Meghasandesam Serial Today Episode: కాలేజీ క్యాంటీన్ కేపీ గురించి బాధపడుతూ కూర్చున్న బిందుకు శివ అన్న తినిపిస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పూర్ణి వెళ్లి శివను తిడుతుంది. ఎందుకు అన్నం తినిపిస్తున్నావు అని అడుగుతుంది. వాళ్ల నాన్న కోసం బాధపడుతుంటే తినిపిస్తున్నానని చెప్తాడు. మా నాన్న కూడా అరెస్ట్ అయ్యాడు నాకు తినిపించు అని అడుగుతుంది. దీంతో శివ డైలమాలో పడిపోతాడు. మరోవైపు అపూర్వ ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంటే సుజాత రీల్స్‌ గురించి చెప్తుంది.

Continues below advertisement


సుజాత: అమ్మాయి మొన్న నేను రీల్‌ చూడు ఎంత వైరల్‌ అయిపోయిందో..


అపూర్వ: ఇప్పుడు నేను నీ పీక నొక్కితే ఆ న్యూస్‌ ఇంకా వైరల్‌ అవుతుంది.


సుజాత: వద్దులే అమ్మాయి..


మీరా బయటి నుంచి వస్తుంది.


అపూర్వ: మీరా ఎక్కడి నుంచి వస్తున్నావు.. చెప్పు మీరా ఎక్కడి నుంచి వస్తున్నావు..?


మీరా: ఆయనను చూడాలనిపించి పోలీస్ స్టేసన్‌కు వెళ్లాను వదిన. పోలీసులు ఆయన్ని బాగా కొట్టారు. ఆ దెబ్బలకు ఆయన కళ్లు తిరిగి పడిపోయారు కూడా..


అపూర్వ: తప్పు చేసిన వాడు తన్నులు తినడం కళ్లు తిరిగి పడిపోవడం కామనే మీరా.. ఏమంటావు పిన్ని..


సుజాత: అంతే కదా అమ్మాయి నువ్వు ఏం చెబితే అదే రైటు అమ్మాయి.


మీరా: నువ్వు ఎన్నైనా చెప్పు వదిన ఆయన శోభాచంద్ర వదిన ప్రాణాలు తీశారంటే నేను నమ్మను..


సుజాత: కన్నదానికి కట్టుకున్నదానికి కళ్ల ముందే మర్డర్‌ చేస్తున్న నమ్మబుద్ది కాదులే అమ్మాయి.


అపూర్వ:  ఆ బాగా చెప్పావు పిన్ని  


మీరా: బెయిలు మీద ఆయన బయటకు వస్తే భగవంతుడి దయ వలన నిజా నిజాలు బయట పడతాయని నేను నమ్ముతున్నాను వదిన


అపూర్వ: మీరా నువ్వేం మాట్లాడుతున్నావు.. మీ ఆయన బెయిల్‌ మీద బయటకు ఎలా వస్తారు. అసలు ఎవరు తీసుకొస్తారు.


మీరా: చెప్పడం మర్చిపోయాను వదిన నేను ఆ శారద అనుకోకుండా ఒకేసారి ఆ పోలీస్‌ స్టేషన్‌కు ఆయన్ని చూడ్డానికి వెళ్లాము. ఎలాగైనా గగన్‌ ను ఒప్పించి బెయిల్‌ ఇప్పించమని నేను శారదను అడిగాను. ఆ శారద చెబితే గగన్‌ తప్పకుండా బెయిల్‌ ఇప్పిస్తాడు.


అని మీరా చెప్పగానే అపూర్వ కోపంగా మీరాను కొడుతుంది.


అపూర్వ: ఎందుకు మీరా బెయిల్‌ ఇప్పించమని అడిగావు.. అసలు అది మన శత్రువు అని నీకు తెలియదు..


మీరా: అన్నయ్య ఎలాగూ ఇప్పించడు కదా వదిన వాళ్లను అడిగితే తప్పేం ఉంది.


అపూర్వ: తప్పా తప్పున్నరా..? మీ ఆయన బెయిల్‌ మీద బయటకు వస్తే నేను నేను జైళ్లోకి వెళ్లి కూర్చోవాలి.


మీరా: మీరెందుకు వెళ్లి కూర్చోవాలి వదిన..


సుజాత: ఎందుకంటే శోభా చంద్రను చంపింది మీ అమ్మాయే కాబట్టి.


అంటూ సుజాత చెప్పగానే.. మీరా షాక్‌ అవుతుంది. అపూర్వ కోపంగా సుజాతను చూస్తూ సైగ చేస్తుంది. ఇంతలో సుజాత మాట మారుస్తుంది.


సుజాత: అంటే అలాగని నీ కొడుకు మా అమ్మాయి మీద నింద వేశాడు కదా..? అనుమానంతో పోలీసులు తీసుకెళ్లి జైళ్లో పెడతారని అలా అంటున్నాను..


అపూర్వ: నోరు మూయ్‌.. చూడు మీరా ఇకపై బెయిల్‌ అనొద్దు అసలు ఈ విషయం మీ అన్నయ్యకు తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా..?


సుజాత: ఏమవుతుంది. మన మీరా పుణ్య స్త్రీ గానే పైకి వెళ్లిపోతుంది.


అపూర్వ: ఏడవకు ముందు కళ్లు తుడుచుకో.. వెళ్లు..


అని చెప్పగానే ఏడుస్తూ మీరా వెళ్లిపోతుంది.


సుజాత: అమ్మాయి ఆ కేపీ గాడికి ఆ గగన్‌ గాడు బెయిల్‌ ఇప్పిస్తాడా..?


అని అడగ్గానే.. అపూర్వ కోపంగా చూస్తుంది.  ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!