Meghasandesam Serial Today Episode: మర్డర్‌ కేసులో కోర్టుకు వెళ్లిన కేపీకి భూమి అపాయింట్‌ చేసిన లాయరే షాక్‌ ఇస్తాడు. దీంతో భూమి, చెర్రి అయోమయంలో పడిపోతారు. ఏం చేయాలో అర్థం కాక చూస్తుంటారు. ఇంతలో కేపీ తాను ఈ మర్డర్‌ చేయలేదని తన మీద ఎవరో కావాలని నింద మోపారని చెప్తుంటాడు. అయినా కోర్టు పట్టించుకోదు. దీంతో భూమి లేచి కేపీ మర్డర్‌ చేయలేదని చెప్తుంది. జడ్జి వెంటనే బూమిని బోనులోకి పిలిచి ఏదైనా ఇక్కడ చెప్పు అంటాడు. దీంతో భూమి వెళ్లి కేపీ తప్పు చేయలేదని.. అందుకు కావాలసిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని అయితే త్వరలోనే కోర్టుకు సబ్మిట్‌ చేస్తానని చెప్తుంది. దీంతో జడ్జి ఆలోచిస్తాడు. అన్ని పరిశీలించిన తర్వాత కేపీకి బెయిల్‌ మంజూరు  చేస్తాడు. ఈ విషయం పదే పదే గుర్తు చేసుకుని అపూర్వ టెన్షన్‌ పడుతుంది. ఇంతలో అపూర్వకు కేపీ ఫోన్‌ చేస్తాడు.

Continues below advertisement

అపూర్వ: వీడేంటి నాకు ఫోన్‌ చేస్తున్నాడు. అయినా వీడు ఇప్పుడు ఎం చెప్పాలని ఫోన్‌ చేస్తున్నాడు..

అనుకుంటూ టెన్షన్‌ పడుతూనే కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది అపూర్వ.

Continues below advertisement

అపూర్వ: ఏంటి కేపీ నాకు ఫోన్ చేశావు.. నన్ను బ్లాక్ మెయిల్‌ చేయడానికా..? ఆ భూమి పక్క నుంచి నీతో ఫోన్‌ చేయిస్తుందా..?

కేపీ: నా పక్కన ఎవ్వరూ లేరు.. నేను నీతో మాట్లాడాలని ఫోన్‌ చేశాను. వెంటనే నువ్వు రావాలి..

అపూర్వ: నువ్వు ఫోన్‌ పిలిస్తే ఈ అపూర్వ వస్తుందని ఎలా అనుకున్నావు.. అసలు నాకు ఫోన్‌ చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ విషయం మా బావకు తెలిస్తే.. నీ పరిస్థితి ఏంటో తెలుసా…

కేపీ: అవునా నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు.. కానీ నేను నోరు విప్పానంటే.. భూమి ఆ వీడియో బయటకు తీసుకొచ్చిందంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో..

అపూర్వ: ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు కేపీ వస్తాను..

అనగానే కేపీ తాను ఉన్న అడ్రస్‌ చెప్తాడు. అపూర్వ వెళ్తుంది.

అపూర్వ: నాతో మాట్లాడాలని అన్నావు అసలు ఏం మాట్లాడతావు.. ఇక్కడికే ఎందుకు పిలిచావు..

కేపీ: ఇక్కడైతేనే కదా మనం ఏం మాట్లాడుకున్నా ఎవ్వరికీ వినిపించదు.. ఎవ్వరికీ కనిపించదు.. అయినా ఇక్కడ మాట్లాడాలంటే నీకైనా భయంగా ఉందా..?  నేరాలు చేసేది నువ్వా.. శిక్ష అనుభవించేది నేనా..? అంతటితో ఆగవు.. గగన్‌ ను శారదను నువ్వు కచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు..

అపూర్వ: ఏమో చేసినా చేస్తానేమో.. అయినా ఈ మాటలు చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నావా..? నన్ను..

కేపీ: ఈ మాటలకే కాదు అపూర్వ.. నేను బాగా ఆలోచించాను.. అందరికీ ప్రశాంతత కావాలంటే.. నువ్వు ఉండకూడదు అపూర్వ. అందుకే నిన్ను తప్పిస్తే అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు… నేను ఎలాగూ శోభాచంద్రను చంపిన కేసులో జైలుకు వెళ్లొచ్చాను. ఇప్పుడు నిన్ను చంపేస్తే అది ఒక కేసు అవుతుంది. నిన్ను ఇప్పుడే చంపేస్తాను అపూర్వ..

అంటూ కేపీ కత్తి తీసి అపూర్వను చంపేయడానికి ప్రయత్నిస్తాడు. అపూర్వ, కేపీని తోసేసి పారిపోతుంది. వెనకాలే పరుగెత్తుకుంటూ వచ్చిన కేపీ అపూర్వను పట్టకుని చంపేయబోతుంటే.. అపూర్వ వద్దు కేపీ నన్ను చంపొద్దు అంటూ ఏడుస్తుంది. ఇంతలో శరత్‌ చంద్ర గన్‌ తీసుకుని వచ్చి కేపీ ఆగు అంటూ అరుస్తాడు. కేపీ కత్తి అపూర్వ గొంతు మీద పెడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!