Meghasandesam Serial Today Episode: గుడిలో హోమం అయిపోయిన తర్వాత భూమి, శారద కలిసి కేపీని మళ్లీ హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఐసీయూలో ఉన్న కేపీకి స్పృహ వస్తుంది. ఆ విషయం తెలిసిన భూమి ఐసీయూలోకి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడే ఉన్న శారద కూడా హ్యాపీగా లోపలికి వెళ్తుంది. కేపీకి స్పృహ రావడం చూసిన ఇద్దరూ ఎమోషనల్‌ అవుతారు. వాళ్లను చూసిన కేపీ ఎమోషనల్‌ అవుతారు.

Continues below advertisement

భూమి: ఎందుకు మామయ్య మీరు ఏడుస్తున్నారు..?

కేపీ: ఏం లేదు భూమి నేను మళ్లీ మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదమ్మా..?

Continues below advertisement

భూమి: అసలు ఏం జరిగింది మామయ్య.. మీరు ఆ అడవిలోకి ఎందుకు వెళ్లారు..? అసలు మీరు ఆ అపూర్వకు ఎందుకు ఫోన్‌ చేశారు.. మీ ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ చెక్‌ చేస్తే మీ లాస్ట్‌ కాల్‌ ఆ అపూర్వకే ఉంది.. అసలు ఏం జరిగింది మామయ్య.

కేపీ: నేను కావాలనే ఆ అడవిలోకి వెళ్లాను అమ్మా.. మీ అందరి కోసం మీరంతా హ్యాపీగా ఉండాలంటే నేను ఒక పని చేయాలని డిసైడ్‌ అయ్యే అక్కడికి వెళ్లాను.. అక్కడికి వెళ్లాకే అపూర్వకు ఫోన్‌ చేశాను. అపూర్వకు ఫోన్‌ చేశాక నేను ఫోన్‌ స్విచ్చాప్‌ చేశాను. ఇంతలో అపూర్వ కూడా అక్కడకు వచ్చింది..?

భూమి: ఏంటి మామయ్య మీరు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు.. మీరేంటి అపూర్వకు ఫోన్‌ చేయడమేంటి..? పైగా ఆమెను అడవిలోకి రమ్మనడమేంటి…? మీరు పిలవగానే.. ఆవిడ రావడమేంటి..? అసలు ఏం జరిగింది మామయ్య.. మీరు ఎందుకు అపూర్వకు ఫోన్‌ చేశారు చెప్పండి మామయ్య..

కేపీ: మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉండాలని అపూర్వను అక్కడికి పిలిచాను భూమి.  అపూర్వ బతికి ఉన్నంత కాలం మన రెండు కుటుంబాల్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరని నాకు అర్థం అయింది. అందుకే అపూర్వను చంపేస్తే అందరూ సంతోషంగా ఉంటారని అనుకున్నాను.. అందుకే ఆ అపూర్వను చంపేయాలని డిసైడ్‌ అయ్యాను అందుకే నేను ఆ అడవిలోకి వెళ్లి అపూర్వను అక్కడికి రమ్మని చెప్పాను.. నేను చెప్పినట్టుగానే అపూర్వ అడవిలోకి వచ్చింది. కానీ దురదృష్టావశాత్తు ఇలా జరిగింది.

భూమి: ఏం జరిగింది మామయ్య.. అపూర్వ చంపేస్తానని అనుకున్న మిమ్మల్ని ఎవరు కాల్చేశారు.. ఆ అపూర్వే కాల్చేసిందా..? లేక అపూర్వ తన మనుషులతో వచ్చి మీ మీద ఈ అఘాయిత్యానికి పాల్పడిందా..? అసలు ఏం జరిగింది మామయ్య.. మిమ్మల్ని కాల్చింది ఎవరు..?

కేపీ: నేను పిలవగానే అపూర్వ ఒక్కతే వచ్చింది భూమి. తన మనుషులు కానీ రౌడీలు కానీ ఎవ్వరూ రాలేదు. కానీ నేను కోపంగా అపూర్వను చంపబోతుంటే.. అప్పుడే…

అంటూ కేపీ చెప్పడం ఆపేస్తాడు…

భూమి: అప్పుడే చెప్పండి మామయ్య ఏమైంది..? చెప్పండి మామయ్య.. మిమ్మల్ని ఎవరు కాల్చారు..?

అంటూ భూమి బాధతో అడగ్గానే.. కేపీ కూడా నిజం చెప్పడానికి బాధపడుతుంటాడు.. అయినా భూమి గట్టిగా అడగ్గానే..

కేపీ: నన్ను గన్‌ తో షూట్‌ చేసింది మీ నాన్నే భూమి..

అని కేపీ చెప్పగానే.. భూమి, శారద షాక్‌ అవుతారు. ఏం చెప్పాలో అర్థం కాక భూమి ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!