MeghasandesamSerial Today Episode: గగన్‌ ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తుంటారు. శారద వడ్డిస్తుంది. పూర్ని, శివల పెళ్లి గురించి మాట్లాడుతుంది. పెళ్లికి ఎన్నో రోజులు లేవు ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. పెళ్లి మండపం బుక్‌ చేయాలి.. పెళ్లి కార్డులు ఫ్రింట్‌ చేయించాలి. అందరినీ పిలవాలి. ఇన్ని పనులు పెళ్లిలోపు అవుతాయా..? మాటొస్తుందేమోనని భయంగా ఉందిరా..? అంటుంది.

Continues below advertisement

గగన్‌: అమ్మా నువ్వు రిలాక్స్‌ గా ఉండు.. మన భూమి ఉందిగా అన్ని పనులు మన భూమే చూసుకుంటుందిలే..

భూమి: ఏంటి బావ నేను చూసుకునేది. ఇవన్నీ నాకు తెలియదు.

Continues below advertisement

గగన్‌: ఇవ్వగానే పెళ్లి పెద్దరికం సంబరపడిపోతూ తీసుకున్నావు కదా..? మరి తెలియకపోతే తెలుసుకోని నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి.

శారద: ఒరేయ్‌ భూమిని ఏడిపించింది చాలులేరా..? పెద్దరికం భూమిదే అయినా..? ఆడపిల్ల పెళ్లి తరపు వారిగా అవన్నీ మనం చూసుకోవాలి.

భూమి: అది అలా చెప్పండి అత్తయ్యా.. అప్పుడన్నా అర్థం అవుతుందా..? బావగారు.

పూర్ణి: శివ తిను..

భూమి వడ్డిస్తుంటే.. గగన్‌ మెసేజ్‌ చేస్తాడు.

గగన్‌: నీ ఫోన్‌ ఏదో మెసేజ్‌ వచ్చింది చూడు..

అని చెప్పగానే.. భూమి మెసేజ్‌ ఓపెన్‌ చేసి చూస్తుంది. అందులో భూమి, గగన్‌కు కిస్‌ ఇస్తున్న ఫోటో ఉంటుంది.

భూమి: బావ ఏంటిది..?

గగన్‌: ఇప్పుడు నాకు అన్నం కలిపి పెట్టలేదు అనుకో.. ఈ ఫోటో అమ్మ వాట్సాప్‌కు వెళ్తుంది.

భూమి: బావ ఇది టూ మచ్‌ అందరి ముందు ఎలా తినిపించాలి..?

గగన్‌: ఏమో నువ్వు పెట్టకపోతే ఆ తర్వాత మీ తమ్ముడి ఫోన్‌ కు కూడా వెళ్తుంది.

అంటూ చెప్పి గగన్‌ అన్నం తినబోతుంటే..

భూమి: బావ.. ఆగు బావ.. ఇందాక నీ వేలు డోర్‌లో పడి నలిగింది కదా..?

గగన్‌: నలిగిందా..?

భూమి: అప్పుడే మర్చిపోయావా..? నలిగింది బావ.

గగన్‌: నలిగింది..

భూమి: నేను తినిపిస్తాను.. దెబ్బ తగిలిన చేతితో తింటే చేయి మండుతుంది కదా అత్తయ్యా..? అంతే కదా..?

పూర్ణి: అవును అంతే వదిన.. అంతే..

అనగానే భూమి గగన్‌కు అన్నం తినిపిస్తుంది. శారద, పూర్ణి చూస్తూ నవ్వుకుంటారు. శివ మాత్రం డల్లుగా భోజనం  చేస్తుంటాడు. ఇంతలో శారద చేయి కడుగేసుకుంటుంది.

గగన్‌: ఏంటమ్మా అప్పుడే అయిపోయిందా..?

అని అడిగినా ఏం చెప్పకుండా శారద వెళ్లిపోతుంది.

పూర్ణి: చూశావా శివ.. మా అన్నయ్య.. మీ అక్క ఎంత అన్యోన్యంగా ఉన్నారో.. నేను కూడా నీకు తినిపించనా..?

శివ: ఏయ్‌ వద్దు వాళ్లకంటే పెళ్లి అయింది.

పూర్ణి: అయితే పెళ్లి అయ్యాక ఓకేనా..?

శివ: ఇక నాకు చాలు.. నేను తినడం పూర్తి అయిపోయింది. నేను వెళ్తున్నా..

అంటూ శివ వెళ్లిపోతాడు. తర్వాత పూర్ణి కూడా వెళ్లిపోతుంది.

భూమి: ఏంటి బావ నీ అల్లరి.. దయచేసి ఆ ఫోటో డిలీట్‌ చేయ్‌..

గగన్‌: నేను చెప్పినట్టుగా నిన్ను ఆడించే ఆ ఫోటోను అంత సులువుగా ఎలా డిలీట్‌ చేస్తాను.. ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను.

భూమి: నీ చేతి కట్‌ అయింది అని చెప్పాను కదా..? ఆ చేతితో ఎలా తినిపిస్తావు..?

గగన్: కట్‌ అవ్వలేదని నీకు తెలుసు.. నాకు తెలుసు ఈ చేత్తోనే తినిపిస్తాను..

భూమి: బావ అత్తయ్య పూరి చూస్తే ఏమనుకుంటారు బావ..

గగన్‌: అనుకుంటే అనుకోని ఐడోంట్‌ కేర్‌ కవర్‌ చేయాల్సిన బాధ్యత నీదే..

అంటూ గగన్‌ అన్నం తినిపిస్తుంటే.. భూమి తింటుంది. చాటు నుంచి శారద, పూర్ణి, శివలు చూసి నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!