Meghasandesam Serial Today Episode: గుడిలో ఉన్న నక్షత్ర కంగారుగా అపూర్వను పక్కకు తీసుకెళ్తుంది. అపూర్వ షాకింగ్‌గా ఏమైంది నక్షత్ర వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటే పక్కకు లాకొచ్చావు అని అడుగుతుంది. నక్షత్ర: ఆ శివ, భూమి తమ్ముడు అది నీకు అర్థం అవుతుందా..? అపూర్వ: శివ ఒక్కడే ప్రేమించలేదు.. మన బిందు కూడా ప్రేమించింది. అందుకే వీళ్ల పెళ్లి చేస్తాను అంటున్నాను. చూడు శివ.. శివరాత్రి అంటే ఆ శివపార్వతుల కళ్యాణం అని అర్థం.. ఆ కళ్యాణం జరిగే ఈ రాత్రికే బిందుకు నీకు కళ్యాణం నేను జరిపిస్తాను. అమ్మవారికి తాళిబొట్టు తెచ్చాము కదా..? ఆ తాళిబొట్టునే నువ్వు బిందు మెడలో కట్టబోయే తాళి. ఆ తాళిని నేను ఎలాగూ చేజిక్కించుకుంటాను.. ఆ మీ పెళ్లి ఏ ప్లేస్‌లో చేయాలనేది నేను చూసుకుంటాను. సరేనా..? నేను చెప్పిన చోటికి రావడమే  మీ చేతుల్లో ఉన్న పని శివ: సరే ఆంటీ మేము వస్తాము.. అపూర్వ: సరే ఈ రాత్రికి మీ పెళ్లి అయిపోయేవరకు ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండండి.. వెళ్లు.. శివ: సరే ఆంటీ.. బై బిందు.. అంటూ శివ వెళ్లిపోతాడు.. అపూర్వ: బిందు నువ్వు కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు.. వెళ్లు.. అంటూ బిందును కూడా అపూర్వ పంపిచేస్తుంది. నక్షత్ర కోపంగా చూస్తుంది. నక్షత్ర: అసలు వీళ్లకు పెళ్లి చేయడంలో నీ ప్లాన్‌ ఏంటి మమ్మీ..? అపూర్వ: నేను నీకు ఏం చెప్పాను.. ఈ శివరాత్రి పూట ఒక జంట కలుస్తుంది. ఒక జంట విడిపోతుంది అని చెప్పానా..? నక్షత్ర: అవును…అపూర్వ: మరి ఇప్పుడు బిందు శివల పెళ్లి చేస్తే.. పూరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతుంది. మరి వాళ్లిద్దరి పెళ్లి పెద్ద అయిన భూమిని ఆ గగన్‌ గాడు అసహ్యించుకుంటాడు కదా..? భూమిని వదిలేస్తాడు కదా..? అదే నా ప్లాన్‌.. నక్షత్ర: ఒ మై గాడ్‌..  వావ్‌ సూపర్‌ ప్లాన్‌.. మమ్మీ.. త్వరగా గగన్‌ బావ ఆ భూమిని వదిలేస్తే.. నేను చెర్రి గాడిని వదిలేసుకుని గగన్‌ బావకు దగ్గరైపోతాను.. అపూర్వ: సరేలే మనం ఎక్కువ సేపు ఇక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. పద వెళ్దాం.. అంటూ నక్షత్రను తీసుకుని వెళ్లిపోతుంది అపూర్వ.. అంతా దూరం నుంచి గమనిస్తున్న చెర్రి షాక్‌ అవుతాడు. అసలు నిజం ఏంటో తెలుసుకుంటాను అంటూ వెళ్తాడు.. మరోవైపు శివ దగ్గరకు వెళ్లిన బిందు హ్యపీగా ఉంటుంది. బిందు: శివ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అత్తయ్యే మన ప్రేమను అర్థం చేసుకుంది. ఏంటి శివ.. ఈరోజు మన పెళ్లి అన్న ఆనందం నీ ముఖంలో కనిపించడం లేదు.. ఏంటి శివ ఏమైంది..? ఎందుక అలా ఉన్నావు…? శివ: నేను తీసుకున్న నిర్ణయం సరైందో కాదో నాకే అర్థం కావడం లేదు.. బిందు: అదేంటి శివ అలా అంటున్నావు.. శివ: మనం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం.. మనిద్దరికి పెళ్లి అయిపోతే హ్యాపీగా ఉంటాం.. కానీ మా అక్క నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది. బిందు: అసలేం మాట్లాడుతున్నావు శివ. అసలు అర్థం కావడం లేదు.. శివ: మా అమ్మా నాన్న చనిపోయాక మా అక్కే నన్ను చూసుకుంది. అప్పుడు అక్క లెక్క కాదు.. తల్లిలా ప్రేమను పంచింది అంటూ శివ ఎమోషనల్‌ అవుతుంటే.. దూరం నుంచి అపూర్వ అంతా వింటుంది.. ఎలాగైనా శివను మార్చాలని అనుకుంటూ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! 

Continues below advertisement

మేఘసందేశం సీరియల్ టుడే ఎపిసోడ్ Meghasandesam serial today episode   Image Credit: ZEE5.com

Continues below advertisement