Meghasandesam Serial Today Episode: అపూర్వ గెస్ట్‌ హౌస్ కు వెళ్తుంది. అక్కడ శరత్‌ చంద్ర గన్‌తో షూట్‌ చేసుకుని కింద పడిపోయి ఉంటాడు. తలలోంచి బ్లడ్‌ వస్తుంది. అది చూసిన అపూర్వ ఏడుస్తూ పరుగెత్తుకెల్లి శరత్‌ చంద్రను దగ్గరకు తీసుకుని అయ్యో అంటూ ఏడుస్తుంది.

అపూర్వ: అయ్యో బావ లేవు బావ.. నేను బతకలేను బావ నువ్వు లేకుంటే..

టేబుల్‌ మీద సూసైడ్‌ నోట్‌ కనిపిస్తుంది.

శరత్‌: నిన్ను చాలా నమ్మాను అపూర్వ. ఆ కేపీ నీ గురించి చాలా సార్లు.. చాలా విధాలుగా చెప్తున్నా  వినకుండా.. నిన్నే నమ్మాను. మృత్యు ఘోష ముందుకు తరుముకుంటూ వస్తున్నప్పుడు అన్ని నిజాలే తెలియాలని నాకు నుదుటన రాసి పెట్టి ఉన్నట్టుంది. సొంత కూతురిలా చూసుకున్న భూమి ఈ రోజు మోసం చేసిందన్న నిజమే తట్టుకోలేకపోతున్నాను అంటే పిడుగు పడినట్టు నువ్వు చేసిన దారుణం తెలిసిపోయింది అపూర్వ. శోభాచంద్రను చంపేస్తావా..? నా శోభ నిన్ను ఎంత నమ్మింది అపూర్వ. నువ్వు అడిగితే తన ఆస్థి మొత్తం రాసేది కదా అపూర్వ

అని సూసైడ్‌ నోట్‌ లో శరత్‌ చంద్ర రాసి ఉంటాడు. అంతా చదివిన అపూర్వ పేపర్‌ పక్కకు పడేసి ఏడుస్తూ శరత్‌ చంద్ర పక్కన కూర్చుంటుంది.

అపూర్వ: ఆస్థి కోసం కాదు బావ. చిన్నప్పటి నుంచి నీ మీదే ప్రాణం పెట్టుకుని బతికాను బావ. నీతోనే జీవితం అని బతికాను బావ. అలాంటి అదెవతో మధ్యలో వచ్చి నిన్ను సొంతం  చేసుకోవాలని చూస్తుంటే.. నాకెలా ఉంటుంది చెప్పు.. అందుకే ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలి అనుకున్నాను. నువ్వు దాన్ని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటే ఇంకెప్పటికీ నువ్వు దాన్ని వదలవు అని నాకు అనిపించింది. అందుకే దాన్ని చంపేశాను బావ.   

అంటూ అపూర్వ ఏడుస్తుంటే.. శరత్‌ చంద్ర లేస్తాడు.

శరత్‌: ఇది నీ నోటితో విందామనే నేను చచ్చిపోయినట్టు నటించాను అపూర్వ. నా ప్రాణం అనుకున్న శోభాచంద్రను చంపేసి ఇన్నాళ్లు నంగనాచిలా నా ముందు ప్రేమను నటించావా..?

అపూర్వ: లేదు బావ.. లేదు..

శరత్‌: ఏయ్‌ ఆగు..

అపూర్వ: నా ప్రేమ మాత్రం నిజం బావ.. ఇందులో అబద్దం ఏమీ లేదు. 

శరత్‌: ఏయ్‌ ఆపు.. శోభా చంద్రపై నాకున్న ప్రేమ కూడా నిజమే.. నీ ప్రేమను నిరూపించుకోవడానికి నువ్వు నా శోభను చంపేశావు. శోభపై నాకున్న ప్రేమను నిరూపించుకోవడం కోసం ఇప్పుడు నిన్ను చంపాలి. నువ్వు చావాలి. నీకు బతికే హక్కు లేదు.

అపూర్వ: వద్దు బావ ఫ్లీజ్‌..

శరత్‌: చంపేస్తాను..

అపూర్వ: వద్దు బావ నన్నేం చేయోద్దు బావ..

అంటున్నా దగ్గరకు వెళ్లి శరత్‌ చంద్ర కోపంగా అపూర్వ గొంతు పట్టుకుంటాడు. తర్వాత వదిలేసి  నిన్ను ఇలా చంపను అంటూ అక్కడున్న సీసా పగులగొట్టి పొడవబోతుంటే.. అపూర్వ శరత్‌చంద్రను తోసేస్తుంది. శరత్‌ చంద్ర కిందపడిపోతాడు. ఆయనకే సీసా గుచ్చుకుంటుంది. వెంటనే అపూర్వ అక్కడి నుంచి పారిపోతుంది. ఇది జరిగింది అని అపూర్వ, సుజాతకు నిజం చెప్తుంది. సుజాత భయంతో వణికిపోతుంది. తర్వాత గగన్‌ శరత్‌ చంద్ర ఇంటికి వస్తాడు.

బిందు: అన్నయ్యా..

మీరా: ఆగు ఎందుకు వచ్చావు..

గగన్‌: మీరంతా టీవీలో చూసే ఉంటారు. భూమితో నా పెళ్లి అనౌన్స్‌ చేశాను. పెళ్లి అన్న తర్వాత ఎంగేజ్‌మెంట్‌, షాపింగ్‌ అన్ని ఉంటాయి కదా..? భూమిని నాతో తీసుకెళ్దామని వచ్చాను.

మీరా: తను నీతో రాదు..

గగన్‌: తను రానంటే నేను వెనక్కి వెళ్తాను.

భూమి: నేను వస్తాను గగన్‌ గారు

అంటూ భూమి, గగన్‌ దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుని గగన్‌ కలిసి షాపింగ్‌కు వెళ్తుంది. అపూర్వ, మీరా కోపంతో రగిలిపోతుంటారు. ప్రసాద్‌ హ్యాపీగా చూస్తుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!