Meghasandesam Serial Today Episode: నిజం తెలుసుకున్న గగన్‌ శరత్‌ చంద్ర ఇంటికి వెళ్లి అపూర్వను చంపబోతుంటాడు. ఇంతలో చెర్రి వచ్చి అడ్డు పడతాడు. గగన్‌ షూట్‌ చేయబోతుంటే.. చెర్రి గన్‌ను పక్కకు తోసేస్తాడు. ఇంతలో అపూర్వ తప్పించుకుని కారులో పారిపోతుంది. చెర్రి ఎంత చెప్పినా వినకుండా గగన్‌ కూడా అపూర్వ కారును ఫాలో అవుతుంటాడు. మరోవైపు ఐసీయూలో ఉన్న కేపీకి జ్యూస్‌ ఇస్తుంది శారద. జ్యూస్‌ తాగుతూ కేపీ ఏడుస్తుంటాడు.

Continues below advertisement

శారద: అయ్యో ఎందుకండి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..?

కేపీ: శారద నేను నీకేం చేశాను. నాకు ఇంత సేవ చేస్తున్నావు. నేను బతకాలని బాగా కోరుకుంటున్నావు. నేను నిన్ను మధ్యలోనే వదిలేశాను శారద. నీ స్థానంలో ఇంకెవరు ఉన్నా ఇన్ని సేవలు చేయరు. చచ్చిపోవాలని కోరుకుంటారు. చనిపోతే సంతోషిస్తారు.

Continues below advertisement

శారద: అయ్యో ఏంటండి ఈ అశుభం మాటలు. ముందు ఈ జ్యూస్‌ తాగండి. మీరు బాగుండాలి అండి.. నిండు నూరేళ్లు మీరు ఉండాలి. సౌభాగ్యవతిగా నేను మీ చేతుల మీదుగా పోవాలి. 

కేపీ: నన్ను మాట్లాడొద్దని నువ్వు మాట్లాడతావేంటి…? శారద.

శారద: పోవాలన్న మాట అశుభం కాదండి. మీ చేతుల మీదుగా పోవాలన్న ఆశ అది.

కేపీ: ఏమో శారద నువ్వు ఇలా నాకు సేవలు చేస్తున్న విషయం గగన్‌కు తెలిస్తే నీ పరిస్థితి ఏంటా అని నాకు చాలా భయంగా ఉంది.

శారద: నా తలరాతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. అనవసరంగా ఏదేదో ఆలోచించుకుని బాధపడకండి.. రెస్ట్‌ తీసుకోండి. నేను వెళ్లి మెడిసిన్స్‌ తీసుకొస్తాను.

కేపీ: శారద అందరూ నేను చచ్చిపోయానని బలంగా నమ్మితే నువ్వు మాత్రం నేను బతికే ఉన్నానని ఎలా అనుకున్నావు శారద.

అని కేపీ అడగ్గానే.. శారద మెల్లగా కేపీ అరికాలు తన చేతుల్లోకి తీసుకుని కేపీ కాలు మీద ఉన్న పుట్టమచ్చ చూస్తూ ఏడుస్తుంది. గతం గుర్తు చేసుకుంటుంది.

కేపీ: శారద నేను నీకు ఇచ్చిన మాట తప్పాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వకుండానే నీ ప్రేమను నిరూపించుకున్నావు శారద.

శారద: అయ్యో నేను ప్రేమగా ఈ పుట్టుమచ్చను స్పృషిస్తున్నాను అండి. మీతో కన్నీరు పెట్టించడం నా ఉద్దేశం కాదు. నేను వెళ్లి మెడిసిన్స్‌ తీసుకొస్తాను

అంటూ శారద వెళ్లిపోతుంది.

మరోవైపు అపూర్వను వెంబడించిన గగన్‌ పట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతాడు. పుల్లుగా నిద్ర పోతాడు. అది చూసిన భూమి గోరింటాకు తీసుకుని వెళ్లి గగన్‌ చేతిలో ఐ లవ్యూ భూమి అని రాసి వెళ్లిపోతుంది. నిద్ర లేచాక గగన్‌ చూసుకుని కోపంగా భూమిని తిడతాడు. ఈ విషయం అందరికీ తెలిసి నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!