Meghasandesam Serial Today Episode:  తాంబూలాలు మార్చుకునే టైంకు అపూర్వ మెలిక పెడుతుంది. తాంబూలాలు మార్చుకోవడానికి ఇక్కడ మేము భార్యాభర్తలం ఉన్నాము మరి అక్కడ శారద పక్కన ఎవ్వరూ లేరు కదా అని అడుగుతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

గగన్‌: మమ్మల్ని ఇక్కడ నిశ్చితార్థానికి పిలిచారా..? అవమానించడానికి పిలిచారా..?

భూమి: ఫ్లీజ్‌ గగన్‌ బావ మీరు ఒక్క నిమిషం ఆగండి. నాన్నా మీరు ఏమీ అనుకోనంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్‌..

శరత్: ఏంటమ్మా.. అడుగు

భూమి: ఈ తాంబూలాలు శారద అత్తయ్యతో పాటు కృష్ణప్రసాద్ మామయ్యా తీసుకుంటారు.

అపూర్వ: బావ అందరూ మనల్నే చూస్తున్నారు. మీరు అందరి దృష్టిలో చెడ్డవారు కాకూడదు. వాళ్లు ఎలాగూ విడాకులు తీసుకుంటారు. ఒప్పుకోండి.. ప్లీజ్‌. అయినా భూమి అడిగిన దాంట్లో తప్పేముంది బావ ఆలోచించండి.

శరత్: సరే.. అమ్మా భూమి..

అపూర్వ: అమ్మా భూమి ఇటురా..

శరత్‌: అమ్మా భూమి సరేలే..

మీరా: సరేనా..? సరే అనడానికి మీరు నోరు ఎలా వచ్చింది అన్నయ్యా.. నన్ను ఏడిపించడానికే ఈ నిశ్చితార్థం పెట్టినట్టు ఉంది. నా కళ్ల ముందే ఆయన ఆవిడ గారి పక్కన కూర్చుని తాంబూలాలు తీసుకుంటుంటే నేను చప్పట్లు కొట్టాలా..?

శరత్: మీరా కాస్త శాంతించు. శారద చెల్లెమ్మ పక్కన కూర్చుని ఆయన తాంబూలాలు మాత్రమే తీసుకుంటాడు. చెల్లెమ్మతో కలిసి వెళ్లిపోడు. కృష్ణ ప్రసాద్‌ ఎక్కడ.. ఏయ్‌ చెర్రి.. మీ నాన్న ఎక్కడున్నాడో చూడు

చెర్రి: అలాగే మామయ్య..

అంతా చూసి నాన్న పైన లేడు మామయ్యా అంటూ కింద వెతుకుతాడు.

చెర్రి: మామయ్య నాన్న ఇంట్లో ఎక్కడా లేరు..

శరత్‌: బయట ఎక్కడైనా ఉన్నారేమో చూడు..

చెర్రి: ఆ అలాగే మామయ్య..

మీరా: అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నాను. ఆవిడ గారి పక్కన కూర్చోవాల్సి వస్తుందని కూర్చోవడం ఇష్టం లేదని ముందే వెళ్లిపోయినట్టు ఉన్నారు.

శరత్: మీరా నువ్వు కొంచెం ఆగుతావా..? చెర్రి వెల్లాడు కదా తీసుకొస్తాడు.

అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. గగన్‌ మాత్రం తాను కృష్ణప్రసాద్‌ను పిలిచి నిశ్చితార్తానికి రావొద్దని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు.

కృష్ణ: గగన్‌ అరే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేనురా..? మొదటిసారి నాతో మాట్లాడటానికి నువ్వు పిలిచావురా..? నిజంగా  ఆనందంగా ఉందిరా..? ఇప్పటికైనా నన్ను ఇన్నేళ్లకైనా నన్ను అర్థం చేసుకున్నావు చూడు చాలురా

గగన్‌: ఈరోజు జరుగుతున్న నిశ్చితార్థం నా ఇష్టం. ముఖ్యంగా తాంబూలాలు తీసుకునే టైంలో నువ్వు అసలు ఉండకూడదు.

అని చెప్పింది గుర్తు చేసుకున్న గగన్. తన తరపున వంశీ, ఇందు తాంబూలాలు అందుకుంటారని చెప్తాడు. అలాగేనని వంశీ, ఇందు తాంబూలాలు అందుకోబోతుంటే.. చెర్రి పరుగెత్తుకొచ్చి కేపీ వస్తున్నాడని చెప్తాడు. అందరూ షాక్‌ అవుతారు. గగన్ ఆశ్చర్యంగా కొపంగా చూస్తుంటాడు. ఇంతలో కేపీ వస్తాడు. తాంబూలాలు అందుకుంటాడు. తర్వాత అందరూ వెళ్లిపోతారు. గగన్‌ ఇంటికి వెళ్లిన కేపీ శారదతో హ్యాపీగా మాట్లాడుతుంటాడు.

కేపీ: ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయనా సరే మనిద్దరం దగ్గరుండి భూమి, గగన్‌ ల పెళ్లి జరుపుకుందాం శారద. పెళ్లిలో మన గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడరు ఏమంటావు.

శారద: అలా అనుకోకుండా ఉండటానికి ఇంకోక్క దారి ఉంది.

కేపీ: అంటే నన్ను పెళ్లిలోనే ఉండొద్దు అంటావా..?

శారద: మీరు ఉండకపోతే ఎలా..? మీరు భూమి మేనమామ. మీరు కచ్చితంగా ఉండాలి.

కేపీ: నేను ఉంటే పెళ్లిలో మన గురించి తప్పుగా అనుకోకుండా ఉంటారా..? అదెలా అవుతుంది.

శారద: మనం విడాకులు తీసుకుంటే.. మనం విడాకులు తీసేసుకుందాం అండి.

అని చెప్పి శారద ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కేపీ షాకింగ్‌ గా అలాగే నిలబడిపోతాడు. లోపలికి వెల్లి డోర్‌ వేసుకున్న శారద ఏడుస్తుంది. బయట కేపీ కూడా ఏడుస్తుంటాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!