Meghasandesam Serial Today Episode: గుడిలో ఉన్న శారదను చూసిన అపూర్వ కోపంగా ఇంటికి వచ్చి అందరి ముందు శారదను తిడుతుంది. మొగుడు చనిపోయినా ఇంకా పసుపుకుంకుమ పెట్టుకుని తిరుగుతుందని అంటుంది. సుజాత కూడా శారదను తిడుతుంది.

Continues below advertisement


అత్తయ్య: గోరింటాకు మాటలు మర్యాదగా రాని..


మీరా: తను నీతో అరిచి ప్రయోజనం ఏముంది అత్తయ్యా అయినా ఆవిడ అన్నదాంట్లో తప్పేముంది. ఆయన బతికి ఉన్నప్పుడు నా మొగుడు నా మొగుడు అని చెప్పుకుని తిరిగింది కదా..? అయన కోసం ఆ మాత్రం చేయలేదా..? అయినా తననెందుకు అనడం. నా మొగుడిని అనాలి. కాపురం ఇక్కడ చేస్తూ.. ఎప్పుడు అక్కడి వాళ్ల గురించే కలవరించేవాడు.. మీ నాన్నకు తగిన శాస్తే జరిగింది.


చెర్రి: అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా ఇప్పుడు లేని నాన్న గురించి ఎవరైనా అలా మాట్లాడతారా…


మీరా: ఇలాగే మాట్లాడతాను చెర్రి. మీ నాన్న చేసిన పనులు అలాంటివి.


అత్తయ్య: ఏం చేశాడమ్మా నా కొడుకు మొదట నిన్ను చేసుకుని తనని చేసుకున్నాడా…? లేక తనను చేసుకుని నిన్ను చేసుకున్నాడా..? తనని చేసుకున్నాకే కదా నిన్ను చేసుకున్నాడు. ఆ విషయంలో శారదకు అన్యాయం జరిగింది. నిన్ను చేసుకున్నాకే శారదకు దూరంగా ఉన్నాడు. నీకు దూరంగా ఉండలేదు కదా..?


అపూర్వ: మొగుడ పోయిన బాధ కూడా లేకుండా సింగారించుకుని తిరుగుతున్న ఆ శారదను నిందించడం తప్పా అండి..? అసలు మొగుడు చస్తే శారద లాంటి పెళ్లాం ఇలా ఊరేగుతుందని ఏ అత్తయ్య అయినా ఇలా ఊరుకుంటుందా..? ఊరుకుంది కాక నా మీద అబాండాలు వేస్తారా..? చచ్చిన కొడుకు మీద మీకు ప్రేమ లేనప్పుడు సంప్రదాయాల మీద మీకు గౌరవం లేనప్పుడు నా ఆడపడుచు మాత్రం ఎందుకు సంప్రదాయాలు పాటించాలి


అంటూ అపూర్వ వెళ్లి కుంకుమ తీసుకొచ్చి మీరాకు పెట్టబోతుంటే.. అత్తయ్య ఆపేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.


చెర్రి: అత్తయ్యా ఇంకొక మాట ఇంకొక మాట మాట్లాడినా బాగోదు..


అపూర్వ: అరేరే ఆ అమ్మ అంటే నీకెందుకురా అంత ప్రేమ. ఆ అమ్మ మీద ఉన్న ప్రేమలో కొంచెం అయినా ఈ అమ్మ మీద ఎందుకు లేదురా..? ఏం మత్తు మందు చల్లిందిరా..?


అత్తయ్య: శారద అలాంటిది కాదు. ఒకవేళ అలాంటి పని చేస్తుందటే.. నేను చూస్తూ ఊరుకోనమ్మా..? ఒకవేళ తను అలాంటి పని చేస్తే నేను ఊరుకోను


అంటూ తిడుతూ అత్తయ్య వెంటనే శారద ఇంటికి వెళ్తుంది. అక్కడ శారద బొట్టు, గాజులతో ఉండటం చూసి ఇలా ఉండటం మంచిది కాదమ్మా అంటూ చెప్పి కొంత మంది ఆడవాళ్లను తీసుకొచ్చి శారదను ముండమోపిని చేయబోతుంది. ఇంతలో గగన్‌ వచ్చి ఆపేస్తాడు.


అత్తయ్య: పసుపు కుంకాలు తీసే సంప్రదాయాని అడ్డుకునే హక్కు నీకు లేదు..


గగన్‌: పెళ్లాన్ని పిల్లలను వదలకూడదురా..? అది సంప్రదాయం కాదని నోరు మెదపి చెప్పలేకపోయిన నువ్వు ఈరోజు హక్కుల గురించి మాట్లాడుతున్నావా…?


అంటూ తిట్టి శారదను ఇంట్లోకి తీసుకెళ్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన భూమి, గగన్‌ను చూసి సంతోషంతో హగ్ చేసుకుని కిస్‌ చేసి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!