Meghasandesam Serial Today Episode: ఇంటికి వచ్చిన కేపీని నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మీరా అడుగుతుంది. చెర్రి ఇప్పుడు అవన్నీ ఎందుకు అమ్మా అని చెబితే మనం అందరం ఉండగా కూడా మీ నాన్న ఆత్మహత్య చేసుకోవడం ఏంట్రా అని అడుగుతుంది. దీంతో కేపీ తాను ఆత్మహత్య చేసుకోవలేదని.. తనను చంపాలని చూశారని నా గుండెల్లో బుల్లెట్‌ దింపారని చెప్తాడు. దీంతో మీరా భయపడుతూ మీ గుండెల్లో బుల్లెట్‌ దించింది ఎవరు? అని అడుగుతుంది. దానికి కేపీ మీ అన్నయ్యే నా గుండెల్లో బుల్లెట్‌ దింపారని చెప్తాడు. కేపీ మాటలకు అందరూ షాక్‌ అవుతారు.

Continues below advertisement


మీరా: మా అన్నయ్య మిమ్మల్ని షూట్‌ చేసి చంపాలనుకోవడం ఏంటి..? కొండ మీద నుంచి పడినప్పుడు తలకు ఏమైనా దెబ్బ తగిలిందా ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.


కేపీ: నా మాట మీద నమ్మకం లేనప్పుడు మీ అన్నయ్యనే అడుగు మీరా.. ఆయన నన్ను షూట్‌ చేశారో లేదో


మీరా: ఏంటి అన్నయ్య ఆయన ఇలా మాట్లాడుతున్నారు. మీరేంటి మా ఆయన్ను షూట్‌ చేయడం ఏంటి..? అన్నయ్య చెప్పు అన్నయ్య మా ఆయను మీరు షూట్‌ చేయలేదని చెప్పండి. ఏం మాట్లాడవేంటన్నయ్యా మీరు షూట్‌ చేయలేదని చెప్పండి.  


శరత్‌: కేపీ మాట్లాడింది నిజమే.. కేపీని నేనే షూట్‌ చేశాను.


అంటూ శరత్‌ చంద్ర చెప్పగానే.. అందరూద షాక్‌ అవుతారు. మీరా షాక్‌తో కింద పడబోతుంది. కేపీ పట్టుకుంటాడు.  


మీరా: అన్నయ్య ఆయన అంటే నాకు ప్రాణం అని మీకు తెలుసు. నువ్వు నన్ను ప్రాణంగా చూసుకుంటావని చెప్తుంటావు. అసలు నా ప్రాణాన్ని ఎలా తీయాలనుకున్నావు అన్నయ్య.


శరత్‌: అసలు ఏం జరిగిందంటే మీరా..?


మీరా: వద్దు ఇంకేం చెప్పొద్దు. నా కుంకుమ దిద్దిన ఈ చేతులతోనే నా కుంకుమ చెరిపేయాలని అనుకున్నావా.? నాటిక చేతులతోనే చెట్టును కూకటి వేళ్లతో సహా పీకేస్తుంటే.. ఎలా అన్నయ్య ఎలా చూస్తూ ఊరుకునేది


అంటూ మీరా శరత్‌ చంద్రను కొడుతుంది. వెంటనే శరత్‌ చంద్ర ఉలిక్కి పడి నిద్ర లేస్తాడు. అదంతా శరత్‌ చంద్ర కలగంటాడు. నిద్రలోంచి లేచిన శరత్‌ చంద్ర టెన్సన్‌ పడుతుంటాడు.  మరోవైపు చేతికి గాయంతో ఉన్న గగన్‌కు భూమి అన్నం తినిపిస్తుంది. గగన్‌ కోపంగా చూస్తుంటాడు.


భూమి: అలా కొరికేసేలా చూడకు బావ. నేను తినిపంచే ప్రతి ముద్దా నీకు అమృతంలా అనిపించాలి. అంటే మనం ఇద్దరం ప్రేమలో పడే కొత్త రోజులు ఉన్నాయే అలా ఉండాలి. ఆ రోజులు తలుచుకో బావ. ఈ రోజులు మర్చిపో..



అని చెప్పగానే.. గగన్‌ వెళ్లి భూమిని భోజనానికి పిలవడం.. భూమి రానని చెప్పడం గగన్‌, భూమిని ఎత్తుకుని వెళ్లడం.. భూమితో కలిసి కుకింగ్‌ చేయడం.. లాంటి పాత విషయాలు గుర్తు చేసుకుని గగన్‌ ఎమోషనల్‌ అవుతాడు. భూమి అన్నం తినిపిస్తూ ఏడుస్తుంది. అన్న తినిపించడం అయిపోతుంది.


భూమి: బావ ఇంక నువ్వు రెస్ట్ తీసుకో..?


అని చెప్పి భూమి వెళ్లిపోతుంది. ఒక్కసారిగా గగన్‌ తల విదిల్చి అబ్బా ఏమైంది నాకు అనుకుంటాడు.  అమ్మో ఇంకెప్పుడు భూమి కళ్లలోకి చూడకూడదు. తన కళ్లల్లో ఏదో మాయ ఉంది.  అనుకుంటూ కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!