Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర ఇంట్లో అందరూ టీవీలో వార్తలు చూస్తుంటారు. అప్పుడే వాలంటైన్స్ డే రోజు గగన్ చేసిన రికార్డు గురించి వార్తల్లో వస్తుంటుంది. గగన్ డాన్స్ చేస్తూ.. భూమి బొమ్మను గీసిన చూపిస్తుంటారు. అందరూ ఆశ్చర్యపోతారు. అపూర్వ: భూమిలా ఉంది..? నక్షత్ర: భూమిలా ఉంది కాదు.. భూమే.. కేపీ: అంటే భూమి బొమ్మ గీసింది నా కొడుకు అన్నమాట. అంటే ఎంత కాదనుకున్నా నిజం నిజం కాకుండా పోదు కదా..? గగన్ నా కొడుకేగా.. వాడు ప్రేమ చూపిస్తుంది ఎవరి మీదో కాదండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. మీ రక్తం పంచుకుని పుట్టిన మీ కూతురు భూమి మీద. అది సంతోషించే విషయమే కదా..? బావగారు గగన్ కోసం భూమి మిమ్మల్ని వదులుకుంది. నిజంగా అది బాధపడే విషయమే.. మిమ్మల్ని వదులుకుంది కదాని నా కొడుకు భూమిని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాడా అంటే అది లేదు. అసలు వాడు భూమికి దగ్గర అవుతాడా కూడా తెలియదు. ఇప్పటిదాకా భూమి ఏమైపోతుందోనని చిన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది. బావగారు ఇన్నాళ్లకు భూమి ప్రేమ గెలిచింది ఇంక భూమి మీకు దగ్గర అవ్వడం ఒక్కటే మిగిలింది. మీరా: ఆపుతారా ఇక మీ గగన్ పొగడ్తల పురాణం. కేపీ: మీరా ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను. గగన్ నుంచి అంత ప్రేమ దొరుకుతుంది మన ఇంటి ఆడపిల్లకే కదా..? చూడు.. ఏ మాటకు ఆ మాట. నా కొడుకు ప్రేమించినా పగ బట్టినా ఇలాగే ఉంటుంది. అందుకు ఇదే ఉదాహరణ. ఇక ఈ భూమ్మీద భూమిని, గగన్‌ను ఎవ్వరూ విడదీయలేరు. అని కేపీ చెప్తుండగానే.. శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అపూర్వ: తెగ మురిసిపోకు కేపీ చాలా చూశాం. భూమి, గగన్ ల ప్రేమ ఎన్నాళ్లు సాగుతుందో అది చూద్దాం.. కేపీ: బాగా మంటగా ఉన్నట్టుంది అపూర్వ… గారు.. మీరా మీ వదినకు మజ్జిగ ఇవ్వు మంట తగ్గుతుంది. భూమి, గగన్ లు ఇలాగే కలకాలం చల్లగా ఉండటం చూసి త్వరలోనే మీ వదిన పాపం పైకి పోతుందేమో..? మీరా: శివ శివ ఏంటండి ఆ మాటలు.. కేపీ: నేను అదే అంటున్నాను మీరా ఈ టెన్షన్‌తో మీ వదిన గారు శివుడిలో ఐక్యం అయిపోతారేమో..? అని చెప్తుండగానే.. సుజాత పరుగు పరుగున అమ్మాయి అమ్మాయి అనుకుంటూ బయటి నుంచి వస్తుంది. అపూర్వ: ఏమిటి..? సుజాత: అదేంటమ్మాయి అంత కోపంగా ఉన్నావేంటి..? కేపీ: గోరింటాకు ఒకసారి టీవీ చూడు.. అని చెప్పి వెళ్లిపోతాడు. సుజాత టీవీలో వస్తున్న భూమి, గగన్ ల న్యూస్ చూస్తుంది. సుజాత: గగన్ బాబు డాన్స్ చాలా బాగా చేస్తున్నారు..? అంటే అబ్బే బాగాలేదు అమ్మాయి. పిడకలను కాళ్లతో కొడుతున్నట్టు ఉంది. అది సరే కానీ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అలా పక్కకు రా అమ్మాయి. అపూర్వ: ఏంటి..? అదేంటో ఇక్కడే చెప్పు.. సుజాత: నలుగురిలో చెప్పేది కాదు. లోపలికి తీసుకెళ్లి ప్రైవేటుగా మాట్లాడాలి.. రా అమ్మాయి.. రా.. అంటే… అంటూ అపూర్వను సుజాత లోపలికి తీసుకెళ్తుంది. అపూర్వ పిన్ని ఆగు ఆగు అంటూ లోపలికి వెళ్లిపోతుంది.
ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
