Meghasandesam Serial Today Episode: గుడిలో శివ కోసం వెతుకుతున్న పూరికి.. శివ దగ్గరి నుంచి వస్తున్న బిందు ఎదురుపడుతుంది. ఒకరినొకరు పలకరించుకుంటారు. పూరి హలో బిందు ప్రసాదం తీసుకో అని చెప్పగానే.. బిందు: ప్రసాదం అంటున్నావుగా తీసుకుంటున్నాను. దేవుడి దగ్గర కూడా పొగరు చూపించే మనస్తత్వం నాకు లేదు. పూరి: ఈ ప్రసాదం ఏంటో తెలుసా…? నాకు శివకు పెళ్లి కుదిరింది కదా ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని ప్రత్యేకంగా పూజ చేయించిన ప్రసాదం బిందు ( అని చెప్పగానే బిందు ప్రసాదం ఊసేస్తుంది) ఏయ్ ఏంటి నా పెళ్లి అనగానే ప్రసాదం చేదుగా అనిపించిందా..? బిందు: నువ్వు చెప్పిన మాటే చేదుగా అనిపించింది. ముందే చెప్పి ఉంటే అసలు ప్రసాదం తీసుకునేదాన్నే కాదు. పూరి: నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఫిక్స్ అయిన మా పెళ్లి అయితే ఆగదు కదా..? బిందు: మరీ ఓవర్ కాన్ఫిడెంట్‌కు పోకు ఫిక్స్ అయినంత మాత్రాన పెళ్లి అయిపోనట్టు కాదు. పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్లు చాలానే చూశాం.. పూరి: నువ్వు శివను ఎప్పుడైతే హగ్ చేసుకున్నావో అప్పటి నుంచి నువ్వు శివను ఇష్టపడుతున్నావని నాకు అనుమానంగానే ఉంది. ఇప్పుడు మా పెళ్లి ఆగిపోవాలన్న నీ ఉక్రోషం చూస్తుంటే.. అది నిజమేనని కన్ఫం అయింది బిందు. బిందు: అవును శివను నేను కూడా ప్రేమిస్తున్నాను. శివతోనే నా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటా..? పూరి: జరగని వాటిని అనుకోకపోడమే మెరుగు అనుకుంటాను బిందు. ఆశ పడటం తప్పు అంటాను. బిందు: తప్పొప్పులు చెప్పడానికి నువ్వు ఎవరు..? ఎవరి ఆశలు వారికి ఉంటాయి. శివతో పెళ్లి జరిపించమని నేను కూడా ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. జరుగుతుందని నువ్వు ఆశపడుతున్నావు. చూద్దాం ఎవరి ఆశ నెరవేరుతుందో..? పూరి: ఓవర్ కాన్ఫిడెంట్ నాది కాదు బిందు నీది. మనం ఇద్దరం శివను ప్రేమించినా.. మన ప్రేమలో ఒక తేడా ఉంది. శివ నేను ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. మరి నీది వన్ సైడ్ లవ్.. మరి అలాంటప్పుడు ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత శివకు ఎవరితో పెళ్లి అవుతుంది. బిందు: ప్రేమించిన వారితోనే అవుతుంది. పూరి: అంటే నాతోనే కదా..? బిందు: ఏమో శివ నన్ను ప్రేమిస్తున్నాడేమో..? నిన్ను ప్రేమిస్తున్నాడన్న భ్రమలో నువ్వున్నావేమో..? నీది భ్రమ అయినప్పుడు శివ ప్రేమిస్తున్న నాతోన కదా పెళ్లి అవుతుంది. పూరి: నీ అమాయకపు మాటలు వింటుంటే.. పెద్దగా నవ్వు వస్తుంది బిందు. రేపు శివకు నాకు పెళ్లి అయ్యాక నువ్వు పిచ్చి దానివి అయిపోతావేమోనని భయంగా కూడా ఉంది. ఎందుకైనా మంచిది ఒక మంచి డాక్టర్‌ను కలువు.. బిందు: నాది కూడా సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా మంచి డాక్టర్ ను కలువు.. శివతో నా పెళ్లి అయిపోయాక నువ్వు పిచ్చిదానివి అయిపోతే నాక్కూడా బాధగా ఉంటుంది కదా..? పూరి: చూద్దాం నీ ఓవర్ కాన్పిడెంట్ గెలుస్తుందో… శివతో నా పెళ్లి జరుగుతుందో చూద్దాం.. బిందు: తప్పకుండా చూద్దాం.. అంటూ ఒకరికి ఒకరు చాలెంజ్ చేసుకుంటారు. ఒకరినొకరు గుర్రుగా చూసుకుంటుంటే.. గుడిలో గంట మోగుతుంది. ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
మేఘసందేశం సీరియల్ టుడే ఎపిసోడ్ Meghasandesam serial today episode Image Credit: ZEE5.com
