Meghasandesam Serial Today Episode: తల నొప్పిగా ఉందని హాల్లో కూర్చుని ఉంటుంది అపూర్వ. ఇంతలో హలో అత్తయ్యా అంటూ చెర్రి వస్తాడు. చెర్రిని చూసిన సుజాత ఇదిగో అమ్మాయి నీ ఇంకో తల నెప్పి వస్తుంది అంటుంది చూస్తున్నానులే పిన్ని అంటుంది అపూర్వ. ఇంతలో చెర్రి దగ్గరకు వస్తాడు.

Continues below advertisement

చెర్రి: అబ్బబ్బా.. ఒళ్లంతా ఒకటే నొప్పి గోరింటాకు.

సుజాత: బాబు పార పలుగు పట్టుకుని కూలికి వెళ్లి వచ్చిన కూలోడిలాగా అలా మాట్లాడతావేంటి..? బాబు రాత్రి సుఖంగా పడుకుని ఉదయాన్నే లేచినంత మాత్రానా ఒళ్లంతా నొప్పులు వస్తాయా ఏంటి..?

Continues below advertisement

చెర్రి: పెళ్లి అయిన వాళ్లకు తెలుస్తాయి గోరింటాకు. నొప్పులు ఎప్పుడు ఎలా వస్తాయనేది. నీకు పెల్లి కాలేదు కదా..?

సుజాత: అంటే రాత్రి నువ్వు మా బేబీ..

చెర్రి: అయినా ఇంకా మీ బేబీ ఏంటి గోరింటాకు.. మీ బేబీ నా భార్య. భార్యాభర్తల మధ్య ఏమేం జరగాలో అన్ని జరుగుతున్నాయి.

అని చెర్రి చెప్పగానే.. అపూర్వ షాక్‌ అవుతుంది. ఇంతలో నక్షత్ర కాఫీ తీసుకుని వస్తుంది.

సుజాత: రామ్మా నక్షత్ర రా.. మీ అమ్మకు తగులుతున్న స్ట్రోక్ కు ఈ కాఫీ చాలా అవసరం.

నక్షత్ర: గోరింటాకు మా మమ్మీకో నీకో తేలేదు..  మా వారికి తీసుకొచ్చాను. తీసుకోండి..

చెర్రి: థాంక్యూ బంగారం..

సుజాత, అపూర్వ షాక్‌ అవుతారు. కాఫీ తాగి ఊసేస్తాడు చెర్రి.

నక్షత్ర: అయ్యో ఏమైందండి కాఫీ బాగా పెట్టలేదా..?

చెర్రి: చప్పగా ఉంది షుగర్‌ వేశావా..?

నక్షత్ర: మర్చిపోయానండి.. ఉండండి ఇప్పుడే వేసుకుని తీసుకుని వస్తాను.

అంటూ కాఫీ తీసుకుని నక్షత్ర కిచెన్‌లోకి వెళ్తుంది.

సుజాత: అమ్మాయి తాగిన కాఫీ కప్పును కూడా కిచెన్‌ సింక్‌లో వేయని మీ అమ్మాయి. చెర్రికి కాఫీ పెట్టుకుని వచ్చింది అమ్మాయి. చెర్రి కోప్పడుతుంటే తిరిగి భయపడపతుంది అమ్మాయి.

అపూర్వ: చూస్తున్నాను కదా పిన్ని.. తగిలిన గాయాన్నే మల్లీ నీ మాటలతో ఎందుకు గెలుకుతావు.

ఇంతలో మళ్లీ కాఫీ తీసుకుని వస్తుంది నక్షత్ర..

నక్షత్ర: ఇప్పుడు తాగండి..

చెర్రి: ఆహా సూపర్‌.. ఇప్పుడు కాఫీ అదిరిపోయింది.

నక్షత్ర: థాంక్యూ అండి..

చెర్రి: చూశావా.. ఇన్నాళ్లు మనం షుగర్‌ లేని కాఫీలా ఉండేవాళ్లం. కానీ ఈ షుగర్‌ వేశాక ఎంత బాగుందో అంత బాగున్నావు

నక్షత్ర: అవునా అండి..

చెర్రి: అవును బేబీ వేడి నీళ్లతో స్నానం చేయాలి గీజర్‌ ఆన్‌ చేశావా..?

నక్షత్ర: చేశాను అండి మీకు టిఫిన్‌ ఏం చేయమంటారు.

చెర్రి: నువ్వు ఇక్కడ టిఫిన్‌ చేస్తే అక్కడ నా వీపు ఎవరు రుద్దుతారు బంగారం..

నక్షత్ర: అవును కదూ మర్చేపోయాను సరే పదండి..

అనగానే.. అపూర్వ అయ్యో అనుకుంటూ చెవులు మూసుకుంటుంది. చెర్రి, నక్షత్ర అక్కడి నుంచి వెల్లిపోతారు. తర్వాత శరత్ చంద్ర ఇంటికి భూమి వస్తుంది. భూమిని చూసిన శరత్ చంద్ర కోపంగా మళ్లీ ఎందుకు వచ్చావని ఇంట్లోంచి వెల్లిపోమ్మని తిడతాడు. అదేమీ పట్టించుకోకుండా భూమి ప్రేమగా శరత్‌చంద్రతో మాట్లాడుతుంది. శివకు పూరికి నిశ్చితార్థం చేస్తున్నామని శివ తరపున తాంబూలాలు తీసుకోవడానికి మీరు పిన్ని రావాలి అని చెప్తుంది. దీంతో శరత్‌ కోపంగా తిట్టగానే.. అపూర్వ వచ్చి నిశ్చితార్థానికి వెళ్దాం బావ అని చెప్తుంది. అపూర్వ చెప్పడంతో శరత్‌ చంద్ర కూడా ఒప్పుకుంటాడు. అయితే అంతా విన్న బిందు మాత్రం రూంలోకి వెళ్లి ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!