Meghasandesam Serial Today Episode: శారద మీద అటాక్‌ చేసిన తర్వాత రత్న, రౌడీ అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లిపోతారు. అండర్‌ గ్రౌండ్ లో ఉన్న ఇద్దరూ మేక పులి ఆట ఆడుతూ మందు తాగుతూ ఉంటారు.

రౌడీ: ఇంకా ఎంత కాలం మనం మేక పులి ఆడుకుంటూ ఆజ్ఞాతవాసం చేయాలి.

రత్న: అపూర్వ మేడం ఆర్డర్‌ ఇచ్చేంత వరకు మనకు తప్పదు.. ( మందు తాగుతుంది.) ఇంత లైట్‌గా ఉందేంటి..?

రౌడీ: నేను లైట్‌ గానే తాగుతాను..

రత్న: నాకు అర్థం అయింది నువ్వ లైటే అని ( రౌడీ కోపంగా చూస్తుంటాడు) ఏంటి అలా చూస్తున్నావు.. నువ్వు అంత స్ట్రాంగ్‌ అయి ఉంటే ఆ బుల్లెట్‌ డైరెక్టుగా శారద గుండెల్లోకి దూసుకుపోయేది. ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని మేక పులి ఆడేవాళ్లం కాదు. అదే నన్ను చూడు చచ్చే విషయం వాడికి కూడా తెలియకుండా చంపాను.. అది నా పవర్‌.. నీకు నాకు ఉన్న తేడా..

రౌడీ: చచ్చింది నీ మేక

రత్న: నువ్వు ఆ మేకలను చంపడం తప్పా సింహాలను చంపడం చేతకాదు కదా..?

రౌడీ: ఏయ్‌ ఎక్కువగా మాట్లాడకు.. అది జస్ట్‌ లో మిస్‌ అయిందంతే.. ఒక్కసారి మిస్‌ అయినంత మాత్రాన మళ్లీ మిస్‌ అవుతుందని కాదు. ఈసారి దాన్ని చంపితే బాడీలో పీస్‌ కూడా దొరకదు..

రత్న: లేదు చేయ్యలేదు.. మేడం ఆర్డర్స్‌ కోసం నేను వెయిట్‌ చేస్తున్నాను. 

రౌడీ: అప్పటి వరకు మనం ఇక్కడ కామ్‌ గా ఉండాలి..?

రత్న: చేస్తుంది అదే కదా ముందు ఆడు..

అంటూ మందు తాగుతుంది. తర్వాత ఇంటికి వెల్లి శరత్‌ చద్రకు కెమెరా ఇస్తుంది భూమి. అందులో వీడియో ప్లే కాదు. దీంతో శరత్ చంద్ర భూమిని తిట్టి పంపిస్తాడు. బాధతో వెనక్కి తిరిగిన భూమి కెమెరా బాగు చేయించడానికి రోడ్డు మీద వెళ్తుంది. మరోవైపు ఆవు పులి అట ఆడుతున్న రత్న, రౌడీకి గొడవ జరుగుతుంది. దీంతో రౌడీ రత్నను చంపేదుకు ప్రయత్నిస్తాడు. రత్న తప్పించుకుని రోడ్డు మీద పరుగెడుతుంది. అక్కడే ఒక ఆటో దగ్గర నిలబడి కెమెరా బాగు చేసే షాపు గురించి అడుగుతున్న భూమి దగ్గరకు రత్న వెళ్లి భూమి చాటుగా దాక్కుంటుంది. భూమిని చూసిన రౌడీ పక్కకు ఎస్కేప్‌ అవుతాడు.

రత్న: మేడం కాపాడండి మేడం..  ఆ వెధవ నన్ను చంపేయబోతున్నాడు.. కాపాడండి మేడం..

భూమి: ఎయ్‌ ఎవరు నువ్వు..

రత్న: నన్ను రక్షించండి మేడం..

భూమి: అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు..

రత్న: హమ్మయ్యా.. వెళ్లిపోయాడా..?

భూమి: అసలు నువ్వు ఎవరు…

అంటూ భూమి తిరిగి చూడగానే రత్న షాక్‌ అవుతుంది. భూమి షాక్‌ అవుతుంది. వెంటనే రత్న, భూమిని తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. భూమి, రత్నను పట్టుకోవడానిక వెనకాలే పరుగెడుతుంది.

భూమి: ఏయ్‌ ఆగవే..

రత్న: పోయి పోయి మళ్లీ దీని కంట్లోనే పడ్డానా..?

అనుకుంటూ పరుగెడుతూనే ఉంటుంది. భూమి పరుగెడుతుంది. అక్కడే ఏసీపీ కారు ఆపుకుని ఫోన్‌ మాట్లాడతుంటాడు. భూమిని చూసి ఆపేస్తాడు.  

ఎసీపీ: భూమి గారు ఎంటలా పరుగెడుతున్నారు..?

భూమి: మా అత్తయ్య మీద అటాక్‌ చేసింది. మీ అన్నయ్య గారి మర్డర్‌ కు తనకు ఏదో లింక్‌ ఉందని  అనుమానంగా ఉంది.

ఏసీపీ: అయితే ఇంకా నిలబడే ఉన్నారేంటండి కారు ఎక్కండి పట్టకుందాం..

అని ఏసీపీ చెప్పగానే.. భూమి కారు ఎక్కుతుంది. ఇద్దరూ కలిసి వెళ్లి రత్నను పట్టుకుంటారు. అయినా తప్పించుకుని పారిపోవాలని చూస్తుంది రత్న. దీంతో ఏసీపీ గన్‌ తీసి బెదిరించగానే ఆగిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!