Meghasandesam Serial Today Episode: తమ పెళ్లి ఫోటోలు ప్రేమ్‌ కట్టించి హాల్లో గోడకు తగిలిస్తుంది భూమి. అప్పుడే పై నుంచి వచ్చిన గగన్‌ ఆ ఫోటోలు చూసి షాక్‌ అవుతాడు. కోపంగా ఎవరు తగిలించారు ఇక్కడ.. అనుకంటూ గట్టిగా శారద వాళ్లను పిలుస్తాడు. శారద, పూర్ణి, శివ వస్తారు.

Continues below advertisement

గగన్‌: అమ్మా ఏంటిది ఎవరు పెట్టించారు ఇక్కడ.. అసలు ఇది ఇల్లనుకున్నారా..? ఫోటో ఎగ్జిబిషన్‌ అనుకున్నారా..? అయినా ఈ ఫోటోలు ఎలా వచ్చాయి ఇక్కడికి

శారద: నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నాన్న.. అసలు ఏం జరిగింది.

Continues below advertisement

గగన్‌: అమ్మా ఆ గోడకు చూడమ్మా.. ఫోటోలు ఆ ఫోటోల గురించే నేను చెప్పేది

అని గగన్‌ చెప్పగానే.. శారద ఫోటోలు చూస్తుంది. షాక్‌ అవుతుంది.

శారద: అవును ఈ ఫోటోలు ఇక్కడకు ఎలా వచ్చాయి. అసలు మేమంతా ఇంట్లోనే ఉన్నాం ఇంతలో ఈ ఫోటోలు ఇక్కడ ఎవరు పెట్టారు..? ఈ ఫోటోలు ఇక్కడ ఎవరు పెట్టారో నిజంగా నాకు తెలియదు నాన్న..

గగన్‌: అమ్మా నీకు తెలియకుండా ఇంట్లో ఫోటోలు ఎవరు పెడతారమ్మా..? ఏయ్‌ పూర్ణి నువ్వైనా చెప్పు.. ఎవరు పెట్టారు. ఏయ్‌ శివ చెప్పు ఎవరు పెట్టారు.. చెప్పండి.. అసలు ఎవరు పెట్టారు… ముందు ఈ ఫోటోలను తీసిపారేయాలి.

అంటూ గగన్‌ కోపంగా ఊగిపోతుంటే.. చాలా కూల్‌గా భూమి పైనుంచి వస్తుంది.

భూమి: బావ ఆగు.. ఎందుకు అంత ఆవేశపడతావు.. ఆ ఫోటోలు నేనే అక్కడ పెట్టించాను.. తీసేయెద్దు బావ ఉండని..

అనుకుంటూ భూమి కిందకు వస్తుంది. భూమిని చూసిన గగన్‌ కోపంతో ఊగిపోతుంటాడు. దగ్గరకు రాగానే కొట్టేంత  పని చేస్తాడు. భూమి మాత్రం నవ్వుతూనే ఉంటుంది.

గగన్‌: ఏయ్‌ తైతక్క ఎందుకు పెట్టించావు.. ఎలా పెట్టించావు.. ఎప్పుడు మనిద్దరం ఇలా పెళ్లి బట్టలు కట్టుకని అలా బాసికాలు కట్టుకుని.. నుదుటిన బొట్టు పెట్టుకుని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాం.. ఎప్పుడు ఈ ఫోటోకు అంత కూల్‌గా ఫోజులిచ్చాం.. చెప్పు.. . అసలు ఇదంతా ఎందుకు చేయించావు.. అంతా గ్రాఫిక్స్‌ ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి షో చేయాలనుకుంటున్నావా..? చెప్పు ఎందుకు పెట్టావు.. అసలు..

భూమి: కూల్‌ కూల్ బావ ఎందుకు అంత ఆవేశపడతావు.. మనిద్దరం కలిసి దిగిన ఫోటోనే అది.. అప్పుడే మర్చిపోయావా బావ.. అయినా నీకు ఈ మధ్య ఆవేశం పెరిగిపోతుంది. తీపి జ్ఞాపకాలు మర్చిపోతున్నావు బావ..

గగన్‌: ఏయ్‌ ఎక్కువ మాట్లాడకు.. అసలు మనిద్దరం ఎప్పుడు ఇలా ఫోటో దిగామో చెప్పు ముందు.. నీ తైతక్క వేషాలు నా ముందు వేయోద్దు..

భూమి: ఆగు బావ ఎందుకు కరుస్తావు.. మొన్న మన ఆగిపోయిన పెళ్లిలో ఇలా కొత్త బట్టలు కట్టుకుని బాసింగాలు కట్టుకుని బొట్టు పెట్టుకున్నాము కదా బావ. అప్పుడు దిగిందే ఈ ఫోటో.. అప్పుడే మర్చిపోతే ఎలా చెప్పు బావ.

గగన్‌: ఆగిపోయిన పెళ్లిలో దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంట్లో పెట్టాల్సిన అవసరం లేదు.. ముందు అవి తీసి బయట పడేయ్‌  

భూమి: ఆహా నేను తీయను బావ.. నేను ఎంతో ఇష్టంగా ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్న ఫోటోలు అవి.. నా చేతులతో నేను మళ్లీ తీసేయలేను..

అంటూ భూమి చెప్పగానే.. గగన్‌ కోపంగా ఫోటోలు తీసేయడానికి గోడ దగ్గరకు వెళ్తాడు. భూమి బావ వద్దు అంటుంది. ఇంతలో గగన్‌ ఫోటోలు తీసి కింద పడేస్తాడు. అవి పగిలిపోవు.. దీంతో భూమి నువ్విలా ఏదో ఒకటి చేస్తావని ఆ ఫోటోలకు అద్దం వేయించలేదు.. కేవలం లామినేషన్‌ మాత్రమే చేయించాను అని చెప్తుంది. గగన్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటాడు. శారద, పూర్ణి, శివ నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!