్నా కూడా మందు తాగుతున్నావా..? అని అడుగుతాడు.

నక్షత్ర: బాధరా బాధ

చెర్రి: దేనికి నీకు బాధ

నక్షత్ర: నచ్చిన గగన్‌ బావను చేసుకుని నాకు నచ్చినట్టు నేను బతకాలి అనుకుంటే మధ్యలో నువ్వొచ్చి తాళి కట్టి నా లైఫ్‌ను స్పాయిల్‌ చేశావు.

చెర్రి: చేశాను. మరి నువ్వు చేసింది ఏంటి..? భూమి లైఫ్‌ను స్పాయిల్‌ చేయాలనుకోలేదు. మొన్న ఒకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్లి మందు తాగి గొడవ చేశావు. ఈరోజు ఇంట్లోనే కూర్చుని తాగుతున్నావు. ఇలా కాదు ఇప్పుడే మామయ్యను పిలిచి నీ నిజస్వరూరం ఏంటో ఆయనకు చూపించేస్తాను.

నక్షత్ర: ఓరేయ్‌ చెర్రి నీది ఇంకా నైంటీ స్పీడురా..? నాది ట్వంటీ ట్వంటీ స్పీడు ఎలా ఉంటుందో శాంపుల్  చూపించనా..? ఇదిగో ఈ గ్లాస్‌ పట్టుకో..

అంటూ చెర్రి గ్లాస్‌ పట్టుకున్నాక అందులో కాస్త మందు పోసి చెర్రి మీద చల్లుతుంది. చెర్రి ఇరిటేటింగ్‌ గా నక్షత్ర ఏం చేస్తున్నావు అంటాడు.

నక్షత్ర: ఇప్పుడు మా నాన్నను పిలిచి నిన్ను తిట్టించమంటావా..?

చెర్రి: తాగింది నువ్వైతే నన్నెందుకు తిడతారు.

నక్షత్ర: ఈ నక్షత్ర అనుకుంటే  ఏదైనా అవుతుంది. కావాలంటే నీకు ప్రాక్టికల్‌ గా చూపిస్తాను చూడు..

అంటూ తనను తాను కొట్టుకుంటూ ఏడుస్తూ.. డాడీ చెర్రి తాగేసి నన్ను కొట్టేస్తున్నాడు నన్ను కాపాడు డాడీ అంటూ అరుస్తుంది. ఇంతలో శరత్‌ చంద్ర, భూమి రూంలోకి పరుగెత్తుకుని వస్తారు.

శరత్‌: ఏమైందమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు..

నక్షత్ర: చూడు డాడీ పట్టపగలు చెర్రి ఇంట్లో మందు తాగుతున్నాడు. వద్దన్నందుకు నన్ను కొడుతున్నాడు. నేను ఈ ఇంటి అల్లుడిని నాకు అన్ని హక్కులు ఉన్నాయి. కాదని చెప్పడానికి నువ్వెవరు అంటున్నాడు డాడీ.

శరత్: నీకేమీ చేతకాదు. నువ్వు దేనికీ పనికిరావని తెలిసినా కూడా మేనల్లుడివి అని ఒకే ఒక్క కారణంతో నేను ఇన్నాళ్లు భరిస్తున్నాను. నా కూతురు మెడలో తాళి కట్టినా నా కళ్ల ముందే ఉంటారని ఊరుకున్నాను. అయినా నువ్వు రెచ్చిపోయి నా ఇంట్లోనే తాగుతూ.. నా కూతురు మీదే చేయి చేసుకుంటావా.? ఇక నిన్ను క్షమించనురా..?

అంటూ చెర్రిని కొడుతుంటాడు. భూమి వద్దు నాన్నా అంటూ అడ్డు పడుతుంది. శరత్‌ చంద్ర కోపంగా భూమిని తిట్టి చెర్రికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. తర్వాత శివ తీసుకొచ్చిన బొమ్మ కోసం గగన్‌ ఇంటికి భూమి వెళ్తుంది. ఇంట్లో అంతా వెతుకుతుంది. గగన్‌ వాళ్లు తింటుంటారు. రత్న భూమిని చూస్తుంది.

రత్న: మేడం ఈ అమ్మాయి ఎవరు మేడం.. ఇల్లంతా వెతుకుతుంది.

 గగన్‌: ఆగు.. నీ సొంతింట్లో తిరిగినట్టు తెగ తిరిగేస్తున్నావు..

భూమి: బొమ్మ కోసం వెతుకుతున్నాను.. ఆ బొమ్మ ఎక్కడుంది. ఈ అబ్బాయి తీసుకొచ్చాడు కదా ఆ బొమ్మ కావాలి నాకు. అది నాకు చాలా ముఖ్యం..

భూమి బొమ్మ గురించి అడగ్గానే రత్న షాక్‌ అవుతుంది.

గగన్‌: బొమ్మ లేదు గిమ్మ లేదు ముందు మా ఇంట్లోంచి వెళ్లు.. వెళ్లిపో..

అంటూ గగన్‌ కోపంగా భూమి చేయి పట్టుకుని బయటకు లాగేస్తాడు. వచ్చి మళ్లీ భోజనం చేస్తుంటాడు. శారద, పూర్ణి బాధగా చూస్తుంటారు. ఇంతలో భూమి పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి గగన్‌ రూంలో ఉన్న బొమ్మను చూస్తుంది. బొమ్మను తీసుకుని హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!