Meghasandesam Serial Today Episode: రాష్ట్ర స్థాయి కళా పోటీలలో భూమి, గగన్‌తో కలిసి డాన్స్‌ చేస్తుంది. డాన్స్‌ కాంపీటీషన్స్‌ లో భూమి, గగన్‌ ఫైనల్‌కు అర్హత సాధించారని అనౌన్స్‌ చేస్తారు. దీంతో గగన్‌, భూమి హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంతలో ఫైనల్‌ రౌండ్‌ ఇరవై ఆరో తారీఖును పన్నెండు గంటలకు జరుగుతుంది. అని అనౌన్స్‌ చేయగానే భూమి షాక్ అవుతుంది. పెళ్లి ఇరవై ఆరో తారీఖు పన్నెండు గంటలకు ఉంటుందన్న విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే షాక్‌ అవుతుంది. నిర్వాహకుల దగ్గరకు వెళ్తుంది.

నిర్వాహకుడు: చెప్పమ్మా భూమి ఏంటి విషయం..

భూమి: సార్‌ రేపు నా పెళ్లి సార్‌..

నిర్వాహకుడు: ఓ కంగ్రాచ్యులేషన్స్‌ రేపు రెండు అకేషన్స్‌ ఉన్నాయన్న మాట. అక్కడేమో పెళ్లి, ఇక్కడేమో కాంపీటీషన్‌ బాగుందమ్మా..?

భూమి: అది కాదు సార్‌ రేపు పెళ్లి పన్నెండు గంటలకే..ఇక్కడ కాంపీటీషన్‌ పన్నెండు గంటలకే

నిర్వాహకుడు: ఓ అయితే నువ్వు కాంపీటీషన్‌ కు రావన్నమాట. అయితే కావ్యనే ఫైనల్‌ విన్నర్‌.

భూమి: అలా అనకండి సార్‌ డాన్స్‌ అకాడమీ మా అమ్మ కల సార్‌ నేను ఎలాగైనా కాంపిటీషన్‌ లో పార్టిసిపేట్‌ చేయాలి సార్‌. ఫ్లీజ్‌ సార్‌ ఈ కాంపిటీషన్‌ టైమింగ్‌ కొంచెం మార్చండి సార్‌ కుదిరితే ఎల్లుండికి పోస్ట్‌పోన్‌ చేయండి సార్‌..

నిర్వాహకుడు: ఏంటి నీ పెళ్లే పోస్ట్ పోన్‌ చేసుకోవచ్చు కదా..?

భూమి: ఎలా సార్‌ ఆఖరి నిమిషంలో పెళ్లి పోస్ట్‌ ఫోన్‌ చేస్తే.. లేనిపోని అపర్థాలన్నీ వస్తాయి. అబ్బాయి తరపు వాళ్లు అమ్మాయి గురించి.. అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి గురించి ఎలా మాట్లాడుకుంటారో మీకు తెలియంది కాదు.

నిర్వాహకుడు: కావొచ్చు అలా అని కాంపీటీషన్‌ డేట్‌ మార్చడం కుదరదు.

భూమి: అలా అనకండి సార్‌ మీకు దండం పెడతాను.

నిర్వాహకుడు: దండం పెట్టడంతోనో దండకం చదవడంతోనో మనం అనుకున్నవన్నీ అయిపోవు భూమి. అయినా నువ్వు శోభాచంద్ర కూతురినే అన్నావు. మీ అమ్మగారు నాట్యం కోసం ప్రాణాన్నే త్యాగం చేశారు. ఏ నువ్వు పెళ్లిని వదులుకోలేవా..?

నిర్వాహకుడు 2: ఏవండి ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నారు. భూమి డేట్‌ మార్చమని అడగడానికే కదా ఇక్కడకు వచ్చింది. తను ఏ పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చిందో ఏం తెలుస్తుందండి. చూడమ్మా భూమి ఈ డేట్‌ మార్చడం మా వల్ల కాదమ్మా.. అది గవర్నమెంట్‌ జీవో కాబట్టి మేము దాన్ని ఫాలో అవడం తప్పా మార్చలేము అమ్మా.. నీ విషయంలో మేము నీకు ఏ సాయం చేయలేవమ్మా.. సారీ

అని చెప్పి వెళ్లిపోతారు. భూమి బాధపడుతూ అక్కడే ఉండిపోతుంది. ఇంతలో గగన్‌ వస్తాడు. భూమిని తీసుకుని వెళ్లిపోతాడు. బాధతో ఇంటికి వెళ్లిన భూమి శరత్ చంద్ర దగ్గరకు వెళ్తుంది.

శరత్‌: ఏంటమ్మా భూమి అలా ఉన్నావు..?

భూమి: నాన్నా రేపు నా పెళ్లి పన్నెండు గంటలకు.. డాన్స్‌ కాంపిటీషన్‌ ఫైనల్‌ రౌండ్‌ కూడా పన్నెండు గంటలకే.. మీరు ఏదైనా చేయండి నాన్నా..

శరత్‌: ఇందులో నేను చేయడానికి ఏముంటుంది అమ్మా మనకు డాన్స్‌ కాంపిటీషనే ముఖ్యం.

భూమి: రేపు నా పెళ్లి సంగతి ఏంటి నాన్నా..?

శరత్‌: అమ్మా ముఖ్యమా..? మధ్యలో వచ్చిన మనిషి ముఖ్యమా అంటే ఏం చెప్తావు.. ఒక గోల్‌  మనం పెట్టుకున్నప్పుడు దానికి ప్రేమ పెళ్లి లాంటి ఆటంకాలు ఏవీ రాకూడదు. రేపు నువ్వు డాన్స్‌ కాంపిటీషన్‌ కే వెళ్తున్నావు

అని చెప్తాడు శరత్‌ చంద్ర.. భూమి ఏడుస్తూ పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడుతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!