Meghasandesam Serial Today Episode: దసరా ఉత్సవాలకు గుడి దగ్గరకు వెళ్తారు గగన్‌, శారద, భూమి. అక్కడికి శరత్ చంద్ర ఫ్యామిలీతో వస్తాడు. అంతా హడావిడిగా ఉంటుంది. ఇంతలో భూమి, శారదతో తన పెళ్లి గురించి మాట్లాడుతుంది.

Continues below advertisement

భూమి: అత్తయ్యా ఇక్కడ నా మెడలో తాళి వేయడానికి మీ అబ్బాయిని ఒప్పిస్తానన్నారు. ఎలా ఒప్పిస్తారు.. మీరు చెబితే ఆయన ఒప్పుకుంటారా..? ఒకవేళ తాళి కట్టను అంటే..?

శారద: నేను ఒప్పిస్తాను భూమి.. నువ్వు ప్రశాంతంగా ఉండు ఆ ఆలోచనలు ఏవీ లేకుండా హాయిగా దేవుడిని మొక్కుకో.. ఈ విషయాలు ఏవీ నువ్వు పట్టించుకోకు

Continues below advertisement

అని చెప్తుంది. ఇంతలో పంతులు పిలవగానే అందరూ పూజ దగ్గరకు వెళ్లిపోతారు. అక్కడికి అపూర్వ, శరత్‌ చంద్ర, నక్షత్ర కూడా వస్తారు. వాళ్లు కూడా అదే పూజలో పాల్గొంటారు. ఇంతలో పంతులు అందరినీ పిలిచి జంటలు ఒక్కోక్కరిగా వెళ్లి ఆక్కడ అమ్మ వారి ముందు ఉన్న దీపాలు వెలిగించండి అని చెప్తాడు. అప్పుడు గగన్‌ ఒక్కడే వెళ్లబోతుంటే.. శారద వచ్చి గగన్‌ ను ఆపేస్తుంది.

శారద: నాన్న గగన్‌ నువ్వు పెళ్లైన వాడివి ఒక్కడివే వెళ్లకూడదు..

గగన్‌: అమ్మా ఏం మాట్లాడుతున్నావు..

శారద: అవును నాన్న.. ఇక్కడ కూడా నువ్వు ఇలా మొండిగా ప్రవర్తించొద్దు..  

గగన్‌: అమ్మా నేను తాళి కట్టకుండానే కట్టానని నాటకాలు ఆడుతుంది. పెద్ద యాక్టర్‌ అమ్మ తను తన మాటలు ఎలా నమ్ముతావు నువ్వు..

శారద: నాన్న గగన్‌ ఏ ఆడపిల్ల తనకు తానే మెడలో తాళి వేసుకుని నాటకాలు ఆడదు నాన్న.. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇప్పుడు నువ్వు వెళ్లి అమ్మ వారి సాక్షిగా భూమి మెడలో తాళి కట్టు నాన్న..

గగన్‌: సరే అమ్మా నీ కోసం తాళి కడతాను..

అంటూ గగన్‌, భూమి మెడలో తాళి కట్టడానికి తాళి తీసుకుని వెళ్తుంటే.. నక్షత్ర కోపంతో రగిలిపోతుంది. ఇరిటేటింగ్‌ అపూర్వను తిడుతుంది.

నక్షత్ర: అమ్మా బావ దాని మెడలో మళ్లీ తాళి కట్టబోతున్నారు. నువ్వే ఎలాగైనా ఆపమ్మా..?

అపూర్వ: నక్షత్ర ఇక్కడ అల్లరి చేయకూడదు.. అందరూ ఉన్నారు.. మన ఫ్యామిలీ పరువు పోతుంది.

నక్షత్ర: అది బహిరంగంగా బావతో తాళి కట్టించుకుంటుంటే పరువు పోదా మమ్మీ.. అయినా నాకు బావ కావాలని చెప్పాను. నువ్వే ఎలాగైనా బావతో నా పెళ్లి కూడా చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు అది పెళ్లి చేసుకుంటుంటే ప్రేక్షకులుగా చూస్తున్నాము.. నువ్వే ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపు మమ్మీ..

అపూర్వ: చూడు నక్షత్ర ఇక్కడ  బరి తెగించి అది తాళి కట్టించుకుంటే మీ డాడీ కి అది మరింత దూరం అవుతుంది. ఆ విషయం ఆలోచించు.. తర్వాత ఎలాగైనా గగన్‌  గాడిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు ముందు మనం ఆ భూమిని మీ నాన్నకు దూరం చేయాలి. అంటే ఇప్పుడు ఆ పెళ్లి జరగాలి. అప్పుడే అది శాశ్వతంగా మీ నాన్నకు దూరం అయిపోతుంది.

నక్షత్ర: మమ్మీ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు మమ్మీ.. అక్కడ పెళ్లి అయిపోతుంది మమ్మీ

అంటూ నక్షత్ర ఏడుస్తుంది. గగన్‌ తాళి తీసుకుని వెళ్లి భూమి మెడలో కడతాడు. భూమి, శారద హ్యాపీగా ఫీలవుతారు. నక్షత్ర ఇరిటేటింగ్‌ గా చూస్తుంది. అపూర్వ, శరత్‌ చంద్ర కోపంగా చూస్తుంటారు. అక్కడికి వచ్చి భక్తులు అక్షింతలు వేసి భూమి, గగన్‌ లను ఆశీర్వదిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!