MeghasandesamSerial Today Episode: శరత్‌ చంద్ర ముందు తనను పూల్‌ను చేశావని అపూర్వ కోపంగా నక్షత్రను కొడుతుంది. చెర్రికి భయపడి నిజం దాస్తున్నావా..? అంటూ తిడుతుంది. వాడికి భయపడ్డప్పుడే నువ్వు నా కూతురుగా చనిపోయావు అంటూ పీక పట్టి పిసికేస్తుంటే.. నక్షత్ర నిజం చెప్తాను అంటుంది. తాను చెర్రిని లోయలో తోసేసినప్పటి వీడియో చెర్రి దగ్గర ఉందని అది చూపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని చెప్తుంది.

Continues below advertisement

నక్షత్ర: అప్పటి నుంచి ప్రతి క్షణం నేను వాడికి భయపడక తప్పలేదు మమ్మీ. వీడు చెప్పినట్టల్లా ఆడక తప్పలేదు. తప్పితే అయితే డాడీ చేతుల్లో చావు. లేదంటే జైలు.. ఆ భయంతోనే నిన్ను ఎన్నోసార్లు బాధపెట్టాల్సి వచ్చింది మమ్మీ. ఈ రోజు కూడా డాడీతో నిన్ను ఇన్ని మాటలు అనిపించాల్సి వచ్చింది కూడా ఆ భయంతోనే మమ్మీ..

అపూర్వ: ఏరా నా ఇంట్లో పెరిగి నా ఇంటి ఉప్పే తిని నా కూతురినే బ్లాక్‌మెయిల్‌ చేసేంత మొనగాడివి అయిపోయావురా..?

Continues below advertisement

చెర్రి: అంటే అత్తయ్యా అది అలా అయిపోయింది. చేసింది తప్పే..

అపూర్వ: సరే ఇంకెప్పుడూ ఇలాంటి వేషాలు వేయకు. ఎందుకంటే ఇప్పుడు క్షమించినట్టు ప్రతిసారి నిన్ను క్షమించకపోవచ్చు అర్థం అయిందా..?

చెర్రి: ఆ అర్థం అయింది అత్తయ్యా..

అపూర్వ: ఏది ఆ కెమెరా ఇవ్వు..

చెర్రి: సరే అత్తయ్యా..

అంటూ చెర్రి రూంలోకి వెళ్లి కెమెరా తీసుకుని వచ్చి అపూర్వకు ఇస్తాడు. కెమెరా తీసుకున్న అపూర్వ కోపంగా చూస్తుంది.

అపూర్వ: ఈ కెమెరానేనా..? ఈ కెమెరా చూపించే నా బేబీని అంత బెదిరించావు. ఈ కెమెరానే కదా నీకు అంత ధైర్యం ఇచ్చింది.

చెర్రి: అత్తయ్యా అదే ఆ కెమెరా ఇటు ఇవ్వండి..

అని అడుగుతుండగానే అపూర్వ కెమెరాను కింద పడేసి పగులగొడుతుంది. కాలితో తన్నుతుంది.

చెర్రి: బంగారం లాంటి కెమెరాను ఎందుకు ముక్కలు చేస్తున్నారు అత్తయ్యా..? సారీ చెప్పాను కదా..?

అపూర్వ: ఇది నీ కెమెరా కాదురా..? నువ్వు నిన్ను ఇలా ముక్కలు ముక్కలుగా తొక్కి చంపేయాలని ఉంది.

సుజాత: అమ్మాయి అమ్మాయి నాకు ఒక్క చాన్స్‌ ఇవ్వు అమ్మాయి. ఆ కెమెరా ముక్కలను తొక్కి తొక్కి చంపేస్తాను.

అపూర్వ: కానీ.. తొక్కేయ్‌..

సుజాత: ( కెమెరాను తొక్కుతుంది) ఎంత బలుపురా చెర్రి నీకు.. తొక్కేశాను..

అపూర్వ: బేబీ ఇక నువ్వు వీడికి అసలు భయపడాల్సిన అవసరం లేదు.

నక్షత్ర: ప్రాబ్లమ్‌ ఇంత సింపుల్ గా సాల్వ్ అవుతుందని తెలిసి ఉంటే నీకు ఇంతకు ముందే చెప్పుండేదాన్ని మమ్మీ.

అపూర్వ: ఇట్స్‌ ఓకే ఇప్పుడే ఏమైంది.. ఇన్నాళ్లు వీడి చేతిలో నువ్వు అనుభవించిన  టార్చర్‌ కు కసితీరా వీణ్ని చావ గొట్టు.

నక్షత్ర: వావ్‌ వాట్‌ ఏ గ్రేట్‌ ఆఫర్‌ మమ్మీ..

చెర్రి: అత్తయ్యా నేను సారీ కూడా చెప్పాను.. ఇది ఇక్కడితో వదిలేద్దాం.. కావాలంటే ఇక ఇలాంటి తలతిక్క పనులు నేను అసలు చేయను.

అపూర్వ: చేయకుండా ఉండాలంటే నొప్పి తెలియాలి చెర్రి. ఆ నొప్పి తెలిసినప్పుడే ఇలాంటి నొప్పి ఇంకెప్పటికీ వద్దనిపిస్తుంది. బేబీ..

అని చెప్పగానే.. నక్షత్ర, చెర్రిని కొట్టడానికి వెళ్తుంది. చెర్రి ఫ్లీజ్‌ నక్షత్ర వద్దు.. అంటూనే తిరిగి చెర్రి కోపంగా నక్షత్రను కొడతాడు. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!