Meghasandesam Serial Today Episode: బిందును పిలిచి అపూర్వ కొడుతుంది. ఇంట్లోకి వచ్చింది ఎవరే అని అడుగుతుంది. దీంతో బిందు ఏడుస్తుంటే.. అపూర్వ, మీరా, సుజాత కోపంగా చూస్తుంటారు.

Continues below advertisement

అపూర్వ: చెప్పవే ఎవరే అది

బిందు: మీరు కొట్టినా తిట్టినా నిజమే చెప్తున్నా అత్తయ్యా.. నేను వద్దనుకుని పడేసిన పట్టీలు తను పట్టుకుని వెళ్తానంటే ఇచ్చాను అత్తయ్య.. మరి బట్టలకు బదులు పుస్తకాలని ఎందుకు అబద్దం చెప్పిందో నాకు అర్థం కాలేదు అత్తయ్యా.. బహుశా బట్టలు అంటే మీరు తీసుకెళ్లనివ్వరని భయపడి అబద్దం చెప్పిందేమో అత్తయ్యా..

Continues below advertisement

అపూర్వ: మరి ముఖం చూపించకుండా ఎందుకే పరుగెత్తింది.

బిందు: అది కూడా నాకు తెలియదు అత్తయ్య.. నా దగ్గర ఫోటో ఉంది కావాలంటే చూపిస్తాను. కాలేజీకి వెళ్లి ఎంక్వైరీ చేయోచ్చు అత్తయ్య..

అపూర్వ: నువ్వు చెప్పేది అబద్దం అని నా బలమైన నమ్మకమే..? అయినా సరే నువ్వు చెప్పిన ఆ అబద్దాన్ని నిజం అని నమ్ముతున్నాను.. ఎందుకంటే ఈరోజు మీరు చేసిన తప్పును మరోకసారి జరగనివ్వను. నీ పేరు చెప్పి ఈ ఇంటికి ఎవరు వచ్చినా సరే లోపలికి రానివ్వను.. నిన్ను కలవనివ్వను.. మీరా అర్థం అయిందిగా ఇక ప్రతి క్షణం దీని మీద ఒక కన్నేసి ఉంచు.. ఇబ్బంది పడినా పర్వాలేదు. తీసుకెళ్లు..

బిందు: అత్తయ్యా..?

మీరా: పద బిందు..

అంటూ బిందును తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది మీరా. అపూర్వ కోపంగా చూస్తుంది. మరోవైపు డీజీపీ ఆఫీసుకు వెళ్లి గగన్‌ కేసు విషయంలో వీడియో చూపిస్తుంది భూమి. ఎస్పీ సూర్య కావాలనే నాటకం ఆడి గగన్‌ను అరెస్ట్‌ చేశాడని డీజీపీకి కంప్లైంట్‌ చేస్తుంది. దీంతో వీడియో చూసిన డీజీపీ ఎస్పీ సూర్యను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆర్డర్ ఇస్తాడు. అలాగే గగన్‌ వెంటనే విడిచిపెట్టమని చెప్తాడు. దీంతో గగన్‌ దగ్గరకు వెళ్తున్న భూమి, కేపీలను మధ్యలో అడ్డగిస్తాడు సూర్య.

సూర్య: భూమి నన్ను సస్పెండ్‌ చేయించి గెలిచానని అనుకోకు… ఒక విధంగా నేను సస్పెండ్‌ కావడమే నాకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్పీడుగా గగన్‌ను టార్గెట్‌ చేస్తాను. ఎప్పటికైనా గగన్‌ మీద రివేంజ్‌ తీర్చుకుంటాను.

భూమి: సార్‌ నాకు పోలీసుల మీద చాలా గౌరవం, నమ్మకం ఉంది. అది మీ వల్ల చెడిపోకూడదని కోరుకుంటున్నాను.. అయినా మీరంటే కూడా గౌరవం ఉంది. కానీ మీరు అనవసరంగా మా వారిని టార్గెట్‌ చేశారు. నిజానిజాలు ఏంటో తెలుసుకోండి.

సూర్య: నువ్వు చెప్తే తెలుసుకునేంత అమాయకుడని ఏం కాదు భూమి..

అంటూ సూర్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కేపీ, భూమి  స్టేషన్‌కు వెళ్లి గగన్‌ తీసుకురమ్మని ఎస్సైని అడుగుతుంది. కానిస్టేబుల్స్‌ వెళ్లి గగన్‌ను తీసుకొస్తారు. దెబ్బలతో నడవలేని స్థితిలో ఉన్న గగన్‌ను చూసి భూమి ఏడుస్తుంది. తన భుజాల మీద తీసుకుని ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ శారద చూసి ఏమైందని కంగారుపడుతుంటే చిన్న యాక్సిడెంట్‌ అని చెప్పి రూంలోకి తీసుకెళ్లి గగన్‌కు ఫస్ట్‌ ఎయిడ్‌ చేస్తుంది భూమి. గగన్‌ మాత్రం సైలెంట్‌ గా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!