Meghasandesam Serial Today Episode: హాస్పిటల్ లో భూమిని చూడ్డానికి శారద, పూరి వస్తారు. వాళ్లను చూసిన గగన్ ఏడుస్తాడు. భూమి ప్లేస్‌లో నేనుండాలి అమ్మా కానీ నన్ను రక్షించి భూమి ఈ పరిస్థితుల్లో పడిపోయిందని చెప్పి ఎమోషనల్ అవుతాడు. మరోవైపు ఇందును తీసుకుని రమేష్ వాళ్ల ఇంటికి వెళ్తారు. సౌందర్య వెటకారంగా మాట్లాడుతుంది. ప్రసాద్, మీరాలను లోపలికి వెళ్లమని చెప్తుంది. పర్లేదు ఇక్కడే ఉంటామని చెప్పగానే వంశీ అయ్యో మీరు లోపలికి వెళ్లండి మామయ్యా హారతి మా ఇద్దరికి ఇస్తే సరిపోతుంది కదా..? అందులోను మాకు స్పెషల్ ఎంట్రీ కావాలని చెప్తాడు. దీంతో ప్రసాద్, మీరా లోపలికి వెళ్తారు. తర్వాత సౌందర్య హారతి తీసుకొని వచ్చి దిష్టి తీసి నవదంపతులను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.
సౌందర్య: లక్ష్మీదేవి లాంటి మా కోడలు అనుకున్నట్టుగానే కాస్త వెనకా ముందైనా ఇంటిలో అడుగుపెట్టేసింది. కాకపోతే తీసుకొస్తామన్న కట్నకానుకలే తీసుకురాకుండా వచ్చింది.
మీరా: చెప్పాను కదా వదిన గారు పదహారు రోజుల పండగ నాడు అన్ని ఇప్పిస్తానని.
సౌందర్య: మరీ పట్టుబడుతున్నానని అనుకోకండి. మా కోడలు అది తెస్తుంది. ఇది తెస్తుంది అని అందరికీ చెప్పుకున్నాను. చూపించుకోవాలి కదా..?
ప్రసాద్: వియ్యపురాళ్లు ఇద్దరూ ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు.
పక్కింటావిడ: ఏముంటుంది.. జరగబోయే శుభకార్యం గురించే..
మీరా: మీరు భలే గుర్తు చేశారు. అది కూడా అయిపోతే మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం వదిన గారు.
సౌందర్య: ఓ అదోటి ఉంది కదూ.. సరే పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. మీరు కూర్చోండి నేను కాఫీలు తీసుకొస్తాను.
అని వంశీ, రమేష్ లను తీసుకుని లోపలికి వెళ్తుంది సౌందర్య. లోపలికి వెళ్లిన సౌందర్య వంశీని వచ్చే కట్నకానుకలు వచ్చే వరకు నువ్వు శోభనం చేసుకోకూడదని చెప్తుంది. కట్నకానుకలు వచ్చే వరకు నువ్వు కంట్రోల్ లో ఉండాలని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత బయటకు కాఫీ తీసుకుని వచ్చి పంతులును అడిగితే వీళ్లిద్దరి జాతకాల ప్రకారం నెల రోజుల వరకు ఆ శుభకార్యం చేయకూడదన్నారు అని సౌందర్య అబద్దం చెప్తుండగానే అప్పుడే పంతులు అక్కడికి వస్తాడు. సౌందర్య షాక్ అవుతుంది. ఇప్పుడే నా సంభావన అడగడానికి వచ్చానని చెప్తాడు.
చెర్రి: ఇది అడగడానికి ఫోన్ కట్ చేసిన వెంటనే పరుగెత్తుకురావాలా పంతులు గారు. అడిగితే ఆంటీనో అంకులో పంపేవారు కదా..?
సౌందర్య: అంటే బాబు మేము ముహూర్తం అడిగింది పెద్ద పంతులు గారిని
పంతులు: పెద్ద పంతులు అంటే మా నాన్న కాలం చేసి పదేళ్లు అవుతుంది. అయినా ఫోన్ లో టచ్ లో ఉన్నారా మీకు. ఇదెలా సాధ్యము..?
రమేష్: పెద్ద పంతులు అంటే మీ నాన్నగారు కాదు. ఆయన పేరే పెద్ద పంతులు.
అని రమేష్ చెప్పగానే పంతులు కోప్పడతాడు. ఇంతలో ప్రసాద్ మీ సంబావన ఎంత అని అడిగితే పదివేలు అని చెప్పగానే 20 వేలు తీసుకోండి అని ప్రసాద్ 20 వేలు ఇస్తాడు. దీంతో పంతులు వంశీ, ఇందుల శోభనానికి ముహూర్తం పెట్టి వెళ్తాడు. మరోవైపు ముంబై నుంచి డాక్టర్ ను తీసుకొస్తాడు శరత్ చంద్ర. డాక్టర్ లోపలికి వెళ్లి భూమిని పరీక్షించి ట్రీట్ మెంట్ చేసి బయటకు వస్తాడు.
డాక్టర్: నన్ను క్షమించండి నేను ఈ ఆఫరేషన్ చేయలేను.
శరత్: మీరే ఇలా అంటే ఇంకెవరు చేస్తారు డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా కూతురిని బతికించండి.
డాక్టర్: డబ్బు గురించి కాదు సమస్య. బుల్లెట్ గుండెకు దగ్గరగా వెళ్లింది. అది బయటకు తీసేటప్పుడు ఎదైనా జరగొచ్చు.
గగన్: డాక్టర్ ఫ్యారిన్ ఏమైనా తీసుకెళ్తే బతికే చాన్స్ ఉందా..?
డాక్టర్: మీరు ఎక్కడికి వెళ్లినా ఇదే చెప్తారు. ఇంకా ఆలస్యం చేస్తే తన కండీషన్ ఇంకా సీరియస్ గా మారుతుంది.
అని చెప్పగానే శరత్ చంద్ర, గగన్ ఏడుస్తుంటారు. నా ప్రయత్నం నేను చేస్తాను. మిగతాది అంతా దేవుడి చేతుల్లో ఉంది అని ఐసీయూలోకి వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!