Meghasandesam Serial Today Episode: శారద డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. గగన్ కారులో తీసుకొస్తాడు. గుమ్మం ముందు నిలబడగానే.. ఇందు వచ్చి అన్నయ్య పెద్దమ్మ పెద్ద గండం నుంచి బయట పడి క్షేమంగా ఇంటికి వచ్చింది కదా దిష్టి తీసి ఇంట్లోకి అడుగుపెటించడం మంచిది ఒక్క నిమిషం అన్నయ్యా నేను వెళ్లి దిష్టి తీసుకొస్తాను అంటుంది.
భూమి: అవసరం లేదు..
అంటూ గుమ్మడి కాయతో దిష్టి తీయడానికి వస్తుంది.
భూమి: ఈ ఇంటి కోడలిని నేను ఉన్నాను కదా ఇందు నేను తీస్తాను
ఇందు: అంతకంటేనా వదినా తప్పకుండా నువ్వే తీయ్..
గగన్: ఏం అవసరం లేదు. క్షేమంగా వచ్చిన మా అమ్మకు దిష్టి బొమ్మ దిష్టి తీయడం నాకు ఇష్టం లేదు.
శారద: ఏట్రా అంత మాట అనేశావు.. నా కొడలు ఎంత అందంగా ఉంది చూడు బంగారపు బొమ్మరా..
గగన్: అమ్మా నీకేం తెలియదు అమ్మ ఈ మధ్యన దిష్టి బొమ్మలు ఇలాగే ఉంటున్నాయి.
ఇందు: ఇది మరీ టూ మచ్ అన్నయ్య..
గగన్: మీరు అందరూ కలిసి సపోర్టు చేయకండి అసలే తిక్కది. ఆ మాత్రం సపోర్టు దొరికితే తల పైకెక్కి కూర్చుంటుంది. మా అమ్మకు నేనే దిష్టి తీస్తాను ఇలా ఇవ్వు..
భూమి: ఈ ఇంటి కోడలిగా అత్తయ్యకు నేనే దిష్టి తీయాలి. ఆ మాట కొస్తే నీకు కూడా నేనే తీయాలి.
అంటూ ఇద్దరూ ఒకరి మీద ఒకరు నేను తీస్తాను అంటే నేను తీస్తాను అంటూ గొడవ పడుతుంటారు.
ఇందు: అన్నయ్యా మీరిద్దరూ చిన్న పిల్లల్లా గొడవ పడింది చాలు. ఇక్కడ పెద్దమ్మ నీరసంతో బాధపడుతుంది. మీరు ఒక్కొరుగా కాకుండా ఇద్దరూ కలిసి దిష్టి తీయండి
శారద: ఈ మాటేదో బాగుందిరా ఆ పని చేయండి..
అని చెప్పగానే.. గగన్, భూమి ఇద్దరూ కలిసి దిష్టి తీస్తారు.
భూమి: ఇది తీసుకెళ్లి బయట కొట్టేసి రండి.. అత్తయ్యా మీరు రండి
అంటూ శారదను ఇంట్లోకి తీసుకెళ్తారు. శారద బెడ్‌రూంలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత భూమి గగన్‌ను మల్లెపూలు తీసుకురమ్మని అడుగుతుంది. గగన్ కోపంగా బయటకు వెళ్లిపోతాడు. తర్వాత ఇంటికి వచ్చిన గగన్ భూమిని పిలిచి మల్లెపూలు ఇవ్వడంతో భూమి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. పూలు తీసుకుని పైకి వెళ్తున్న గగన్‌ను ఆపేస్తుంది.
భూమి: తేవనుకున్న నీవు మల్లెపూలు తెచ్చావంటే కలలా అనిపిస్తుంది. అసలు ఇది కలా నిజమా అర్థం కావడం లేదు బావ. ఇంత ప్రేమగా నాకోసం మల్లెపూలు తీసుకొచ్చావు కదా తెచ్చిన అదే చేతితో నా తలలో పెట్టొచ్చు కదా బావ
అని భూమి అడగ్గానే.. గగన్ మల్లెపూలు తీసుకుని భూమి తలలో పెడతానంటాడు. ఇంతలో భూమి అద్దం తీసుకుని చూసుకుంటూ గగన్ ముందు నిలబడుతుంది. గగన్ పూలు పెట్టి కత్తెర తీసుకుంటాడు. అద్దంలో కత్తెర చూస్తుంది భూమి.
భూమి: కత్తెర ఎందుకు బావ.. పూలు ఏమైనా కట్ చేస్తావా..?
గగన్: పూలు కట్ చేయడం ఏంటి..? ఇకపై పెట్టుకోవడానికి నీకు తీసుకురావాల్సిన శ్రమ నాకు లేకుండా నీ జడను కట్ చేస్తున్నా..
భూమి: ఆ బావ ఏంటిది..?
గగన్: ఈరోజు నీ జడ కట్ చేస్తాను.
అంటూ గగన్ జడను కట్ చేయబోతుంటే.. వద్దు బావ ఫ్లీజ్ అంటూ భూమి తప్పించుకుని వెళ్లిపోతుంది. గగన్ వెనకాలే పడతాడు. దీంతో భూమి వద్ద బావ అంటూ దొరక్కుండా పారిపోతుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!