Meghasandesam Serial Today Episode : శరత్‌ చంద్ర కొట్టడంతో ప్రసాద్‌ ఇంట్లోంచి బయటకు వెళ్తాడు. అపూర్వ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు హాస్పిటల్‌ నుంచి ఆఫీసుకు వచ్చిన గగన్‌, భూమి ఇద్దరూ చాంబర్‌లోకి వెళ్లాక ఇప్పుడెలా ఉందని గగన్‌ అడుగుతాడు. బాగానే ఉందని చెప్తుంది భూమి.

గగన్‌: కడుపులో పట్టినంత తినాలి. అది ఈరోజు నువ్వు నేర్చుకున్న లెసన్‌.

భూమి: ఓకే సర్‌..

గగన్‌: ఇది గుర్తు పెట్టుకుంటే నువ్వు నీ హెల్త్‌ రెండూ బాగుంటాయి.

భూమి: గుర్తు పెట్టుకుంటాను సార్‌..

గగన్‌: అడిగాను కదా అని ఈ సార్లను పొడిగించేయకు.. నేను ఇంతకు ముందు చెప్పానే అదంతా ఈ ఫైల్‌లో ఉంది. అంతా లాప్‌ టాప్‌లో సేవ్‌ చేసి పెట్టు

భూమి: ఓకే సార్‌..

 అంటూ ఫైల్‌ తీసుకుని బయటకు వెళ్తుంది. బయట ఉన్న తన ఫోన్‌ చూడగానే.. శరత్‌చంద్ర మిస్స్డ్‌ కాల్స్‌ ఉంటాయి. వెంటనే శరత్ చంద్రకు భూమి ఫోన్‌ చేస్తుంది. శరత్ చంద్ర నీతో మాట్లాడాలి అర్జెంట్‌గా ఇంటికిరా అని చెప్తాడు. దీంతో సరే అంటూ గగన్‌ దగ్గరకు వెళ్లి సార్‌ నేను అర్జెంట్‌గా ఇంటికి వెళ్లాలి మా నాన్న ఫోన్‌ చేశారు అని చెప్పి గగన్‌ వద్దంటున్నా వెళ్లిపోతుంది భూమి. ఇంతలో చెర్రి కోపంగా గగన్‌ ఆఫీసుకు వచ్చి చైర్స్‌ కింద పడేస్తాడు.

గగన్‌: రేయ్‌ ఏంట్రా ఆ ప్రెస్టేషన్‌..

చెర్రి: ప్రెస్టేషన్‌ కాదు గుండెల్లో మంట..

గగన్‌: కనీసం ఏమైందో అదైనా చెప్పరా..?

చెర్రి: ఆ శరత్ చంద్ర గాడు నాన్ను కొట్టాడు అన్నయ్య..

అంటూ ఇంట్లో జరిగింది మొత్తం చెప్తాడు చెర్రి. గగన్‌ లోపల కోపంతో రగిలిపోతుంటాడు.

చెర్రి: నాన్నను వాడు కొట్టాడు అంటే నీకేమి అనిపించడం లేదా అన్నయ్యా..? నాకైతే చంపేయాలని ఉంది వాణ్ని.

గగన్: ఏం జరిగిందిరా..?

చెర్రి: ఆ శరత్‌ చంద్ర తన భార్య చెప్పిందే నమ్ముతాడంట. మిగిలిన వాళ్ల మాటలకు ఆ ఇంట్లో విలువ లేదంట. మరీ గుడ్డిగా మీ ఆవిడ చెప్పిన మాటలే నమ్మకండి అని నాన్న అన్నందుకు కొట్టేశాడు అన్నయ్య. వాళ్లావిడను అంటే కొట్టేస్తాడా..? అన్నయ్య కనీసం చెల్లెలు భర్త అని కూడా చూడడా..? అసలేంటి అన్నయ్యా మేమేమైనా గుడ్డి గుర్రాల్లాగా ఆ ఇంట్లో పడి తింటున్నామా..? గడియారంలో ముల్లులా ఆయన వ్యాపారాలు అన్ని చూసుకుంటున్నాడు కదా..? ఏంటి అన్నయ్యా ఇప్పటికీ నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదా..? నాన్నను ఏమన్నా నువ్వు రియాక్ట్‌ అవ్వవని వాడికి తెలుసు అన్నయ్య. నువ్వు రియాక్ట్‌ అవ్వకున్నా కచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాను.

అంటూ ఆవేశంతో చెర్రి వెళ్లిపోతాడు. గగన్‌ చేతిలో పట్టుకున్న పేపర్‌ వెయిట్‌ నలిపేస్తాడు. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న ప్రసాద్‌ ఇంట్లో జరిగిన విషయం భూమికి చెప్పాలని ఫోన్‌ చేస్తే స్విచ్చాప్‌ వస్తుంది. ఇంట్లో అందరూ ఆలోచిస్తుంటారు. ఇంతలో అక్కడికి నక్షత్ర వస్తుంది.  

నక్షత్ర: గోరింటాకు ఏంటి..? నాన్నా అమ్మా చాలా సీరియస్‌గా ఉన్నారు ఏమైనా జరిగిందా..?

సుజాత: నీకు తెలియదా..? ఆ భూమి ఆ గగన్‌ గాడి ఆఫీసులో పని చేస్తుందట. వాడి దగ్గర పీఏగా చేరిందట. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. మీ నాన్న ఆ భూమిని రమ్మన్నాడు. ఇప్పుడు కానీ వాడు వస్తే ఆ భూమిని బయటకు నెట్టేస్తాడు.

అని చెప్తుండగానే.. భూమి వస్తుంది.

భూమి: ఏంటి నాన్నా ఏదో మాట్లాడాలని అర్జెంట్‌గా రమ్మన్నారు.

శరత్‌: ఎక్కడి నుంచి వస్తున్నావు..? గగన్‌ ఆఫీసుకు గగన్‌ పీఏగా వెళ్తున్నావు అని అపూర్వ అంటుంది.

అని శరత్‌ చంద్ర అడగ్గానే.. భూమి సైలెంట్‌గా ఉంటుంది. అపూర్వ, భూమి చేయి తీసి శరత్‌ చంద్ర తల మీద పెట్టి చెప్పు అని అడుగుతుంది. శరత్‌ చంద్ర కూడా చెప్పమని అడుగుతాడు.

అపూర్వ: ఆ గగన్‌ గాడితో ఇది చేతులు కలిపి నిన్ను నేల మీదకు లాగేద్దామనుకున్నారు.

భూమి: అబద్దం.. అంతా అబద్దం..

అపూర్వ: నువ్వు అవున్నన్నా కాదన్నా ఇదే నిజం.. నువ్వు ఆ గగన్‌ గాడిని ప్రేమించడం నిజం కాదు.

శరత్‌: చెప్పమ్మా భూమి నువ్వు ఆ గగన్‌ గాడిని ప్రేమిస్తున్నావా..?

భూమి: నేను గగన్‌ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను.

అని భూమి చెప్పగానే.. అక్కడే ఉన్న చెర్రి షాక్‌ అవుతాడు. బాధపడుతుంటాడు. ఇంతలో శరత్‌ చంద్ర చివరిగా ఒక్కమాట అడుగుతున్నాను నీకు ఆ గగన్‌ గాడు కావాలా..? నేను కావాలా..? అని అడగ్గానే.. భూమి డైలమాలో పడిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!