Meghasandesam Serial Today Episode:  మీరా.. చెర్రి కోసం జ్యూస్‌ చేస్తుంది. అది చూసిన నక్షత్ర చూసి ఏదో ఒకటి చేయాలని డిసైడ్‌ అవుతుంది. వెంటనే కిచెన్‌ లోకి మీరా దగ్గరకు వెళ్తుంది.

నక్షత్ర: అత్తయ్యా ఏం చేస్తున్నారు..

మీరా: నక్షత్ర చెర్రి డిన్నర్‌ చేయడట.. వాటర్‌ మిలన్‌ జ్యూస్‌ తాగుతానంటే చేస్తన్నాను.

నక్షత్ర: నేను చేస్తాను కదా అత్తయ్య మీరు వెళ్లండి. మీ కోడలిని నేను ఉండగా మీరెందుకు కష్టపడుతున్నారు మీరు వెళ్లండి..

మీరా: నా బంగారు తల్లి. జ్యూస్‌ చేశాక కొంచెం ఐస్‌ కూడా వేసి ఇవ్వు..

నక్షత్ర: సరే అత్తయ్యా మీరు వెళ్లండి..

అని చెప్పగానే.. మీరా వెళ్లిపోతుంది. వెంటనే నక్షత్ర మిరపకాయలు తీసుకుని వాటిని కలిపి జ్యూస్‌ చేస్తుంది. ఆ జ్యూస్‌ తీసుకెళ్లి చెర్రికి ఇస్తుంది.

నక్షత్ర: బావ నీకోసమే జ్యూస్‌ చేశాను.. తీసుకో..

చెర్రి: నా కోసమా..? నేను నీకు చెప్పలేదు కదా ఎందుకు తీసుకొచ్చావు జ్యూస్‌..

నక్షత్ర: నువ్వు చెప్పలేదు కానీ అత్తయ్య జ్యూస్‌ చేస్తుంటే.. చూశాను. నీకోసమే అని చెబితే నేను చేస్తానని చెప్పి చేసి తీసుకొచ్చాను.. తాగు బావ..

చెర్రి: బావనా..? కొత్తగా ఉందేంటి పిలుపు.. అయినా మళ్లీ ఏదైనా ప్లాన్‌ చేశావా ఏంటి..?

నక్షత్ర: ఎప్పుడు ఏం ప్లాన్‌ చేస్తాను బావ తాగు

అంటూ బలవంతంగా ఇవ్వబోతుంటే.. చెర్రి జ్యూస్‌ వద్దని తోసేస్తాడు. ఇద్దరి మధ్య జ్యూస్‌ గ్లాస్‌ కింద పడిపోతుంది. దీంతో నక్షత్ర గట్టిగా అరుస్తుంది. అందరూ వస్తారు. తాను జ్యూస్‌ ఇస్తుంటే.. తాగడం లేదని కింద పడేశాడని చెప్తుంది. అందరూ చెర్రిని తిడతారు. నక్షత్ర నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. మరోవైపు భూమి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందున్న తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో పై నుంచి చూసిన గగన్‌ వెంటనే ఒక బకెట్‌ లో నీళ్లు తీసుకొచ్చి భూమి మీద పోసి లోపలికి వెళ్లిపోతాడు. నీళ్లు తన మీద పడగానే అటూ ఇటూ చూస్తుంది .ఎవ్వరూ కనిపించరు. పైకి చూస్తుంది. బకెట్‌ కనిపిస్తుంది. వెంటనే కోపంగా పైకి వెళ్లి గగన్‌ ను నిద్ర లేపుతుంది.

భూమి: హలో శ్రీవారు మీరు నిద్ర పోలేదని నాకు తెలుసు. లేవండి..

గగన్‌: ఆ లేచాను ఏంటి ఇప్పుడు..

భూమి: తులసి కోటకు దండం పెట్టుకుంటుంటే మీరు నన్ను ఇలా తడిపేయడం మీకు ఏమైనా న్యాయంగా ఉందా..?

గగన్‌: ఏయ్‌ ఎల్లు.. పొద్దున్నే న్యూసెన్స్‌.. నాకు నిద్ర వస్తుంది లేపావంటే.. బాగోదు.. చెప్తున్నాను..

అంటూ గగన్‌ కోపంగా తిట్టి.. దుప్పటి మూసుకుని నిద్ర పోతుంది.. భూమి కోపంగా కిందకు వెళ్తుంది. శారదను పిలుస్తుంది. శారద దగ్గరకు వస్తుంది.

శారద: ఏంటి అంతా ఇలా తడిసిపోయావు.. ఏమైంది.. బయట వర్షం వస్తుందా..? 

భూమి: బయట వర్షం రావడం కాదు అత్తయ్యా మీ అబ్బాయి చేసిన నిర్వాకం ఇది..

శారద: గగన్‌ ఏం చేశాడు వాన కురిపించాడా..?

భూమి: అత్తయ్యా నేను చెప్పేది వినండి.. నేను బయట తులిసికోట దగ్గర పూజ  చేస్తుంటే.. మీ అబ్బాయి పై నుంచి నీళ్లు పోసేశారు.

శారద: అవునా..? అయ్యో రాను రాను వాడి  ఉక్రోషం పెరిగిపోతుంది. వాడి ఉక్రోషాన్ని.. కోపాన్ని నువ్వే అదుపులో పెట్టాలి. నువ్వే వాడికి దగ్గర కావాలి.

అంటూ శారద సర్ది చెప్పడంతో అయితే చెప్తా బావ సంగతి అనుకుంటూ భూమి పైకి వెళ్తుంది. శారద, పూర్ణి నవ్వుతూ చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!