MeghasandesamSerial Today Episode: అపూర్వ రౌడీలను కలిసి మీతో పని పడింది అని చెప్తుంది. దీంతో రౌడీలు చెప్పండి మేడం ఏం చేయాలో చేయి తీసేయాలా..? కాలు తీసేయాలా అని అడుగుతారు. దీంతో అవేవీ కాదు తల తీసేయాలి అని అపూర్వ చెప్పగానే.. రౌడీలు షాక్‌ అవుతారు. తలంటే ఖర్చు అవుతుంది కదా మేడం అంటారు.

Continues below advertisement

అపూర్వ: తెలుసు.. నేను నయానో భయానో వాణ్ని దారిలోకి తెచ్చుకుందామనుకున్నాను. కానీ వాడి వల్ల వచ్చే కష్టనష్టాలు చూస్తూ.. వాణ్ని లేపేయడమే బెటర్‌ అనిపిస్తుంది. అందుకే ఎంత ఖర్చైనా పర్వాలేదు. పని పూర్తి చేయండిరా..?

రౌడీ: చెప్పండి మేడం ఎవరిని చంపాలి..?

Continues below advertisement

అపూర్వ: సీఐ శంకర్‌ ఉన్నాడా..?

రౌడీ: ఆయన పేరు తెలియకపోవడం ఏంటి..? మేడం. రాజమండ్రిలో ఆయన పేరు వింటేనే మాలాంటి రౌడీలకు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి మేడం. హైదరాబాద్‌లో ఆయనకు కూడా పేరుంది మేడం.

అపూర్వ: మీరు చంపాల్సింది వాణ్నే..

రౌడీ: సార్‌ తో పెట్టుకుంటే మేము లేకుండా పోతాం మేడం మేము చంపలేము.. సారీ మేడం ఇంకేదైనా పనుంటే చెప్పండి

అపూర్వ: ఎన్నాళ్లని మీరు ఇలా కష్టపడతారు. మీరు కనక వాణ్ని చంపేస్తే మీకు లైఫ్‌ టైం సెటిల్‌ చేస్తాను. (అంటూ తన కారులోంచి డబ్బులు తీసుకొచ్చి రౌడీలకు ఇస్తుంది.) ఇది జస్ట్‌ అడ్వాన్స్‌ పని పూర్తి అయిపోయాక దీనికి వంద రెట్లు ఇస్తాను. చెప్పండి. రిస్క్‌ తీసుకుంటారా..? లేదా..?

రౌడీ: మీరు ఇంత మంచి ఆఫర్‌ ఇచ్చాక కాదని ఎలా అంటాము మేడం చేస్తాము..

అపూర్వ: గుడ్‌ వాడు ఇదే రూట్‌ లో వస్తాడు. టైం చూసుకుని జాగ్రత్తగా ప్లాన్‌ చేయండి.

రౌడీ: సరే మేడం.. మేము చూసుకుంటాము..

అని చెప్పగానే.. అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రౌడీలు సీఐ శంకర్‌ కోసం వెయిట్‌ చేస్తుంటారు. ఇంతలో సీఐ శంకర్‌ రావడం చూసి రౌడీలు తమలో తాము రోడ్డుకు అడ్డంగా  గొడవ పడుతుంటారు. సీఐ జీపు దిగి రౌడీల దగ్గరకు వెళ్తాడు. రౌడీలకు సీఐ శంకర్‌కు మధ్య ఫైట్‌ జరుగుతుంటుంది. దూరం నుంచి అపూర్వ అంతా గమనిస్తుంటుంది.

అపూర్వ: వీణ్ని చంపేస్తే ప్రస్తుతం ఈ సిచ్యుయేషన్‌ నుంచి బయట పడొచ్చు. తర్వాత ఈ కేసు గురించి ఎవ్వరూ ఆలోచించకుండా చేయాలి.   

అనుకుంటుంది. రౌడీలు అందరూ సీఐని పట్టుకుని రౌండప్‌ చేసి కత్తితో పొడిచేందుకు రెడీ అవుతారు.

సీఐ: రేయ్‌ మీ అందరినీ చంపేస్తాను.. నా గురించి మీకు తెలియదు.

రౌడీ: ఇంకాసేపట్లో చచ్చిపోయే మీరు ఎందుకు సార్‌ కేకలు వేస్తారు. సైలెంట్‌గా చచ్చిపోండి.

అంటూ రౌడీలు కత్తితో సీఐని పొడవబోతుంటే.. గగన్‌ వచ్చి అడ్డుపడతాడు. గగన్‌ను చూసిన అపూర్వ షాక్‌ అవుతుంది.  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ..

గగన్‌ రౌడీలను పట్టుకుంటాడు.

గగన్‌: సార్‌ పిల్లర్లు బిల్డింగ్‌కు చాలా ముఖ్యం సార్‌ దాన్నే కూల్చేస్తే బిల్డింగ్‌ మొత్తం పడిపోతుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే నేను చూసుకుంటాను సార్‌.

అపూర్వ: వీడు వచ్చాడేంటి..? వీడికి ఎవరు చెప్పారు..?

గగన్‌: థాంక్యూ సార్‌..హావ్ ఏ గుడ్‌ డే.. ( అంటూ కాల్ కట్‌ చేస్తాడు) రేయ్‌ ఏంట్రా మీరు సొసైటీని కాపాడే పోలీస్‌ నే చంపాలనుకుంటున్నారు.

అంటూ గగన్‌ రౌడీలను చితక్కొడతాడు. అపూర్వ అక్కడి నుంచి పారిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!