Meghasandesam Serial Today Episode: కేపీని కాల్చిన విషయంలో శరత్‌చంద్రను, అపూర్వను తప్పించాలని చూస్తాడు ఏసీపీ సూర్య. అందుకోసం అసలు కేపీ చనిపోయాడన్న విషయమే మీకు తెలియనట్టు ఉండండి అని చెప్తాడు. మీ గన్‌ దాచిపెట్టండని.. ఆ బాడీలోని బుల్లెట్‌ గురించి మీరు మర్చిపోండని చెప్తాడు. అసలు మీరు ఆ టైంలో ఏదో బిజినెస్‌ మీటింగ్‌లో ఉన్నారని అనుకోండి అని చెప్తాడు.

Continues below advertisement

శరత్‌: చట్ట ప్రకారం కాకుండా మీ మంచితనంతో మమ్మల్ని దీంట్లోంచి పడేస్తున్నారు ఎస్పీ గారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు.

సూర్య: అయ్యో మీలాంటి పెద్ద వాళ్ల చేతులు.. మాలాంటి పిల్లలను ఆశీర్వదించడానికి ఉపయోగించాలి కానీ ఇలా దండం పెట్టకూడదండి.

Continues below advertisement

శరత్‌: థాంక్యూ థాంక్యూ సో మచ్‌ ఎస్పీ గారు..

సూర్య: ఇట్స్‌ ఓకే మీరు వెళ్లండి.. నేను చూసుకుంటాను.

అని సూర్య చెప్పగానే.. శరత్‌ చంద్రను తీసుకుని అపూర్ వెళ్లిపోతుంది. మరోవైపు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కేపీని అక్కడే పని చేస్తున్న కూలీలు చూసి ఆటోలో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. హాస్పిటల్‌లో డాక్టర్లు కేపీకి జాయిన్‌ చేసుకుని ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేస్తారు. ఇక మరోవైపు శారద ఏడుస్తూ.. గగన్‌ ను కూడా కేపీని చూడటానికి రమ్మని.. పెద్ద కొడుకుగా నువ్వే తలకొరివి పెట్టాలని అడగ్గానే.. గగన్‌  తాను రానని చెప్తాడు. శారద వెళ్తే వెళ్లోచ్చని అంటాడు. దీంతో శారద, భూమి ఇద్దరూ కలిసి శరత్‌ చంద్ర ఇంటికి వెళ్తారు. కేపీ శవాన్ని చూసిన శారద బోరున  ఏడుస్తుంది. పక్కనే కూర్చుని కాళ్లు పట్టకుని ఏడుస్తూ ఉంటుంది.  శవం ముందు కూర్చుని ఏడుస్తున్న శారద హఠాత్తుగా లేచి బయటకు వెళ్తుంది. భూమిని పిలిచి ఏడుస్తూనే..

శారద: అమ్మా భూమి ఆక్కడ ఉన్నది మీ మామయ్య శవం కాదమ్మా.. అది ఎవరిదో శవం..

భూమి: ఏంటత్తయ్యా మీరు అనేది.. మామయ్య శవం కాకపోవడం ఏంటి..?

శారద: అవునమ్మా భూమి అది మాత్రం మీ మామయ్య డెడ్‌ బాడీ కాదు..

భూమి: అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు అత్తయ్యా..

శారద: అవునమ్మా భూమి.. మీ మామయ్య ఎడమ అరికాలు మీద పుట్టమచ్చ ఉంటుంది. నాకు బాగా తెలుసు. అక్కడున్న శవానికి అసలు పుట్టుమచ్చే లేదు..  ఇందాక నేను అక్కడ కూర్చుని ఏడుస్తున్నప్పుడు గమనించాను.. ఆ శవం పాదాలకు పుట్టుమచ్చ లేదమ్మా అందుకే చెప్తున్నాను.. అది మీ మామయ్య శవం కాదమ్మా.. ఇక్కడున్నది మీ మామయ్య శవం కాదంటే.. మీ మామయ్య ఎక్కడో ఒక దగ్గర బతికే ఉన్నారు..? నాకు నమ్మకం ఉంది. తను చనిపోలేదు.

భూమి: అత్తయ్యా మీరు చెప్పేది నిజమా..? అయినా ఇప్పుడెలా వాళ్లకు ఈ విషయం చెప్పాలి. మామయ్య బతికే ఉన్నరంటేనే చాలా ఆనందంగా ఉంది అత్తయ్యా.. నేను వెళ్లి నాన్న వాళ్లకు చెప్పొస్తాను..  

అంటూ భూమి ఇంట్లోకి శరత్‌ చంద్ర దగ్గరకు వెళ్తుంది. శారద ఏడుపు ఆపేసి కంగారు పడుతుంది. కేపీ ఎక్కడ ఉండొచ్చని ఆలోచిస్తుంది. మరోవైపు కేపీని కూలీలు ఆటోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో అక్కడ డాక్టర్లు కేపీకి ఆపరేషన్‌ చేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!