Meghasandesam Serial Today Episode:   పెళ్లి మంటపానికి వెళ్లాక కృష్ణప్రసాద్‌ కంగారుగా భూమి కోసం వెతుకుతుంటాడు. ఇంతలో భూమి పరుగెత్తుకొచ్చి శరత్ చంద్ర వాళ్లను లోపలికి తీసుకెళ్తుంది. అందరూ లోపలికి వెళ్తుంటే.. చెర్రి భూమిని మాత్రమే చూస్తుంటాడు. ప్రసాద్‌.. భూమితో పర్సనల్‌ గా మాట్లాడాలని ట్రై చేస్తుంటాడు. చెర్రి ప్లవర్‌ తీసుకుని వెళ్లి భూమికి ఇవ్వబోతుంటే ప్రసాద్‌ వచ్చి భూమిని పక్కకు తీసుకెళ్తాడు.


చెర్రి: అయ్యో నా లవ్‌ ను ప్రపోజ్‌ చేద్దామనుకుంటే మా నాన్న తీసుకెళ్లిపోతున్నాడు. రాక రాక వచ్చిన ధైర్యాన్ని నాశనం చేశావు కదా నాన్నా..


భూమి: ఏమైంది మామయ్యా..


ప్రసాద్‌: కాలం నిజాన్ని దాచి అర్హత లేని వాళ్లను అందలం ఎక్కించి మన కళ్ల ముందే కూర్చోబెడుతుంది అమ్మా.. మీ అమ్మను నీకు దూరం చేసిన ఆ మనిషి ఎవరో తెలిసింది. అపూర్వ.. శోభా దగ్గర డ్రైవర్‌ గా పనిచేసిన వాడు. చాలా కాలం తర్వాత ఇవాళ నాకు కనిపించాడు అమ్మా. నాగుతో నాటకం ఆడించి నన్ను నమ్మించి నాతోనే ఫ్యాక్టరీ తగులబెట్టించింది. మీ అమ్మ చావుకు కారణం ఆ అపూర్వ. నిజం తెలిసి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను అమ్మా..


భూమి: నేను చేస్తాను మామయ్యా..! చిన్న నిప్పురవ్వ మీద పడితేనే విలవిలలాడిపోతామే.. అలాంటిది అమ్మ బతికి ఉండగానే కాల్చేసింది ఆ అపూర్వ. అమ్మ ఎంత నరకం అనుభవించి ఉంటుంది. వదలను మామయ్యా ఆ అపూర్వను వదలను.  ఆ అపూర్వ అసలు రంగు బయటపెడతాను.


 అంటూ ఆవేశంగా వెళ్లిపోతుంది భూమి.. మరోవైపు ఫోన్‌ లో వీడియో చూస్తూ కూర్చుంటాడు చెర్రి. రాముడి లాంటి మా అన్నయ్యను ఈ పెళ్లికి పిలిచి ఉంటే రామలక్ష్మణుల్లా ఉన్నారని ఫీలవుతుంటాడు. గగన్‌కు ఫోన్‌ చేసి ఈ పెళ్లికి నువ్వు వచ్చి ఉంటే ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్లం అంటాడు. చెర్రిని తిట్టి గగన్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు.  మరోవైపు పెళ్లికి వస్తున్న  నర్స్‌ ను చూసి అపూర్వ కోపంగా ఎదురెళ్లి బయటకు తీసుకెళ్తుంది.


అపూర్వ: ఏయ్‌ ఎందుకు వచ్చావు..


నర్స్‌: ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ఉంటే వచ్చే దాన్ని కాదు మేడం. మీరు చేయలేదు కాబట్టే నేను రావాల్సి వచ్చింది.


అపూర్వ: ఫోన్‌ చేశావా..?


నర్స్‌: నా పాలిట కామధేనువు లాంటి మీకు అబద్దం చెప్తానా..?


అపూర్వ: కనబడటం లేదా? పెళ్లి పనుల్లో ఉన్నాం. నీ ఫోన్‌ నేను చూడలేదు. అయినా నువ్వు ఫోన్‌ చేశావని నాకు ఎలా తెలుసు.


నర్స్‌: అదేంటి మేడం నా నెంబర్‌ తెలుసుగా..?


అపూర్వ: నీ నెంబర్‌ నాతో లేదు.


నర్స్‌: అదేంటి మేడం మరీ ఇలా అయితే అవసరాలు ఉంటాయిగా.. అప్పుడప్పుడు ఫోన్‌ చేస్తానని మీకు చెప్పాను కదా…?


అపూర్వ: ఏంటే ఏంటే అవసరాలు..


 అంటూ అపూర్వ తిడుతుంటే.. నర్స్‌ నా అవసరం చాలా పెద్దది అంటుంది. దీంతో అతిగా ఆశ పడితే ప్రాణాలు పోతాయి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది అపూర్వ. దీంతో అపూర్వను బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది నర్స్‌. నర్స్‌ మాటలకు భయపడిన అపూర్వ తన ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇచ్చి పంపిచేస్తుంది. అంతా గమనించిన భూమి కోపంగా అపూర్వ దగ్గరకు వచ్చి ఇది నీ అసలు రూపం అంటూ తిడుతుంది. శోభాచంద్ర చావుకు కారణం నువ్వే అంటూ తిడుతుంది. దీంతో అపూర్వ భయపడుతుంది. తర్వాత గట్టిగా నవ్వుతూ.. తెలిసిపోయిందా? అంటూ అవును మీ అమ్మను చంపింది నేనే.. నాది అనుకున్న నా స్థానానికి మీ అడ్డుగా ఉంది. అందుకే  మీ అమ్మను చంపేసాను అంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!