Meghasandesam Serial Today Episode :  రూంలో ఉన్న శరత్‌చంద్ర దగ్గరకు భోజనం తీసుకుని వెళ్తుంది భూమి. భోజనం చేయకుండా ఇక్కడున్నారేంటి ..? నాన్నా సరే ఇక్కడికే తీసుకొచ్చాను తినండి అంటుంది. వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అంటాడు శరత్‌చంద్ర.

భూమి: ఏంటి నాన్నా ఎందుకు అలా ఉన్నారు..? ఏం ఆలోచిస్తున్నారు..?

శరత్‌: ఎలా చెప్పనమ్మా చెప్పడానికి నోరు రావడం లేదు వదిలేసేయ్‌.

భూమి: ఈ కూతురు దగ్గరే దాస్తున్నారా..? సర్లేండి చెప్పొద్దు.. మీ బాధను మీలోనే దాచుకోండి.. నా ఆకలిని నాలోనే దాచుకుంటాను.. ఈ పూట నేను కూడా తినను.

శరత్‌: ఏంటి నువ్వు ఇంకా భోజనం చేయలేదా..?

భూమి: తినలేదు.. మీరు తిన్నాక తిందామని వెయిట్‌ చేస్తున్నాను..

శరత్‌: నా మనసులో బాధ చెప్పకపోతే నువ్వు కూడా తినను అంటున్నావు అంతేనా..?

భూమి: అవును నాన్నా..

శరత్‌: ఏం చెప్పను అమ్మా..? నీకు ఎదురు కాబోయే సంతోషాన్ని తలుచుకుని ఈరోజు నేను బాధపడుతున్నాను అని చెప్పాలా..?

భూమి: ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి నాన్నా..?

శరత్‌: అది కాదమ్మా.. రేపు నా కూతురువి అయిపోతున్నావని ఇంత ఆనంద పడిపోతున్నాను కదా..? నీ కన్నవాళ్లు వచ్చి నిన్ను తీసుకెళ్లిపోతే నా పరిస్థితి ఏంటని ఆలోచన వచ్చింది. ఆ ఒక్క ఆలోచనతో మనసంతా దిగులు వచ్చేసింది.

భూమి: అయ్యో నాన్నా మీరే నా సంతోషం. మీరే నా నాన్నా.. మీరు దిగులు పడినట్టు రేపు నా కన్నవాళ్లు వచ్చినా..? మీ తర్వాతే వాళ్లు.. మాటిస్తున్నాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లను.

శరత్‌: నిజమా..? అమ్మా..

భూమి: నా మాట మీద నమ్మక లేదా..? నాన్నా.. సరే అయితే మీలో సగం అయిన.. నా ప్రాణానికి ప్రాణమైన శోభా చంద్ర అమ్మ మీద ఒట్టు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లను.

శరత్‌: చాలమ్మా ఈ మాట చాలు.. ధైర్యంగా ఉంటాను.

భూమి: అయ్యో నాన్నా.. ఏంటిది చిన్నపిల్లాడిలా ఫస్ట్‌ మీరు భోజనం చేయండి.. ఇదిగోండి.. ఆ.. లేదు లేదు.. మీరు చిన్నపిల్లాడు.. నేను మీ అమ్మను నేను తినిపిస్తాను.. మీరు తినాలి.

శరత్‌: అలాగే..

అనగానే భూమి అన్నం కలిపి శరత్ చంద్రకు తినిపిస్తుంది. వెనక నుంచి వచ్చిన సుజాత చూసి షాక్‌ అవుతుంది. అమ్మ బాబోయ్‌ ఈ పిల్లేంటి షాకుల మీద షాకులు ఇస్తుంది. అసలు ఈ షాకులు తీసుకోవాల్సింది అసుర అపూర్వ కదా.. వెళ్లి వెంటనే తీసుకొచ్చేద్దాం అని వెళ్లిపోతుంది.

భూమి: ఏమైంది నాన్నా కారంగా ఉందా..?

శరత్‌: లేదమ్మా.. నిన్ను చూస్తుంటే.. నా శోభను చూసినట్టు ఉంది. అదే ప్రేమ, అదే మమకారం. నా శోభ బతికి ఉన్నప్పుడు నన్ను ఇలాగే కూర్చోబెట్టి గోరు ముద్దులు తినిపించేది. నన్ను చిన్నపిల్లాడిలా చూసుకునేది. నేను అన్నం తినకపోతే తను విలవిలలాడిపోయేది. నువ్వు అచ్చం మా అమ్మలా కనిపిస్తున్నావు అమ్మ.

భూమి: మీరు తినండి నాన్నా..

అని తినిపిస్తుంటే.. వెనక నుంచి సుజాత అపూర్వను తీసుకొచ్చి భూమి అన్నం తినిపించడం చూపిస్తుంది. అది చూసిన అపూర్వ కోపంతో రగిలిపోతుంది. తర్వాత అందరూ వచ్చి భోజనం చేస్తారు. ఇంతలో చెర్రి బాధగా ఇంటికి వస్తాడు. చెర్రిని చూసిన భూమి దగ్గరకు వెళ్తుంది.

భూమి: చెర్రి ఎక్కడికి వెళ్లావు.. అందరూ భోజనం  చేశారు. నీకు వడ్డించమంటావా..?

చెర్రి: పెద్దమ్మ వాళ్ల ఇంట్లో తినేసి వచ్చాను మువ్వా..?  

భూమి: మీ అన్నయ్య వాళ్ల ఇంటికి వెళ్లావా..? మీ అన్నయ్య ఎలా ఉన్నారు.

చెర్రి: అసలు ఈ ప్రశ్న నువ్వు అడగకుండా ఉండాల్సింది. బాగానే ఉన్నారని చెబితే నేను అబద్దం ఆడి ఆత్మవంచన చేసుకున్నవాడిని అవుతాను. నువ్వు దక్కవని తెలిసినా..? నిన్ను తప్పా ఎవ్వరినీ చేసుకోను అంటున్నాడు

అని చెర్రి చెప్పగానే భూమి బాధపడుతుంది. గగన్‌ను రాయిలా మార్చింది నేనే.. మళ్లీ మనిషిలా మార్చాల్సింది నేనే అని మనసులో అనుకుంటుంది.  పక్కకు వెళ్లి గగన్‌కు ఫోన్‌ చేసి ఐలవ్యూ చెప్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!