Meghasandesam Serial Today Episode: పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న కేపీని చూసిన శారద, మీరా ఏడుస్తుంటారు. స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరా ఏడుస్తూ కేపీని ఈ కేసులోంచి బయటపడేయాలంటే అది గగన్‌ వల్లే అవుతుందని శారదకు చెప్తుంది. అలాగే ఇప్పుడు బెయిల్‌ మీద బయటకు తీసుకురావాలన్నా అది గగన్‌ వల్లే అవుతుందని చెప్పగానే శారద అనుమానంగానే గగన్‌కు చెప్తానని అంటుంది. తర్వాత శారద, చెర్రి కలిసి గగన్‌ దగ్గరకు వెళ్లి విషయం చెప్తారు. గగన్‌ కోపంగా చూస్తాడు. కానీ శారద కన్వీన్స్‌ చేయగానే గగన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తాడు. ఏసీపీ సూర్యను కలుస్తాడు.

Continues below advertisement

గగన్‌: మా ఇంట్లో పని చేసిన రత్నం మీ అన్నయ్యను చంపిన క్రిమినల్‌ అయితే మీ అన్నయ్యను చంపించిన వాళ్లెవరు..?

సూర్య: ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా అలా వాణ్ని పట్టుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. మా అన్నయ్యను చంపించి ఉండకపోతే ఇప్పటకీ దొరికి ఉండేవాడు కాదేమో..? ఇదిగో వీళ్ల అమ్మ శోభాచంద్రను చంపింది. మా అన్నయ్యను చంపింది ఒక్కడే వాడే కృష్ణ ప్రసాద్‌.

Continues below advertisement

గగన్‌: వాట్‌ కృష్ణ ప్రసాద్‌..

సూర్య: ఎస్‌..

గగన్‌: ఇన్నాళ్లు కృష్ణ ప్రసాద్‌ అనే వ్యక్తి మోసగాడే అనుకున్నాను. హత్యలు చేసే హంతకుడు కూడానా… నేను ఒక్కసారి ఆయన్ని చూడొచ్చా సార్‌.

సూర్య: నువ్వెందుకు చూడాలి. ఏ రిలేషన్‌ ఉందని చూడాలనుకుంటున్నావు.

భూమి: సార్‌ ఆయన ఈయనకు నాన్న అండి..

అంటూ భూమి చెప్పగానే గగన్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కేపీ అసలు తప్పు చేయలేదని ఆ విషయం శరత్‌ చంద్రకు తెలిసేలా చేస్తే ఆయన మీద కేసులు ఉండవని భూమి ఆలోచిస్తుంది. అందుకోసం తాను శరత్‌ చంద్ర ఇంటికి వెళ్తుంది. భూమి ఇంటికి రావడం చూసిన శరత్‌ చంద్ర కోపంగా తిడతాడు. అయినా పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది భూమి.

భూమి: నాన్న నేను చెప్పేది కాస్త వినండి.. కేపీ మామయ్య అమ్మను చంపేసి ఏం సాధించాలనుకున్నారు..? ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నారా..?  లేదే.. ఆలోంచిండి నాన్న 

అపూర్వ: ఇంకా ఈ నాటకీయ పరిణామాలు నీకు అర్థం కావడం లేదా బావ. కేపీని ఎలాగైనా నేరం నుంచి బయటపడేయి.. నేను నీ కాపురాన్ని నా కొడుకుతో చక్కదిద్దుతానని ఆ శారద చెప్తే మన భూమి ఇక్కడకు వచ్చిందన్న మాట.

భూమి: కేపీ మామయ్య అమ్మను చంపలేదని నేను మిమ్మల్ని నమ్మించడం కోసం అవసరం అయితే నేను నిప్పుల్లో దూకడానికి కూడా సిద్దమే..

అపూర్వ: నేను చెప్పాను కదా బావ.. ఇలాంటి మాటలు మాట్లాడి నిన్ను కన్వీన్స్‌ చేద్దామని ఇక్కడకు వచ్చింది భూమి. అయినా ఇదంతా కావాలని ఆ శారద ఆడిస్తున్న నాటకం.   

శరత్‌: చూడు భూమి నువ్వు ఏ హక్కుతో ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు అయినా ముందు ఇంట్లోంచి బయటకు వెళ్లిపో

భూమి: నాన్న నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా అమ్మను కృష్ణ ప్రసాద్‌ మామయ్య చంపలేదు.

అంటూ భూమి, శోభాచంద్ర ఫోటో మీద చేయి పెట్టి చెప్తుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!