MeghasandesamSerial Today Episode: బయట పార్టీ నుంచి ఇంటికి వస్తారు చెర్రి, నక్షత్ర. బాగా టైడ్‌ అయిపోయాను అని నక్షత్ర చెప్పగానే.. చెర్రి వెటకారంగా చూస్తాడు. ఏంటి అంటాడు. అదే నేను టైడ్‌ అయిపోయాను అంటుంది నక్షత్ర. నువ్వు టైడ్‌ అయితే ట్యూబ్‌ అయ్యానా..? నేను టైడ్‌ అయ్యానులే కానీ పద లోపలికి అనగానే.. భర్త వెనకాలే భార్య నువ్వు ముందు పద అంటుంది ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు.

Continues below advertisement

చెర్రి: ఏంటో కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది. నక్షూ కొంచెం టీ పెట్టుకుని తీసుకురామ్మా..?

నక్షత్ర: ఇప్పుడే కదా చెర్రి బాగా టైడ్‌గా ఉన్నానని చెప్పాను. అంత తలనొప్పిగా ఉంటే ఆ టీ నువ్వే పెట్టుకుని నాక్కూడా కాస్త ఇవ్వు..

Continues below advertisement

చెర్రి: ఏంటి ఏంటి..? నేను టీ పెట్టి ఇవ్వాలా..?

నక్షత్ర: ఏం ఇస్తే తప్పేంటి..? ఇంతకుముందు చెప్పు కింద తేలులా ఉన్నావు. ఇప్పుడు తలపై పడిన రాయిలా తయారయ్యావు.

చెర్రి: ఏం కూశావే..

అంటూ చెర్రి నక్షత్రను కొడతాడు. నక్షత్ర కోపంగా చెర్రి అంటుంది. ఆ ఏంటో నువ్వు మర్చిపోతున్నట్టు ఉన్నావే నిన్న మొన్నటి గతాన్ని అంటూ మళ్లీ కొట్టబోతుంటే.. అపూర్వ చూసి గట్టిగా చెర్రి అంటూ వెళ్లి కొడుతుంది. ఇంతలో అందరూ వస్తారు అపూర్వను ఆపేస్తారు.

అపూర్వ: అసలు నీకు అర్థం కావడం లేదు బావ. వీళ్లవి మనం పడేసిన ఎంగిలి బతుకులు.

కేపీ: అపూర్వ ఏం మాట్లాడుతున్నారు. మాటలు మర్యాదగా రాని..

అపూర్వ: ఏంటి మీకిచ్చే మర్యాద. ఏం నా మాటలు నిజం కాదు..

శరత్‌: అపూర్వ కేపీ మాటే నా మాట కూడా నీ మాట మర్యాద దాటేసింది. నీ ఆవేశం హద్దులు దాటుతుంది. కేపీ నా చెల్లెలు భర్త. చెర్రి తన కొడుకు ఒకప్పుడు మన ఇంటి  మేనల్లుడు. ఇప్పుడు మన ఇంటి అల్లుడు.

అపూర్వ: ఇదే బావ ఈ మంచి తనమే మన ఇంటినే ముంచేసే మనుషులుగా వీళ్లను మారుస్తుంది బావ. నువ్వు నాకు ఒక మాట చెప్పు. నీకు మన కూతురు నక్షత్ర ఎక్కువ. లేకపోతే మన మేనల్లుడు చెర్రి ఎక్కువ..? ఇద్దరూ సమానం అని మాత్రం చెప్పకు. సూటిగా కళ్లల్లోకి చూస్తూ ఇద్దరిలో ఎవరు ఎక్కువో చెప్పు బావ.

సుజాత: బాగా అడిగావు అమ్మాయి. త్వరగా చెప్పేయండి అల్లుడు గారు.

శరత్: అసలు ఏమైంది అపూర్వ.

అపూర్వ: చూశావా.. బావ. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేక తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావు.. బావ కన్నవాళ్లకు ఎవరికైనా సరే కన్న పిల్లల కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు.

సుజాత: బాగా చెప్పావు అమ్మాయి.

శరత్‌: ముందు ఏం జరిగిందో అది చెప్పు అపూర్వ..

అపూర్వ: ఇంకా ఎం కావాలి బావ. అసలు ఈ చెర్రి గాడు మన నక్షత్ర మెడలో చెప్పకుండా తాళి కట్టినప్పుడే వీడి చేతులు నరకాల్సింది. నువ్వేమో ఉపేక్షించావు. ఇప్పుడు అవే చేతులు మన నక్షత్రను కొడుతున్నాయి బావ.

శరత్: ఏరా చెర్రి నా కూతురు మీద చేయి చేసుకున్నావా..?

చెర్రి: నేనా మామయ్య నక్షత్రను కొట్టడమా..? నక్షూ నేను నిన్ను కొట్టానా..?

అపూర్వ: చెప్పవే.. చెప్పు వాడు నిన్ను కొట్టాడుగా..?

చెర్రి: చెప్పు నక్షత్ర లేకపోతే అందరూ నేను నిన్ను కొట్టాను అనుకుంటారు.

అపూర్వ: చెప్పవే.. చెప్పు..

నక్షత్ర: ఆయన నన్ను కొట్టలేదు డాడీ.. ఆయన ప్రేమకు ఆయన నన్ను చూసుకుంటున్న విధానానికి నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి డాడీ. అది చూసి మమ్మీ కొట్టాడనుకుని అపోహ పడుతుంది.

అపూర్వ: ఓసేయ్‌ నీకు ఏమైందే..? ఆ చెర్రి గాడు నీకు ఏం మందు పెట్టాడే..?  బావ అబద్దం బావ.. అసలు ఆ చెర్రి గాడు మన నక్షత్రను ఒక్కసారి కాదు రెండు సార్లు కొట్టాడు. ఇది అబద్దం ఆడుతుంది బావ.

నక్షత్ర: మమ్మీ నేనెందుకు అబద్దం ఆడతాను మమ్మీ. నువ్వే అబద్దం ఆడుతున్నావు. నువ్వు డాడీని ఎంత బాగా చూసుకుంటావో నన్ను అంత బాగా చూసుకుంటున్నారు. నువ్వు డాడీని ఎంతలా ప్రేమిస్తున్నావో ఆయన నన్ను అంతలా ప్రేమిస్తున్నారు మమ్మీ. అలాంటి ఆయన నన్ను ఎందుకు కొడతారు మమ్మీ

అని నక్షత్ర చెప్పగానే.. చెర్రి కూడా మొదటి నుంచి నేను మీకు అల్లుడు కావడం అత్తయ్యకు ఇష్టం లేదు మామయ్య.. అని చెప్పగానే.. అపూర్వ కోప్పడుతుంది. దీంతో అపూర్వను శరత్‌ చంద్ర తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!