MeghasandesamSerial Today Episode: చనిపోయిన చెర్రి దెయ్యం అయ్యాడని సుజాత, నక్షత్ర భయపడుతూ వెళ్లి అపూర్వకు చెప్తారు. మీకు ఎక్కడ కనిపించాడని అడుగుతుంది. దీంతో రూంలో ఉన్నాడని చెప్తారు. కోపంగా అపూర్వ రూంలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ ఎవ్వరూ కనిపించరు.

అపూర్వ: ఏడి ఎక్కడ వాడు..

సుజాత: అయ్యయ్యో వాడు వీడు అనకు అమ్మాయి. ఇప్పుడు చెర్రి బాబు ఆత్మ అయ్యారు. ఆయన గారికి పవర్స్‌ కూడా వచ్చేశాయి. కోపం వస్తే మన రక్తాన్ని కొబ్బరి నీళ్లు పీల్చినట్టు స్ట్రా వేసుకుని పీల్చేస్తారు.

అపూర్వ: కాస్త అపుతావా పిన్ని.. వాడు ఆత్మ అయ్యాడన్న భయంతో వాడి మీద ఎక్కడా లేని గౌరవ మర్యాదలు తన్నుకొస్తున్నాయి.

సుజాత: నువ్వేనా చెప్పవే..?

అపూర్వ: సరే వాడు నువ్వు అనుకున్నట్టు ఆత్మే అనుకుందాం. సరే ఎక్కడా ఎక్కడ వాడు. ఎక్కడున్నాడు.

అంటూ అడుగుతుంటే అప్పుడే వాష్‌ రూం డోర్‌ సౌండ్‌ అవుతుంది.

సుజాత: అదిగో అమ్మాయి అదిగో చెర్రి బాబు ఆత్మ వాష్‌ రూంలోకి వెళ్లింది.

నక్షత్ర: అవును మమ్మీ ఇప్పటి వరకు బ్లడ్‌తో భోజనం చేశాడు కదా..? ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లినట్టు ఉన్నాడు.

అపూర్వ: అయ్యో ఎక్కడైనా ఆత్మలు వాష్‌రూంలోకి వెళ్తావా..?

సుజాత: ఎందుకు వెళ్లవు అమ్మాయి. ఇప్పటి వరకు ఏ కథలోనూ ఏ సినిమాలోనూ ఏ రచయిత కనిపెట్టి ఉండకపోవచ్చు. కనిపెట్టినా..? చెప్తే బాగుండదని వదిలేసి ఉండొచ్చు.. బ్లడ్‌ తాగే ఆత్మకు జీర్ణశక్తి ఉండదా..? కాలకృత్యాలు తీర్చుకోవా..?

నక్షత్ర: లాజిక్కే కదా మమ్మీ..

అపూర్వ: సరే అది చూద్దాం.. రండి

అంటూ ఇద్దరిని వెంటబెట్టుకుని వాష్‌ రూం దగ్గరకు మెల్లగా వెళ్తుంది అపూర్వ. నక్షత్ర, సుజాత భయంతో వణికిపోతుంటారు. వాష్‌ రూంలో వాటర్‌ సౌండ్‌ వినిపిస్తుంది.

నక్షత్ర: మమ్మీ అదిగో మమ్మీ ప్లష్‌ చేస్తున్నాడు. వాష్‌ రూం యూస్‌ చేసుకుంటున్నాడు.

సుజాత: అవును అమ్మాయి వెనక్కి వచ్చేయ్..

అపూర్వ: అబ్బా కాస్త నోరు మూస్తారా..? ఏయ్‌ ఎవరు లోపల బయటికి రండి..

అని పిలవగానే.. వాష్‌ రూంలోంచి కేపీ వస్తాడు. కేపీని చూసిన అపూర్వ, సుజాత, నక్షత్ర షాక్‌ అవుతారు. కేపీ కోపంగా చూస్తూ..

కేపీ: ఏంటండి ఇది ప్రశాంతంగా వాష్‌ రూంకి కూడా వెళ్లనివ్వరా..? జరగండి..

అపూర్వ: కేపీ నీ రూంలో వాష్‌ రూం లేనట్టు ఈ రూంలోకి వచ్చావేంటి…

కేపీ: నా రూంలో ఉన్న వాష్‌ రూంలో వాటర్‌ రావడం లేదు. అందుకే ఈ రూంలో ఉన్న వాష్‌ రూంకి వచ్చాను. ఏంటండి దానికి కూడా మీ పర్మిషన్‌ కావాలా ఏంటి..? అయినా నిన్నటి నుంచి చెర్రి కనిపించడం లేదు. ఆ ఆందోళన బాధ మీలో కనిపించడం లేదు.

అపూర్వ: వాడు కనబడకపోతే నేనెందుకు బాధపడాలి కేపీ.

కేపీ: అదెంటండి అలా అంటారు. వాడు నా కొడుకు మాత్రమే కాదు. మీకు అల్లుడు కూడా..?  మర్చిపోయినట్టు ఉన్నారు.

అపూర్వ: ఎందుకు మర్చిపోతాను కేపీ..  నా కూతురు నక్షత్రకు ఇష్టం లేకపోయినా కట్టాడుగా బలవంతంగా తాళి. మర్చిపోయే విషయమా అది.

కేపీ: నేను అడుగుతుంది చెర్రి కనిపించకుండా పోయిన కంగారు మీకు కనిపించడం లేదని.

అపూర్వ: ఎందుకు కంగారు. సడెన్‌ గా వెళ్లిపోవడం మళ్లీ సడెన్‌గా రావడం చెర్రికి అలవాటేగా..? అలాగే ఎక్కడికి వెళ్లాడో ఏమో మళ్లీ తిరిగి వస్తాడులే

కేపీ: అపూర్వ గారు వాడు ఏమైపోయాడోనని మీరా మంచం పట్టింది. మీరేమో చాలా కూల్‌గా వస్తాడులే అంటున్నారు. ఏం మనుషులో ఏమో.. ఆ ఫోటోలేంటి..?

అంటూ కేపీ అడిగి  అక్కడి నుంచి వెళ్లిపోగానే.. అపూర్వ కోపంగా ఏడీ చెర్రి.. ఎక్కడ కనిపించడే.. అంటూ తిడుతుంది. దీంతో సుజాత అంటే అమ్మాయి ఇప్పుడు మనకు కేపీ రూపంలో కనిపించింది ఆ చెర్రి గాడి ఆత్మేమో అంటూ అనుమానంగా చెప్పడంతో నక్షత్ర మరింత భయపడుతుంది. అపూర్వ కోపంగా ఇద్దరినీ తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!