MeghasandesamSerial Today Episode:  కేపీ స్వామిజీ వేషంలో వచ్చి చెర్రిని, శోభాను అపూర్వనే చంపింది అని చెప్పి వెళ్లాక శరత్‌ చంద్ర కోపంగా అపూర్వను కొట్టి నీకు అంతకు అంతకు శిక్ష పడుతుంది అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. తర్వాత అపూర్వ ఆలోచిస్తూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని ఉంటుంది. అప్పుడే సుజాత వస్తుంది.

సుజాత: ఇదిగో అమ్మాయి ఇది చికెన్‌ బిర్యాని, ఇంకా మటన్‌ బిర్యానీ, ఫిష్‌ బిర్యాని కూడా నేను ఆర్డర్‌ చేశాను.

నక్షత్ర: ఏయ్‌ గోరింటాకు నీకేమైన మతి పోయిందా..? ఇవన్నీ ఎందుకు ఆర్డర్‌ పెట్టావు.

సుజాత: ఇంకా నీకు అర్థం కాలేదా..? బేబీ. ఇప్పుడు ఏదైతే మీ మమ్మీ ఇష్టంగా తింటుందో అదే చివరగా తినడం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు జైళ్లో చిప్ప కూడు తినాలి.

నక్షత్ర: అంతే అంటావా గోరింటాకు మమ్మీ అరెస్ట్‌ కాక తప్పదా..?

సుజాత: ఎలా తప్పుతుంది బేబీ. చేసిన మర్డర్‌ తీసిన గోతి.. పాతిన శవము చాలా క్లియర్‌ గా వీడియోలో ఉంది కదా..? నిన్ను అరెస్ట్‌ చేయడానికి ఏ క్షణమైనా పోలీసులు రావొచ్చు. తిను తిను ( అప్పుడే పోలీసులు వస్తారు.) అదిగో పోలీసులు వచ్చేశారు. రాత తిరగబడితే తిండికి కూడా కోత పడుతుందంటే ఇదేనేమో..?

పోలీసులను తీసుకుని కేపీ, మీరా ఇంట్లోకి వస్తుంటారు. వాళ్లను చూసిన అపూర్వ, నక్షత్ర భయపడుతుంటారు.

కేపీ: ఎస్సై గారు ఇదిగోండి నా కొడుకును చంపిన రాక్షసి అరెస్ట్‌ చేయండి.

మీరా: ఈవిడ జీవితాంతం జైళ్లోనే ఉండాలి.

ఎస్సై: చెర్రిని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నాం అపూర్వ గారు. కానిస్టేబుల్స్‌ అరెస్ట్‌ చేయండి. తీసుకురండి..

కేపీ: ఆగండి ఎస్సై గారు ఆవిడను ఒక్కరినే అరెస్ట్‌ చేస్తున్నారు మరి వీళ్ల సంగతి.

సుజాత: కేపీ మేము ఏం చేశాము అపూర్వ చేస్తుంటే మేము చూశాము అంతే

కేపీ: చూసిన కూడా క్రైమే అవుతుంది గోరింటాకు..

శరత్‌: వీళ్లను కూడా అరెస్ట్‌ చేయండి ఎస్సై గారు..

ఎస్సై: వాళ్లను కూడా అరెస్ట్‌ చేయండి..

అని చెప్పగానే.. ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు.

సుజాత: అల్లుడు గారు అడుక్కుంటున్నా వదలకుండా జైలుకు పంపిస్తున్నారు. మీకున్న ఇన్ప్లుయెన్స్‌ వాడి ఆ జైళ్లో అయినా ఏ ఖైదీనో కానిస్టేబుల్‌ నో నాకో పెళ్లి సంబంధం సెటిల్‌ చేయండి. మీ పేరు బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా కాపురం చేసుకుంటాను

అంటుంది. దీంతో అందరినీ పోలీసులు అరెస్ట్ చేయడం సుజాత కలగంటుంది. వెంటనే చికెన్‌ బిర్యాని లాక్కుని ఒక్కతే తింటుంది.

నక్షత్ర: ఏంటి గోరింటాకు మా మమ్మీకి తెప్పించానని చెప్పి నువ్వే తింటున్నావు మొత్తం

సుజాత: ఇప్పుడే నా మనోనేత్రంలో పోలీసులు వచ్చాక జరిగే దృశ్యం చూశాను బేబీ. మీ మమ్మీకే కాదు కటకటాల యోగం మనకు కూడా ఉంది. కాకపోతే  మీ అమ్మ కటకటాల రుద్రయ్యలాగా జైలులో రౌడీయుజం చేస్తూ ఉంటుంది. మనమేమో అల్లురామలింగయ్య లాగా తన వెనక భజన చేస్తూ తిరుగుతూ ఉంటాము.

నక్షత్ర: నోర్మూయ్‌ మమ్మీ చేసిన మర్డర్‌కు పోలీసులు మనల్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తారు గోరింటాకు.

అపూర్వ: మీరు నోర్మూస్తారా..?

అంటూ సుజాత, గోరింటాకును తిడుతుంది. ఏ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని నేను ఆలోచిస్తున్నాను అని అపూర్వ చెప్పగానే.. సుజాత, నక్షత్ర ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!